Link copied!
Sign in / Sign up
4
Shares

కొత్తగా అమ్మ అయిన ప్రతి మహిళ ఎదురుకోవాల్సిన 7 సవాళ్ళు : ఇలా మీకు ఎదురయ్యాయేమో చూడండి 👏👏

మీకు పిల్లలు పుట్టిన తర్వాత మరిన్ని బాధ్యతలు పెరుగుతాయి. మీ అభిరుచులు, ఇష్టాలు మారిపోతాయి, జీవితంలో ఈ సమయం మీకు చాలా కొత్తగా ఇష్టంగా అనిపిస్తుంది. అదే విధంగా ఈ దశలో మీకు ఒత్తిడి ఉండటం, ఉత్సుకత ఉండటం వంటివి గమనించవచ్చు. వీటితో పాటు మీకు ఎదురయ్యే సమస్యలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే,

మీ అత్త వలన 

నా మనవడిని లేదా మనవరాలిని నేను పెంచాలి అన్న భావన మీ అత్తలో ఉంటుంది. దీని వల్ల వారు మీ బేబీపై ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు. వారి బాగోగులు మీఅత్త చూసినప్పుడు మీకు కొంచెం ఇబ్బందిగా, ఒత్తిడిగానూ ఉంటుంది.

కొత్త మరియూ పాత పద్ధతుల వలన 

బేబి సంరక్షణకు వచ్చేసరికి మీకు, మీ అత్త గారికి వాదనలు జరగవచ్చు. మీరేమో కొత్త పద్ధతుల ద్వారా మీ బేబీని పెంచాలని అనుకుంటారు కానీ అత్త గారేమో  పాత పద్ధతులను అనుసరిస్తారు. దీంతో మీరు కొంత ఒత్తిడికి గురవుతారు. ఇలాంటి సమయాలలో మీ అత్త గారితో మాట్లాడండి, మీరు ఎందుకు కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారో వివరించి ఆమెను ఒప్పించండి, ఒకవేల ఆమె చెప్పిన విషయం మంచిది అని అనిపిస్తే మీరు ఆమెను ఫాలో అయ్యి సంతోషంగా ఉండండి.

భర్తలు

పిల్లలు పుట్టడం వల్ల కొందరు మంచి ఆనందాన్ని పొందితే, కొందరు తల్లిదండ్రులకు పెంపకంలో ఉండే ఇబ్బందుల వల్ల అపార్థాలు వస్తాయి. కొందరి భర్తల ప్రవర్తన వల్ల మీ వివాహ బంధం పిల్లలు పుట్టిన తర్వాత మరింత బాగుంటుంది, కొందరి భర్తల వల్ల మీ బంధం దెబ్బ తినే అవకాశం ఉంది. కాబట్టి మీరు, మీభర్త సయోధ్యగా ఉండండి.

మీ భర్తను నెగ్లెక్ట్ చేయకండి

మీకు బాబు పుట్టిన తర్వాత తనే మీ సర్వస్వం అనుకుంటారు. ఒక తల్లిగా మీరు చేస్తున్నది కరెక్టే. కానీ మీ భర్త కూడా మిమ్మల్ని తనదని బావిస్తూ ఉంటాడు, తనకు దగ్గరగా, అనుకూలంగా ఉండాలని, తనకు ప్రాముఖ్యత ఇవ్వాలని బావిస్తారు. కాబట్టి మీ భర్తతో మాట్లాడి ఎలాంటి గ్యాప్ లేకుండా చూసుకోండి.

రొమాన్స్

చాలా మంది జంటల్లో పిల్లలు పుట్టిన తర్వాత సెక్స్ చేసుకొనే శాతం తగ్గిపోతుంది. భర్త శృంగారం మీద శ్రద్ధ చూపినప్పటికీ భార్య మునుపటిలా పాల్గొనలేకపోవచ్చు. దీంతో సహజంగానే భార్య ఒత్తిడికి గురవుతుంది. అలాంటప్పుడు మీ సమస్యను మీ భర్తతో చర్చించండి, మీ బాగస్వామి కచ్చితంగా అర్థం చేసుకుంటారు.

బరువు - అందం

బేబికి జన్మనిచ్చిన ప్రతి మహిళా తమ అందం గురించి, తమ లావు గురించి విపరీతంగా బాధపడతారు. తమ బరువు పెరిగిందని ఒత్తిడికి కూడా గురవుతారు. అయితే, ఇవన్నీ ప్రతి మహిళకు సహజం అని గుర్తించండి. వ్యాయామం చేయడం ద్వారా మీరు తిరిగి మునుపటిలా తయారవగలరని గుర్తించండి.

పార్టీస్

చాలా మంది పార్టీస్‌కు వెళ్ళడం ఒక హాబీగా ఉండి ఉంటుంది. అయితే పిల్లలు పుట్టిన తర్వాత మీకు సమయం దొరకకపోవడం వల్ల మీరు పార్టీస్‌కు, శుభకార్యాలకు వెళ్ళలేకపోతారు. అయితే ఇవన్నీ కూడా తాత్కాలికం అని మీరు గుర్తించాలి. మీరు త్వరలోనే మునుపటిలా తయారవగలరని గుర్తించి ఆనందంగా ఉండండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon