Link copied!
Sign in / Sign up
18
Shares

కన్నతల్లికి బ్రతికుండగానే నరకం చూపించిన కొడుకు, హింస భరించలేక ప్రాణాలు విడిచింది

9 నెలలు తల్లి కడుపులో పెరిగాను అనే జాలి లేదు, వయస్సు అయిపోయింది కదా తోడుగా నేనున్నాను అనే భరోసా ఇవ్వలేదు, కాయ కష్టం చేసి కొడుకుని ప్రయోజకుడిని చేస్తే చివరికి కన్న కొడుకు చూపించిన రుణం ఎప్పటికీ మర్చిపోకుండా చేశాడు ఈ చదువుకున్న మూర్ఖుడు. కొడుకు పెట్టే హింసలు భరించలేక 82 ఏళ్ళ వయస్సున్న ఈ తల్లి ప్రాణాలు విడిచింది.

అసలేం జరిగిందంటే..

రాజస్థాన్ లోని అల్వార్ అనే ప్రాంతంలో 10 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చూసిన ప్రతి ఒక్కరినీ కంటతడికి గురి చేస్తోంది. ఈ వీడియోలో కన్నతల్లిని ఇష్టం వచ్చినట్లుగా కొడుతూ చిత్ర హింసలు పెడుతున్న ఇతని పేరు జోగేంద్ర చౌదరి. ఆ ఊర్లోనే ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్నాడు. భర్త చనిపోవడంతో అనారోగ్యం బారిన పడటం, కొన్ని రోజుల క్రితమే పక్షవాతం రావటంతో తన పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండటంతో కొడుకు సహాయం కోరుతూ అతడి వద్దకు చేరింది. ఇంట్లో భార్యతో తరచూ ఏదో గొడవ పడుతూ ఆమెపై ఉన్న కోపాన్ని తల్లిపై చూపించేవాడు. ప్రత్యక్ష నరకం చూసిన ఈ నిస్సహాయకురాలు ప్రాణాలు విడిచింది.

Video Credits:NNIS-News

మనవడు వీడియో తీసి నెట్ లో పెట్టాడు

తన తండ్రి నానమ్మ గత కొన్ని రోజులుగా హింసిస్తూ ఉండటంతో బాధపడ్డ ఆ మనవడు ఒకరోజు, తన తండ్రి నానమ్మను కొడుతుండగా వీడియోను తీశాడు. ఈ వీడియో అందరికీ చేరేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో స్థానిక పోలీసుల వద్దకు చేరటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కష్టమైనా, నష్టమైనా ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ప్రాణం పోసిన అమ్మకు ఇదేనా మనం ఇచ్చే గౌరవం. అమ్మ కడుపులో నుండి బయటకు వచ్చినందుకే జీవితాంతం రుణపడి ఉండవచ్చు. ఇటువంటివి మళ్ళీ మరొక తల్లికి జరగకుండా అందరికీ SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon