Link copied!
Sign in / Sign up
2
Shares

మీ కడుపులోని బిడ్డకు వీటివల్ల ప్రమాదం జరగవచ్చు : అవేంటో ముందే తెలుసుకోండి

కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి తల్లి ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. కానీ, ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు మిస్ క్యారేజ్ జరిగి కడుపులోని శిశువే  ఎదుగుదల ఆగిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. అది కూడా 20 వారాల లోపే ఎక్కువగా జరుగుతున్నాయి.  అలా ప్రపంచవ్యాప్తంగా 50 % వరకు మిస్ క్యారేజ్ లు జరుగుతున్నాయట. కడుపులోని బిడ్డకు ప్రమాదం కలిగించే ఈ 5 విషయాలు గురించి ప్రతి తల్లి తప్పక తెలుసుకోవాలి.

మిస్ క్యారేజ్ (గర్భస్రావం) అని తెలిపే గుర్తులు, లక్షణాలు

1.రక్తస్రావం చిన్నగా మొదలై ఎక్కువ కావడం

2. కడుపునొప్పి తీవ్రంగా ఉండటం

3. జ్వరం

4. కడుపుచుట్టూ ఉన్న కండరాలు అధిక నొప్పి కలిగించడం

5. బ్యాక్ పెయిన్ మరియు నీరసంగా ఉండటం

ఇటువంటి లక్షణాలు గుర్తులు గర్భంతో ఉన్నప్పుడు మీకు అనిపించినట్లయితే వెంటనే గైనకాలజిస్ట్ ను సంప్రదించి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా తెలియజేయండి. ప్రస్తుత ప్రగ్నన్సీ పరిస్థితి మరియు బిడ్డ ఆరోగ్యం గురించి పూర్తిగా వివరిస్తారు.

మిస్ క్యారేజ్ (గర్భస్రావం) కావడానికి అసలు కారణాలు

చాలామంది తల్లి అనారోగ్యం కారణంగా మిస్ క్యారేజ్ జరుగుతుందని భావిస్తున్నారు. కడుపులోని బిడ్డ జన్యు వైఫల్యం కారణంగా గర్భస్రావం జరుగుతుంది. అలాగే మిస్ క్యారేజ్ జరగడానికి ఇతర కారణాలు ఏంటో కూడా తెలుసుకుందాం…

1.ఇన్ఫెక్షన్స్

2.థైరాయిడ్ లేదా డయాబెటిస్ కారణంగా

3. రోగ నిరోధక శక్తి తగ్గిపోతూ ఉండటం, హార్మోన్ల అసమతుల్యత కారణంగా

4.గర్భాశయం బలహీనంగా ఉండటం లేదా గర్భాశయ సమస్యలు

5.బిడ్డకు జన్మను ఇస్తున్న తల్లి వయస్సు 35 కు మించి ఉంటే..

6.అంతకుముందు కూడా రెండు లేదా మూడు సార్లు మిస్ క్యారేజ్ జరిగి ఉంటే..

గర్భాశయం లోపం కారణంగా గర్భస్రావం

గర్భాశయం బలహీనంగా ఉండటం వలన కడుపులోని బిడ్డకు అసౌక్యరంగా ఉంటుంది. దీని వలనే రెండవ త్రైమాసికంలో గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది. పవిత్ర యోని స్థానం వద్ద ఎక్కువ నొప్పిగా ఉండటం, గర్భాశయంలోని నీటి సంచి పగిలిపోవడం కారణంగా మిస్ క్యారేజ్ జరుగుతుంది.

ఈ సమాచారం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినది మరియు ముఖ్యమైనది కాబట్టి అందరికీ తెలిసేలా SHARE చేయగలరు.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon