Link copied!
Sign in / Sign up
9
Shares

కొబ్బరి నూనె: పిల్లల పాలిట అమృతం - దీని ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు


ఈ మధ్య కాలంలో కొబ్బరి నూనె పప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అవుతోంది. దీనికి కారణం కేవలం జుట్టుకు రాసుకోవడానికే కాక అనేక విధాలుగా ఉపయోగాలు తెలియడం. ముఖ్యంగా ఇది పిల్లలకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. పిల్లలు ఎదుర్కుంటున్న అనేక సమస్యలను కొబ్బరి నూనె సులువుగా తగ్గిస్తుంది.

1. తలపైన చర్మం మీద పొరల్లా ఏర్పడటం

పిల్లలను ఉయ్యాలలో లేదా దిండు మీద పడినప్పుడు వారి తల రుద్దుకొని దిండుకి అనే ప్రదేశంలో తెల్లని పొరల్లా ఏర్పడుతుంది. చూడటానికి ఇది చుండ్రులా కనిపిస్తుంది. ఇది పసి పల్లాలు ఎదుర్కునే అతి సాధారణ సమస్య. దీనిని సులువుగా కొబ్బరి నూనెతో నివారించుకోవచ్చు. ఈ సమస్యకు ప్రభావితం చెందిన చోట కొబ్బరి నూనెతో కాసేపు మర్దన చేయండి. ఒక 20 నిమిషాల తరువాత జుట్టుతో ఆ పొరల్లా ఏర్పడిన వాటిని దువ్వెనతో మృదువుగా దువ్వడం ద్వారా తీసేయండి. తరువాత గోరు వెచ్చని నీతితో తలా స్నానం చేయించండి.

2. డైపర్ రాష్

డైపర్ రాష్ కూడా దాదాపు అందరు పిల్లలు ఎదుర్కునే సమస్య. సాధారణంగా పిల్లలు మూత్రవిసర్జన చేయడం ద్వారా డైపర్ తడిగా అయ్యి రషెస్ వస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ రషెస్ వచ్చి పిల్లలను ఇబ్బంది పెడతాయి. ఎలాంటి సమయంలోనే కొబ్బరి నూనె సహాయపడుతుంది. రషెస్ వచ్చిన చోట ఈ ఆయిల్ పూస్తే రాషెస్ పాకకుండా, మరింత డైపర్ వలన రాపిడి కలగకుండా చేస్తుంది. అంతే కాకుండా ఈ రాషేస్ని కూడా నయం చేస్తుంది.

3. మృదువైన జుట్టు

కొన్ని రోజుల తరువాత పిల్లల జుట్టు పొడి బారి చిక్కులు పడుతుంది. దువ్వడానికి, ఒక పద్దతిలో జుట్టుని తీసుకు రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. కొబ్బరి నూనె జుట్టుని మృదువుగా చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. రాత్రి పూట పిల్లలకు కొబ్బరి నూనెతో మర్దన చేసి ఉదయాన్నే స్నానం చేయించండి.

4. బగ్ బైట్స్

చిన్నపిల్లల చర్మం చాలా మృదువుగా ఉంటుంది. దోమలు, చిన్న చైనా పులుగులు కుట్టినా వారి చర్మం కందిపోతుంది. ఇలా చిన్న చిన్న వాటికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్లలేము కనుక మనం అలాగే ఉంటాము. కానీ సింపుల్గా కొబ్బరి నూనె రాస్తే చాలు అవి తగ్గిపోతాయి. పిల్లలకు నొప్పి కూడా ఉండదు. అంతే కాకుండా పిల్లల చర్మం పొడి బారిపోకుండా ఉంటుంది.

5. పేన్లు

పిల్లల తలలో పెన్లు పడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. వాటిని తీసెయ్యడం అంత సులువైన పని కాదు. కానీ కొబ్బరి నూనె ఉంటె భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెన్లు ఉంటె ఈ చిట్కా వాడండి, వెంటనే తగ్గిపోతాయి. Apple cider vinegarని కొంచెం నీళ్లలో కలిపి పిల్లల జుట్టుకి రాయండి. అది ఆరంత వరకు ఉంది కొబ్బరి నూనె రాయండి. ఎంత సేపు వీలైతే అంత సేపు ఉంచి తలస్నానం చేయండి.

కొబ్బరి నూనెలు యాంటీ బాక్టీరియా గుణాలు ఉంటాయి. ఇవి పెన్ల ఉత్పత్తి జరగకుండా చూస్తాయి. వినెగర్ ఉన్న పెన్లను చంపేస్తాయి.

6. గాయాలను మాన్పుతుంది, నొప్పిని తగ్గిస్తుంది

ముందుగా చెప్పినట్టు కొబ్బరి నూనెలో యాంటీ ఇంఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియా గుణాలు ఉంటాయి. అనువలన దీనిని దెబ్బ తగిలిన చోట రాస్తే తగ్గుతుంది. అంటే చిన్న చిన్న దెబ్బలు మాత్రమే, పెద్ద దెబ్బలు అయితే తప్పకుండ డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ని సంప్రదించాలన అవసరం లేదు అనుకునే చిన్నగా గీసుకోవడం వంటి వాటికి కొబ్బరి నూనె పూస్తే తగ్గిపోతుంది. నొప్పి కూడా అంతగా ఉండదు.

ఇవే కాకుండా మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకే అన్నాము, పిల్లల పాలిట కొబ్బరి నూనె అమృతము, మంచి నేస్తం అని. మంచి నేస్తంలా సంతోషంగా ఆరోగ్యాంగా ఉండేలా చేస్తుంది, అమృతంలా అన్ని సమస్యల నుండి రక్షిస్తుంది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon