కొత్తగా అమ్మ అయిన ప్రతి ఒక్కరి దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన 6 వస్తువులు
ప్రెగ్నన్సీ నుంచి డెలివరీ వరకు అన్ని మీరు అనుకున్న ప్లాన్ ప్రకారమే జరిగాయా. కానీ ఇంకా జరగాల్సింది చాలా ఉంది. ఇపుడు మీరు కొత్తగా అమ్మ అయ్యారు. చేయాల్సిన పనులు , మోయాల్సిన భాద్యతలు పెరిగి పోయాయి. అయితే ఈ భాద్యతలను, పిల్లల పెంపకాన్ని మీరు సులభంగా చేయడానికి సహాయపడే వస్తువులు ఉన్నాయి. తప్పకుండా మీ దగ్గర ఉండాల్సిన అలాంటి వస్తువులు ఇవే….
1.డైపర్స్ (Diapers)

వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లలు ఉండే ప్రతి ఇంట్లో తప్పకుండ ఉండి తీరాల్సిందే. అయితే మార్కెట్ లో మంచి క్వాలిటీ ఉన్న డైపర్స్ని మాత్రమే వాడండి. క్వాలిటీ తక్కువ ఉన్న డైపర్స్ వాడితే పిల్లలకు రాషెస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
2.బేబీ సీట్(Baby seat)

మీరు కార్లో బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని సార్లు పిల్లల్ని కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు సాధారణంగా ఉండే కార్ సీట్ లో పసి పిల్లల్ని ఉంచడం కుదరదు, ప్రమాదం కూడా. అందుకే పిల్లలను కూర్చో పెట్టడానికి వీలుగా ఉండే బేబీ సీట్ ను మీ కార్ లో ఏర్పాటు చేసుకోండి. దీంట్లో పిల్లలు సేఫ్ గా ఉంటారు.
3.బేబీ క్యారియర్(Baby carrier)

మీరు పిల్లల్ని ఎత్తుకున్నపుడు వేరే ముఖ్యమైన పనులు చేయడానికి చేతులు కాళిగా ఉండవు. అందుకే మీ పిల్లల్ని ఎత్తుకోడానికి, ఎక్కడికైనా సులభంగా మీతో పాటు తీసుకెళ్ళడానికి ఒక బేబీ క్యారియర్ ఉండడం మంచిది. మీకు ఒక వేళ బేబీ క్యారియర్ అలవాటు లేకపోతే, కొత్తగా వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి.
4.స్ట్రోలర్(Stroller)

దీంట్లో మీ పిల్లలను ఎక్కడికైనా సులభంగా తీసుకొని వెళ్ళచ్చు. ఆలా తీసుకొని వెళ్ళేటప్పుడు, పిల్లలకు నిద్ర వస్తే ఆపుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లోనే సౌకర్యంగా నిద్రపోడానికి వీలు ఉంటుంది. అయితే స్ట్రోలర్ లో పిల్లలు ఉన్నపుడు, దాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టదు.
5.క్రిబ్(Crib)

చిన్న పిల్లలు ఉన్నపుడు క్రిబ్, ఉయ్యాల తొట్టి తప్పకుండా ఇంట్లో ఉండాలి. మీతో పాటు పిల్లలు బెడ్ మీద నిద్రపోవడం, పిల్లలకు మీకు ఇబ్బందిగా ఉంటుంది. పిల్లల్లను ఉయ్యాల తొట్టిలో ఉంచడం మంచిది. అది వారికీ సేఫ్ కూడా. ఇప్పుడు కొత్త క్రైబ్స్ అందుబాటులో ఉన్నాయి, వాటిలో మీ పిల్లలకు సౌకర్యంగా ఉండేది ఎంచుకోండి.
6.బేబీ వైప్స్(Baby wipes)

పిల్లలుకు ఏదైనా తినిపించేటప్పుడు ముఖం మొత్తం పూసుకుంటారు. అలాంటప్పుడు ప్రతి సారి నీళ్ళతో కడగడం వీలుగా ఉండదు. అందుకే ఎప్పుడు బేబీ వైప్స్ దగ్గర ఉంచుకోండి. ఇంకా చాలా సందర్భాలలో ఉపయోగపడుతాయి.
