Link copied!
Sign in / Sign up
3
Shares

కాన్పు తర్వాత నెలసరి ఎప్పుడు అవుతుంది..!

 గర్భం ధరించిన తర్వాత శరీరంలో వచ్చే మార్పులవల్ల వత్తిడి కలుగుతుంది. అయితే కథ ఇక్కడితో అయిపోదు. ఆడవాళ్లకు నెలవారీ ఋతుచక్రం రాకుండా ఆగిపోతే గర్భం ధరించినట్టు లెక్క. దీన్నే నెల తప్పడం అంటారు. నెల తప్పకుండా ఉంటే రెగ్యులర్ గా బ్లీడింగ్ (రక్తస్రావం) అవుతుంది.

గర్భం ధరించాక ఋతుచక్రం 

నెల తప్పిన తర్వాత కాన్పు అయ్యి, ఆ తర్వాత మూడు నాలుగు నెలల వరకూ ఋతుచక్రం జరగదు. అయితే ఒక్కోసారి గర్భం ధరించిన తర్వాత కూడా చాలా కొద్దిగా బ్లీడింగ్ కావడమో, మరకలు కనబడడమో కూడా జరగవచ్చు. ఒకవేళ ఆగకుండా బ్లీడింగ్ అవుతుంటే తప్పనిసరిగా డాక్టర్ కు చూపించుకోవాలి.

కాన్పు తర్వాత నెలసరి

కాన్పు తర్వాత బిడ్డకు చనుబాలు ఇవ్వని స్త్రీలకు డెలివరీ అయిన అయిదారు వారాలకే నెలసరి ప్రారంభమవుతుంది. ఒకవేళ చనుబాలు ఇచ్చేట్టయితే, బిడ్డకు చనుబాలు మాన్పించేవరకూ రుతుక్రమం రాదు. కానీ, ఇది ప్రతి మహిళలోనూ ఒకే రకంగా ఉంటుందని అనుకోకూడదు. శరీర తత్వాన్నిబట్టి ఒక్కో స్త్రీకి ఒక్కో విధంగా ఉంటుంది.

రక్తస్రావం దశలు

కాన్పు తర్వాత, మళ్లీ పీరియడ్స్ ప్రారంభమైనప్పుడు, రక్తస్రావం తీరులో కూడా మార్పు రావచ్చు. అది తక్కువగా లేక ఎక్కువగా ఉండవచ్చు. అలాగే మీ నెలసరి  కూడా ఒకే వ్యవధిలో ఉండవు. అవి తిరిగి క్రమబద్ధం కావడానికి కొంత సమయం పడుతుంది. బ్లీడింగ్ లో తేడా అధికంగా ఉన్నప్పుడు అంటే మరీ తక్కువ వచ్చినా, మరీ ఎక్కువ వచ్చినా తప్పనిసరిగా డాక్టర్ ను చూడాలి.

ఒకేసారి కాకపోవచ్చు

కాన్పు తర్వాత గర్భసంచి నుంచి అండం విడుదల కావడం, రక్తస్రావం ఒకేసారి జరగకపోవచ్చు. డెలివరీ తర్వాత మీ మొదటి నెలసరి మొదలు కాకుండానే అండం విడుదల కావచ్చు. కాబట్టి ఇద్దరూ కలిసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.

శుభ్రత- ఆరోగ్యం

మీ పరిసరాలను చాలా పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచుకోమని ప్రత్యేకించి చెప్పే పనిలేదు. శరీరంలో కొన్ని ప్రదేశాల్లో బాక్టీరియా పెరిగే అవకాశం ఉంది కాబట్టి శానిటరీ నాప్ కిన్స్ వాడడం మంచిది. రుతుస్రావం ఎక్కువగా ఉంటే బలహీనం కాకుండా పౌష్టికాహారం తీసుకోవాలి.

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
100%
What?
scroll up icon