Link copied!
Sign in / Sign up
4
Shares

కంటికింద నల్లని మచ్చలను 10 నిముషాలలో దూరం చేసే అద్భుత ఇంటి చిట్కాలు

మహిళలు ఎంత అందంగా ఉన్నా కూడా కంటి కింద నల్లటి వలయాల కారణంగా బయటకు రావడానికి, ఏదైనా ఫంక్షన్ లకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇక్కడ చెప్పుకునే ఈ సింపుల్ టిప్స్ ను మీరు ఫాలో అయినట్లయితే వెంటనే ఈ  సమస్య నుండి బయటపడవచ్చు.

కంటి కింద నల్లటి వలయాలు రావడానికి కారణాలు

కంటి కింద నల్లటి వలయాలు లేదా నల్లటి మచ్చలు రావడానికి సరైన నిద్రలేకపోవడం, డిప్రెషన్, ఒత్తిడి, ఎండలో తిరిగి వచ్చినప్పుడు,  విటమిన్ బి-12 లోపం, అనారోగ్యం, సిరలలో రక్తస్థాయి తగ్గిపోవటం, అలసిపోయినప్పుడు కంటి కింద మచ్చలు లేదా నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. వీటినే డార్క్ సర్కిల్స్ అని అంటారు.

డార్క్ సర్కిల్స్ తగ్గడానికి ఇంటి చిట్కాలు
పచ్చి పాలు

పచ్చి పాలలో దూదిని ఉంచి, ఆ దూదితో కళ్ళ కింద మసాజ్ చేసుకోవడం వలన డార్క్ సర్కిల్స్ త్వరగా తగ్గిపోతాయి.

కీరదోస, ఆలు, తేనె

కీరదోస, ఆలుగడ్డను సగానికి కోసి రెండిటిని బాగా మెత్తగా చేసుకుని వాటి నుండి గుజ్జును బయటకు తీయాలి. ఇందులో ఒక స్పూన్ తేనె మరియు ఒక స్పూన్ అలోవెరా జెల్ కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని నల్లటి వలయాల కింద రాసుకోవడం వలన డార్క్ సర్కిల్స్ తగ్గి ప్రకాశవంతంగా ఉంటాయి.

నిమ్మ, టమాటో మరియు శనగపిండి

ఒక స్పూన్ నిమ్మరసం మరియు టమోటో రసాన్ని గిన్నెలోకి తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ శనగపిండి కలుపుకుని మిశ్రమంగా చేసుకున్నాక కంటి కింది వలయాలపై రాసుకోవడం వలన ఈ సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.

రోజ్ వాటర్

రోజ్ వాటర్ లో దూదిని కొన్ని నిముషాల పాటు ఉంచి బయటకు తీసి కళ్ళను మూసి కళ్లపై రోజ్ వాటర్ లో ఉంచిన దూదిని పెట్టుకోవాలి. 5 లేదా 10 నిముషాల తర్వాత వీటిని తీసివేసి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

తేనె

కంటి కింద నల్లటి మచ్చలతో ఇబ్బందిపడేవారు తేనెను నల్లటి మచ్చలపై రాసుకుని మసాజ్ చేసుకోవాలి. పది నిముషాల తర్వాత క్లీన్ చేసుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

పుదీనా రసం

తాజా పుదీనా ఆకులను తీసుకుని మెత్తగా నూరుకోవాలి. ఈ పుదీనా రసాన్ని కళ్ళ చుట్టూ రాసుకుని 5 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

తేనె మరియు బాదం ఆయిల్

రెండు స్పూన్ల తేనె మరియు బాదం ఆయిల్ తీసుకుని మిక్స్ చేసుకోవాలి. రాత్రి పడుకునేముందు ఈ మిశ్రమాన్ని కళ్ళ కింద నల్లటి వలయాలపై అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ఈ సమస్య మటుమాయం అవుతుంది.

గమనిక : వీటిలో మీకు నచ్చినది, సులువైనదే చేసుకోవచ్చు. అన్నిటినీ ఉపయోగించాల్సిన అవసరం లేదు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon