Link copied!
Sign in / Sign up
6
Shares

కొత్తగా పుట్టిన బిడ్డతో మొదటి బిడ్డ కలిసి మెలిసి ఉండాలంటే ఏమి చేయాలి?


ఇంకో బిడ్డకు కణాలనుకోవడం అనేది ఒక పెద్ద నిర్ణయమే. ఎందుకంటే అది మీ అర్ర్ధిక పరిస్థితులను మాత్రమే కాదు, మొదటి బిడ్డను కూడా ప్రభావితం చేస్తుంది. ఇప్పటి వరకు ఒక్కడికే ఉన్న తల్లి దండ్రుల ప్రేమను పంచుకోవడానికి తను ఎంత వరకు ఇష్టపడుతాడో మనం చెప్పలేం. కానీ, మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, మొదటి బిడ్డ ఎటువంటి బాధ లేకుండా కొత్తగా ఇంట్లోకి వస్తున్న బిడ్డను ఆహ్వానిస్తాడు.

1. తెలియ చెప్పండి

మీరు ప్రెగ్నన్సీతో ఉన్నపుడు మీ పిల్లలకు ఇంట్లో ఇంకో కొత్త మనిషి రాబోతున్నారు అని తెలియ చెప్పండి. ఎలా చెప్పాలి అని అంటే తన చిట్టి చెల్లి లేదా తమ్ముడు కోసము తాను ఎదురు చూసే లాగ చెప్పండి. ఇటువంటి సమయంలో పిల్లలు ఎలా పుడతారు వంటి అనేకమైన విచిత్రమైన ప్రశ్నలకు సిద్ధంగా ఉండండి. వారి అమాయకపు ప్రశ్నలకు సమాధానం చెప్పడం కంటే బిడ్డను కనడమే సులువుగా అనిపిస్తోంది కదా.

2. ఇన్వొల్వె చేయండి

రెండవ బిడ్డ విషయంలో మీ మొదటి బిడ్డను ఎంత వీలైతే అంత ఇన్వాల్వ్ చేయండి. మీ చిన్నారి పెంపకంలో మొదటి బిడ్డను కూడా ఇన్వొల్వె చేయండి. చిన్న చిన్న పనులు చేయడంలో ఉన్న ఆనడం వారికి నేర్పండి. చిన్నారిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పండి.

3. ప్రశ్నలు అడగండి

మీ బిడ్డనేనా మిమ్మల్ని ప్రశ్నలు అడిగేది. మీరు కూడా అడగండి. తన అభిప్రాయం తెలుసుకోండి, ఎక్కడ బాధ పడుతున్నారో తెలుసుకొండి. అంతేనా, చిన్నారికి ఏ రంగు బట్టలు బాగుంటాయో అడగండి, ఎటువంటి ఉయ్యాల కొనాలో వంటివి అడుగుతూ ఉండండి. తన ద్వారా చిన్నారికి అన్ని వస్తున్నందుకు అసూయ పడడు మరియు చిన్నారిని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాడు.

4. ఇద్దరి పిల్లలకు తగిన సమయాన్ని కేటాయించండి

చెప్పనవసరం లేదు, పసి బిడ్డ మీ పూర్తి సమయాన్ని ఆశిస్తుందని. కానీ, ఈ క్రమంలో పెద్ద బిడ్డను నిర్లక్ష్యం చేయకండి. ఎంతో కొంత క్వాలిటీ సమయం మీ పెద్ద బిడ్డకు కూడా కేటాయించడానికి ప్రయత్నించండి.

5. బహుమతులు

కానుకలు అనేవి ఎపుడదో మంచి ఉపాయమే. చిన్నారికి కావాల్సినవి కొనడానికి  వెళ్ళినప్పుడు తప్పకుండ పెద్ద బిడ్డకు ఎదో ఒక్కటి తీసుకొని రండి. కొత్తగా ఇంకొక్కరు రావడం వలన తన మీద ప్రేమ తగ్గలేదు అని తెలియ చేయండి. అంతేకాకుండా, ఇద్దరు బొమ్మలను పంచుకొని ఆడుకోవడాన్ని ప్రాత్సహించండి. మీ చిన్నారి కోసం కానుకలు తీసుకొని ఎంతో మంది సన్నిహితులు వస్తుంటారు, వాటిలో కొన్ని పెద్ద వాడికి కేటాయించండాం మరువకండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon