Link copied!
Sign in / Sign up
2
Shares

కొత్తగా తల్లి అయిన తరువాత తమ సరదా అనుభవాలను మాతో పంచుకున్న 5 మహిళలు


పిల్లల్ని పెంచడం మొదట్లో కష్టంగానే ఉండచ్చు. కానీ అవే కొంత కాలం తరువాత మధుర జ్ఞాపకాలుగా మారుతాయి. అప్పుడు మనం ఇబ్బంది పడ్డ క్షణాలు తరువాత గుర్తు వచ్చినప్పుడు నవ్వు వస్తుంది. ఇక్కడ కొందరు తల్లులు వారి పిల్లలను పెంచే క్రమంలో కొన్ని అనుభవాలను  పంచుకుంటున్నారు. అవేంటో మీరే చూడండి, ఆనందించండి.

1. డైపర్ ఇంకా పూర్తిగా మార్చేలోపే

ఆరోజు నేను ఒక్కదానినే నా చిన్నారికి డైపర్ మెరుస్తున్నా, మాములుగా మా అమ్మ కానీ, భర్త కానీ డైపర్ మార్చడంలో సహాయం చేసే వారు. నాకు తెలుసు నా చిన్నారి అప్పుడే డైపర్ని పాడు చేసాడు అని. కానీ, తనకి ఎంత తొందరగా మళ్ళి పూ వస్తుందన్న విషయం నాకు తెలీదు. డైపర్ మెరుస్తుంటే ఏద్వడం మొదలు పెట్టాడు, నేను చల్లగా చేతులు తగలడం వలన అనుకున్నా. నేను తప్పు అని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. డైపర్ ఇంకా పూర్తిగా మార్చేలోపే పూ వెళ్ళాడు, నా చేతి మీదంతా పడింది. వెచ్చగా, ద్రవంలా నా చేతి మీది అది పడినప్పుడు కలిగిన ఫీలింగ్ ఎప్పటికి మర్చిపోలేను.

సంగీత పి, 27

2. ఎక్కడ దాగున్నారు

నేను కవల పిల్లల తల్లిని. ఒక అల్లరి పిల్లవాడు ఉంటేనే భరించడం కష్టం, అలాంటిది ఇద్దరు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఒక రోజు వాళ్ళిద్దరిని తీసుకొని ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాను. ఒకడు నన్ను ఆటపట్టించడానికి బట్టల కప్బోర్డులో దాక్కున్నాడు. ఇంకొక్కడు నాతో చెప్పకుండా వాడిని ఇరికిద్దామని సూపర్ మార్కెట్ ఓనెర్తో చెప్పాడు. అప్పుడు ఆ ఓనర్ నాకిచ్చిన బిరుదు ఏంటో తెలుసా… భాద్యత లేదా నీకు, పిల్లలను ఎలా పడితే అలా వదిలేస్తావా అని అనడం. చూసారా, పిల్లలు చేష్టలు ఎంత విచిత్రంగా ఉంటాయో.

చిత్ర ఎం, 25.

3. 2 సెకండ్లు ఏమరుపాటుగా ఉన్నాను.. అంతే

ఇంటిని చిందరవందర చేయడానికి ఒక సెకండ్ చాలు, కానీ సర్దడానికి ఒక రోజు పడుతుంది. ఈ విషయం న చిన్న కూతురు ద్వారా తెలిసింది. నేను నా కూతురు ఆడుకుంటుండగా కుక్కర్ సౌండ్ వినిపించింది. ఆపడానికి అని 2 సెకండ్లు ఆలా వెళ్లానో లేదో రూమ్ అంత చిందరవందర చేససింది. బొమ్మలు నెల మీద, లిప్ స్టిక్ తో గోడ మీద బొమ్మలు ఇలా ఒకటి కాదు, రూమ్ మొత్తం సర్దడానికి నాకు ఆ రోజంతా పట్టింది.

తామారా యూ, 22

4. వాంతి

ఒక పెళ్ళికి వెళ్లి చాలా అలసటగా ఇంటికి వచ్చాను. మంచి చీర, నగలను వేసుకొని ఉన్న నేను నా చిన్నారిని చూడటానికి ఎంతో ఆరాటంగా వెళ్ళాను. అమ్మ తనకి తినిపించి, తెంపు కూడా తెప్పించి అని చెప్పింది. నేను వెళ్లి చిన్నారితో ఆడుకుంటూ రెండు సార్లు అలా పైకి ఎగరేసా. బాగానే ఉంది కానీ మూడో సారి ఎగరేసినప్పుడు తాను వాంతి చేసుకుంది. న ముఖం మీదంతా పడి విచిత్రంగా అనిపించింది.

డాలీ స్, 26.

5. జుట్టు ఊడిపోతుంది 

నా చిన్నారి ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టిన క్షణానే నాకు తెలుసు, తన కోసం ఏమైనా చేయడానికి నేను సిద్ధం అని. తనే నా ప్రపంచం, కానీ ఇలా గుండు కొట్టుకోవాల్సి వస్తుందని మాత్రం నేను అనుకోలేదు. పెద్ద కథను చిన్నగా చెప్తాను, ఒక రోజు నేను బెడ్ మీద పడుకొని నా చిన్నారిని నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తున్నా, తాను మాత్రం నా అటెంషన్ కోరుకోవడానికి గట్టిగ జుట్టు పట్టి లాగాడు. కొంత జుట్టు ఊడి వాడి చేతిలోకి వచ్చింది. ఇది రోజు జరిగి నా జుట్టు కాస్త పిడికెడంత అయ్యింది. 

జునా సి, 23. 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon