Link copied!
Sign in / Sign up
3
Shares

భరించలేని కడుపునొప్పిని 10 నిముషాల్లో ఇంట్లోనే తగ్గించుకునే అద్భుత చిట్కాలు

ఈ నొప్పి వస్తే భరించలేం అని అనుకునే వాటిలో కడుపునొప్పి ఒకటి. ఎప్పుడు ఎందుకు వస్తుందో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే సరైన సమయానికి తినకపోయినా, మసాలా ఫుడ్స్ ఎక్కువగా తిన్నప్పుడు, నీరు తక్కువగా తాగడం వలన, మలబద్ధకం సమస్య, జీర్తి, గ్యాస్..ఇలా ఎన్నో కారణాలు కావచ్చు. చలికాలంలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఐతే ఎటువంటి ఖర్చు లేకుండా ఇంటి దగ్గరే లభించే ఈ పదార్థాలతో కడుపునొప్పిని ఎలా దూరం చేసుకోవచ్చో తెలుసుకోండి.

అల్లం

అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండటం వలన మన శరీరానికి బెస్ట్ రెమెడీగా పనిచేస్తుంది. ముందుగా ఒక అల్లం ముక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గ్లాస్ నీటిలో ఈ ముక్కలను వేసి 5 నిముషాల పాటు వేడి చేయాలి. ఈ నీటిని వడగట్టుకుని అందులో కాస్త తేనె కలిపి తీసుకోవడం వలన కడుపునొప్పి సమస్య ఉండదు. ప్రతి రోజూ ఇలా చేస్తే మంచిది. అలాగే ప్రతిరోజూ అల్లం టీ తాగడం వలన జీర్ణం బాగా అవుతుంది.

జీలకర్ర

ఒక గ్లాసులో నీటిని తీసుకుని అందులో జీలకర్ర వేసి కొద్దిసేపు వేడి చేసుకోవాలి. ఈ నీటిలో రుచికోసం కాస్త తేనె కలిపి నెమ్మదిగా సేవించాలి. ఇలా చేయడం వలన స్టొమక్ పెయిన్ ఉండదు. ప్రతిరోజూ భోజనం చేసిన పది నిముషాల తరువాత జీలకర్ర కొద్దిగా నోట్లో వేసుకుని నమిలితే మంచిది.

వెల్లుల్లి

మీరు తీసుకునే ఆహారంలో వెల్లుల్లి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవడం వలన కడుపులో గాలి, మలినాలు చేరకుండా నిరోధిస్తుంది మరియు మలబద్ధకం లేకుండా ఫ్రీగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి రోజూ రెండు వెల్లుల్లి రిబ్బలను తినడం చేయాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగ ర్ మరియు ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరుదుగుల బాగా జరగనప్పుడు లేదా స్టొమక్ అప్ సెట్ అనిపించినప్పుడు తీసుకోవడం వలన మంచి రెమెడీగా పనిచేస్తుంది.

పెరుగు నీరు

మీరు రాత్రి పూట భోజనం చేసేటప్పుడు గానీ మధ్యాహ్నం గానీ మీ కడుపు ఉబ్బరంగా లేదా ఫుల్ గా ఉన్నట్లయితే పెరుగుతో కాస్త అన్నం తినడం మంచిది. అలాగే అధిక మోతాదులో నీరు తాగడం చేయాలి. ఉదయాన్నే మలబద్ధకం సమస్య ఉంటే ఒక గ్లాస్ నీటిని సేవించి అటు ఇటు కొద్దిసేపు నడవడం వలన మోషన్ ఫ్రీగా అవుతుంది.

అందరికీ ఈ విషయాలను SHARE చేయగలరు.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon