Link copied!
Sign in / Sign up
0
Shares

కనురెప్పలు, కనుబొమ్మలు అందంగా కనిపించేందుకు 5 అందమైన చిట్కాలు..

మనలో ఎదుటివారికి నచ్చేదేమిటి? అని ఎవరినైనా అడిగితే, నీ నవ్వు అంటే చాలా ఇష్టం, నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది, నీలో ప్రధాన ఆకర్షణ నీ కళ్ళు, నీ కంటిచూపు అని చాలామంది మీకు చెప్పే ఉంటారు. ఎస్, ప్రతి ఒక్కరిలోనూ ఆకర్షణమైనవి, అందాన్ని మరింత పెంచేవి కళ్ళు మాత్రమే. అందంగా కనిపించేందుకు ముఖానికి వేసుకోవడం, పెదవులకు లిప్స్టిక్ అప్లై చేసుకోవడం ఇలా సాధారణంగా అందరూ చేస్తున్నావే. అయితే కనుబొమ్మలు మరియు కనురెప్పల గురించి చాలా తక్కువమందే పట్టించుకుంటూ ఉంటారు. అందుకే, ఇక్కడ మీ కనుబొమ్మలు మరియు కనురెప్పల అందాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలో చూడండి.. 

ఆముదం మరియు కొబ్బరినూనె 

ఒకటి లేదా రెండు చుక్కల ఆముదంలో మరో చుక్క కొబ్బరినూనె కలిపి మిక్స్ చేయాలి. ఇందులో కాటన్ లేదా బ్రష్ ఉంచి, కనురెప్పలు మరియు కనుబొమ్మలపై అప్లై చేసుకుని పడుకోవాలి. ఉదయాన్నే కాస్త గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వలన కనురెప్పలు సంరక్షితంగా మరియు అందంగా ఉంటాయి. అలాగే దట్టంగా అందమైన వెంట్రుకలు పెరుగుతాయి. కొబ్బరినూనె అవసరం లేకుండా ఆముదం అయినా రాసుకోవచ్చు. ఇక ఆముదంకు బదులుగా రోజ్ మేరీ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ ఉపయీగించుకోవచ్చు. ప్రతి రోజూ రాత్రి పడుకునేముందు ఇలా చేసుకుంటే సరిపోతుంది. 

అలోవెరా జెల్ 

అలోవెరా జెల్ వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఇంటి పరిసరాలలో ఇది ఉండాలని మన పెద్దలు, ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. కనురెప్పలు అందంగా ఉండేందుకు, కనురెప్పలు వెంట్రుకలు బాగా ఆకర్షణీయంగా కనిపించేందుకు కాస్త తాజా అలోవెరా జెల్ తీసుకుని కనురెప్పలపై రాసుకోవాలి. ఉదయాన్నే నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చాలా సులభమైనది. మీ కనురెప్పలు అందంగా కనిపించేందుకు బాగా ఉపయోగపడుతుంది. 

వాజిలిన్ లేదా పెట్రోలియం జెల్లీ 

కాస్త పెట్రోలియం జెల్లీని తీసుకుని కనురెప్పలు మరియు కనుబొమ్మలపై రాసుకుని నిద్రించాలి. ఇది కనురెప్పలపై రాసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉదయాన్నే చల్లని నీటితో కనురెప్పల వెంట్రుకలపై పెట్రోలియం జెల్లీ లేకుండా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇది కనురెప్పల వెంట్రుకలు అందంగా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. 

మెంతి నూనె 

సాధారణమైనంతవరకు సహజ చిట్కాలను వాడటమే మంచిది. ఒక స్పూన్ మెంతి నూనెలో రెండు లేదా మూడు చుక్కల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసుకుని అందులో కాటన్ ఉంచి కనురెప్పలపై మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన కనురెప్పలు అందంగా ఉంటాయి మరియు ఒత్తుగా పెరుగుతాయి. ఉదయాన్నే బాగా శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. 

నిమ్మ తొక్కలు 

ఒక నిమ్మకాయను తీసుకుని వాటిపై నిమ్మతొక్కలను చిన్నగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. మూడు స్పూన్లు ఆలివ్ ఆయిల్ లేదా ఆముదం తీసుకోవాలి. ఇందులో నిమ్మతొక్కలు వేసి రెండు రోజుల పాటు ఉంచాలి. ఈ మిశ్రమాన్ని రెండు రోజుల తర్వాత కనురెప్పలపై అప్లై చేసుకుని నిద్రించి, ఉదయాన్నే నీటితో బాగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన కనురెప్పలు అందంగా ఉంటాయి. చాలామంది కనురెప్పలను ఎక్కువగా రుద్దటం చేయడం వలన కనురెప్పలపై ఉన్న వెంట్రుకలు రాలడం మరియు కళ్ళు ఎరుపుగా ఉండి మంట పుట్టడం జరుగుతుంది. అందుకని ఇలా ఎప్పటికీ చేయకండి. 

శరీరంలో ప్రధాన ఆకర్షణ అయిన కళ్ళను, కనురెప్పలను అందంగా ఉంచుకోవడానికి ఈ చిట్కాలు ఉపయోగపడతాయని మీకు అనిపిస్తే షేర్ చేయండి..

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon