Link copied!
Sign in / Sign up
10
Shares

కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి? కిడ్నీ స్టోన్స్ రాకుండా చేసే ఉత్తమ ఇంటి చిట్కాలు

మూత్రపిండాలలో ఏర్పడే గట్టి పదార్థాలనే కిడ్నీ స్టోన్స్ అని పిలుస్తారు. సరైన పోషక ఆహారం సరైన సమయానికి తీసుకోకపోవడం, మల మూత్ర విసర్జన ఎక్కువ సమయం ఆపుకోవడం, విటమిన్ డి లోపం, నీరు తక్కువగా తీసుకోవడం, కిడ్నీల ఇన్ఫెక్షన్, కాల్షియం ఫుడ్స్ తీసుకోకపోవడం, మూత్రం సమయంలో మంట రావడం, కొన్ని సార్లు మూత్రంతో పాటు బియ్యం కంటే చిన్న సైజులో రావడం జరుగుతుంది.

కిడ్నీలో రాళ్లు ఉన్నాయని గుర్తించాలి?

మీకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా లేదా అనుమానం ఉన్నప్పుడు వీపు కింద నొప్పి ఎక్కువగా ఉండి, పొత్తి కడుపుకు వ్యాపించడం, అలాగే మూత్రం పోస్తున్నప్పుడు మంటగా ఉండటం, వణుకుతో కూడుకున్న జ్వరం, అలసట, మూత్రం రంగు మారటం (ఎరుపు లేదా పసుపు వర్ణం ఎక్కువగా ఉండటం) ఈ విధంగా ఉంటే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించి కిడ్నీ చెకప్ చేయించుకోవాలి.

కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉత్తమ ఇంటి చిట్కాలు
తులసి రసం తేనె

కొన్ని తులసి ఆకులను తీసుకుని బాగా రసం వచ్చేలా దంచుకోవాలి. ఒక స్పూన్ తులసి రసంలో ఒక స్పూన్ తేనె కలిపి ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం వలన కిడ్నీలో స్టోన్స్ ఏర్పడవు మరియు ఉన్నా కూడా కరిగిపోతాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, ఒక స్పూన్ నిమ్మరసం మరియు ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేసుకుని రోజుకి రెండు సార్లు సేవించడం వలన కిడ్నీలలో నొప్పి ఉండదు మరియు కిడ్నీ స్టోన్స్ ను కరిగించివేస్తుంది.

కొత్తిమీర రసం

కొన్ని కొత్తిమీర ఆకులను తీసుకుని బాగా ఉడికించాలి. ఈ ఉడికించిన మిశ్రమాన్ని వేడి చేసుకుని ప్రతి రోజూ కొద్దిగా తీసుకోవడం వలన కిడ్నీలో స్టోన్స్ కు గుడ్ బై చెప్పవచ్చు.

దానిమ్మ జ్యూస్

వారానికి ఒకసారి దానిమ్మ గింజలు తినడం లేదా దానిమ్మ జ్యూస్ ను ఖాళీ కడుపుతో సేవించడం వలన కిడ్నీ స్టోన్స్ సమస్య ఉండదు. కడుపులో ఉన్న వ్యర్థాలను బయటకు తరిమిట్టగల శక్తి దానిమ్మకు కలదు.

నీరు

కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలంటే కనీసం 3 లీటర్ల నీటిని తీసుకోవడం చేయాలి. ఈ మోతాదుకు తక్కువైతే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

తేనె ఆపిల్ సైడర్ వెనిగర్

ముందుగా ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఒక స్పూన్ తేనె కలిపి గ్లాస్ నీటిలో రెండిటినీ మిక్స్ చేసి తీసుకోవడం వలన కిడ్నీ స్టోన్స్ సమస్య ఉండదు.

నిమ్మరసం

ప్రతిరోజూ ఉదయం ముఖం, నోరు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఒక గ్లాస్ నిమ్మరసం లేదా నిమ్మరసం లేదా రెండు స్పూన్ల తేనె కలిపి తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడవు.

ఈ ముఖ్యమైన సమాచారాన్ని అందరికీ SHARE చేయగలరు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon