Link copied!
Sign in / Sign up
12
Shares

కడుపుతో ఉన్నప్పుడు ఈ 5 పనులు చేయద్దు : కడుపులోని బిడ్డకు నచ్చదు!!

మీరు ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు మీ ఆలోచనలన్నీ,  మీరు తినాల్సిన ఆహరం, చేయించుకోవాల్సిన చెకప్స్ ఇలాంటి వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు . కానీ మీ కడుపులో బిడ్డకు కూడా కొన్ని ఆలోచనలు, ఇష్టాలుంటాయి. మీరు చేసే కొన్ని పనులు మీ కడుపులోని పిల్లలకు అసలు నచ్చవు. అవేంటో చూడండి…

1. పెద్దగా నవ్వడం

మీరు సంతోషంగా ఉండడం మీ కడుపులోని బిడ్డకు ఇష్టం లేదని కాదు. సంతోషంగా ఉన్నప్పుడు చిన్నగా నవ్వితే పర్లేదు. కానీ శరీరం మొత్తం కదిలేలా ఊగుతూ పెద్దగా నవ్వడం మంచిది కాదు. ఆ కదలికల వలన కడుపులోని బిడ్డ ఇబ్బంది పడుతాడు.

2. ఉన్నటుండి కదలడం

కూర్చొని ఉన్న మీరు ఉన్నటుండి పైకి లేవడం, గెంతడం, కడుపు మొత్తం కదిలేలా నడవడం లాంటి పనులు మీ కడుపులోని బిడ్డకు అసలు నచ్చవు. అలా చేయడం వలన వారిని బలవంతంగా కదిపినట్టు ఉంటుంది.

3. పడుకున్నప్పుడు దొల్లడం

ప్రెగ్నన్సీ సమయంలో కడుపు మీద పడుకోవడం, నిద్రపోవడం అంత మంచిది కాదు. అలా చేయడం వలన కడుపులోని బిడ్డ మీద వత్తిడి పడుతుంది. అది బిడ్డకు మంచిది కాదు.

4. పెద్ద శబ్దాలు

మీరు ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు, పెద్ద శబ్దాల మధ్య ఉండకండి. మీ కడుపులో ప్రశాంతంగా ఉన్న మీ బిడ్డను అవి డిస్టర్బ్ చేస్తాయి. అందుకే పెద్ద అరుపుల మధ్య, రంగొణధ్వనుల మధ్య ఉండకండి. టీవీ చూసేటప్పుడు కూడా తక్కువ వాల్యూమ్ పెట్టుకోండి.

5. పొట్ట మీద నొక్కడం

చాలా మంది మహిళలు ప్రెగ్నన్సీ సమయంలో పొట్ట మీద చేతితో తడమడం లాంటివి చేస్తుంటారు. అలా చేయడం మంచిది. కడుపులోని బిడ్డ వత్తిడికి గురయ్యి, కలవరపడుతాడు. అది బిడ్డ ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon