Link copied!
Sign in / Sign up
1
Shares

మీ కళ్ళు అందంగా, ఆకర్షణీయంగా ఉండాలంటే ఏం చేయాలి..?

ప్రతి ఒక్కరిలోనూ ఆకర్షణీయమైనవి కళ్ళు. ఒకరు అందంగా ఉన్నారు అని చెప్పడానికి వారి కళ్ళను కూడా ఉదాహరణగా చెబుతుంటారు. అందమైన కళ్ళు వారి అందాన్ని మరింత పెంచుతాయి. అయితే ప్రస్తుత రోజుల్లో కంప్యూటర్స్ ముందు ఎక్కువగా కూర్చోవడం వలన కళ్ళ కింద నల్లని మచ్చలు, ముడతలు ఏర్పడుతూ ఉంటాయి. దీని కారణంగా సరైన నిద్రపట్టదు మరియు కళ్ళు మంటలుగా ఉంటాయి. అందుకని మీ కళ్ళు అందంగా, ఆకర్షణీయంగా, శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి…

1.కళ్ళు ఆకర్షణీయంగా కనిపించాలంటే ఏం చేయాలి..?

2.అందమైన కళ్ళ కోసం పాటించాల్సిన చిట్కాలు

3.కళ్ళ ఆరోగ్యం కోసం ఏ ఆహారం తీసుకోవాలి..?

4.జంక్ ఫుడ్స్ కళ్ళ ఆరోగ్యం కోసం తీసుకోవచ్చా..!

కళ్ళు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే..

మన శరీర అవయవాలలో కళ్ళు ఎంత ప్రధానమైనవో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఇక్కడ చెప్పుకునే సింపుల్ చిట్కాలను జాగ్రత్తగా పాటించండి. మీ కళ్ళను అందంగా, ఆకర్షణీయంగా ఉంచుకోండి. ఆ చిట్కాలు మీకోసం…

కీరదోస ముక్కలను కళ్లపై

కంప్యూటర్స్ ముందు ఎక్కువసేపు గడపడం లేదా ఎక్కువ సమయం అంటే పగలు, రాత్రి వెలుతురు కింద ఉండటం వలన కళ్లకింద నల్లని మచ్చలు ఏర్పడటం మరియు ముడతలుగా ఉండటం జరుగుతూ ఉంటుంది. ఇవి చూడటానికి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తాయి. అందుకని ఒక కీరదోసను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఈ కీరదోస ముక్కలను పడుకునే ముందు లేదా మీరు బయట నుండి ఇంటికి వచ్చినప్పుడు కళ్లపై పెట్టుకుని నిద్రించడం వలన కళ్ళకు మంచిది.

పచ్చి పాలతో ఇలా చేయండి

ఎంత ఎండలు ఉన్నా సరే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిమీద బయటకు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఎండవేడిమి కారణంగా కళ్ళు నల్లగా మారటం, మంటలుగా ఉండటం, కళ్ళ కింద నల్లని మచ్చలు ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. ఇలా ఇబ్బంది పడుతున్నవారు పచ్చి పాలలో దూదిని ఉంచి కళ్ల చుట్టూ మసాజ్ లా చేసుకోవాలి. ఇలా చేయడం వలన కళ్ళ చుట్టూ ఉన్న జిడ్డు, మురికి మరియు నల్లని మచ్చలు దూరమవుతాయి.

అందమైన కళ్ళకోసం పాటించాల్సిన చిట్కాలు

కళ్ళు ప్రత్యేక ఆకర్షణ అని ఇది వరకే మనం చెప్పుకున్నాం. అటువంటి కళ్ళు అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రతి ఒక్కరూ వివిధ రకాల చిట్కాలను ఫాలో అవుతూ ఉంటారు. మీరు ఇది వరకు మీ కళ్ళ కోసం ఏం చేశారో గానీ ఇక్కడ చెప్పుకునే విధంగా చేయడం వలన మీ కళ్ళు అందంగా మరియు ఆకర్షణీయంగా ఉంటాయి.

కళ్ళను తిప్పడం

కళ్ళు అలసిపోయాయని మీకు అనిపించినప్పుడు ఒక్కసారి ఈ విధంగా చేయడం మంచిది. మెడను ఎటువైపు కూడా తిప్పకుండా కేవలం కళ్ళను మాత్రమే పైకి కిందకు తిప్పడం, కుడి ఎడమల వైపు తిప్పటం వలన కళ్ళలో పేరుకుపోయిన మలినాలు బయటకు వస్తాయి. అలాగే కళ్ళకు మంచి వ్యాయామంలా పనిచేస్తుంది కూడా.

కళ్ళు ఆకర్షీణీయంగా ఉండాలంటే

మీ కళ్ళు అందంగా ఆకర్షణీయంగా కనిపించాలంటే (మహిళలకు మాత్రమే) కాటుక పెట్టుకోవడం చేయవచ్చు. కాటుకలలో ప్రస్తుతం కొన్ని కెమికల్స్ ఉపయోగిస్తున్నారు కాబట్టి వాటికి బదులుగా గ్రామాలలో కొందరు సహజంగా కాటుకలు తయారు చేస్తూ ఉంటారు. అవి వాడటం మంచిది.

కళ్ళ కోసం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి..?

మీ కళ్ళు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే కొన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి. వాటిని రెగ్యులర్ గా తీసుకోవడం వలన మీ కళ్ళు అందంగా మరియు ఆరోగ్యంగా ఉంటాయి. అందమైన కళ్ళకోసం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో తెలుసుకోండి..

◼️ క్యారెట్ లేదా క్యారెట్ జ్యూస్

◼️ ద్రాక్ష

◼️ గుడ్లు

◼️ బెర్రీ ఫ్రూట్స్

◼️ పుదీనా రసం మరియు కొత్తిమీర రసం

◼️ జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిది

◼️ స్పినాచ్

◼️ ఆల్మండ్స్

◼️ చేపలు

సో, చూశారుగా మీ కళ్ళను అందంగా, ఆకర్షణీయంగా ఉంచుకోవాలంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు, ఎటువంటి చిట్కాలు పాటించాలో.. ఈ అందమైన చిట్కాలను ప్రతి ఒక్కరికీ తెలియజేయండి. 

...............................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon