Link copied!
Sign in / Sign up
0
Shares

కడుపులోని బిడ్డ అడ్డం తిరిగితే మీరు చేయాల్సిన 3 పనులు


మీ కడుపులోని బిడ్డ ఎదిగే కొద్ది, అడ్డం తిరిగే అవకాశం ఉంటుంది. ఇలా జరగడం డెలివరీ సమయంలో మీకు బిడ్డకు ప్రమాదమే. నెలలు నిండాక డాక్టర్ చేసే పరీక్షలలో కడుపులోని బిడ్డ పొజిషన్ తెలుస్తుంది. నార్మల్ డెలివరీ జరగడానికి కడుపులోని బిడ్డ తల కిందకు ఉండాలి. ఆలా కాకుండా పక్కకు ఉంటే కడుపులోని బిడ్డ అడ్డం తిరిగినట్టు. ఇలా కడుపులోని బిడ్డ అడ్డం తిరగడం జరిగితే మీకు మీ డెలివరీ సి-సెక్షన్ ద్వారా జరగాల్సి ఉంటుంది.

అయితే ఈ 3 పనులు చేయడం వలన, కడుపులో అడ్డం తిరిగిన బిడ్డ సరైన స్థానంలోకి వచ్చే అవకాశం ఉంటుంది…

1. వెర్షన్ (version) చేయించుకోండి

 

 

ఒకవేళ మీ కడుపులోని బిడ్డ అడ్డం తిరిగిందని నిర్ధారణకు వస్తే, డాక్టర్ మిమ్మల్ని సెఫాలిక్ వెర్షన్ (Cephalic Version) చేయించుకోమని సలహా ఇస్తారు. దీనినే వెర్షన్ అని కూడా అంటారు. మీ పొత్తి కడుపు మీద చేతులుతో చిన్నగా కదుపుతూ, బిడ్డను సరైన స్థానానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఇలా చేయడం వలన కడుపులోని బిడ్డ తిరిగి యదా స్థానానికి రావడానికి 50 శాతం అవకాశం ఉంటుంది. దీనిని డాక్టర్లు మాత్రమే చేయాలి.

2. నడవండి

కడుపులోని బిడ్డ అడ్డం తిరిగిందని తెలిసాక మీరు చేయాల్సిన పని, నడక అలవాటు చేసుకోవడం. నడక వలన మీ కండరాలు సాగుతాయి. దీని వలన గర్భాశయం వదులుగా మారి బిడ్డ సరైన స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. కడుపు మీద వత్తిడి పడకుండా, పిక్కలు మాత్రం కదిలేలా స్ట్రేటచెస్ చేసిన ఫలితం ఉంటుంది.

3. సిద్ధమవ్వడం

సాధారణ కాన్పు కాకుండా, కడుపులోని బిడ్డ అడ్డం తిరిగితే కాన్పు కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకు ముందే సిద్ధమవడం మంచిది. ప్రసవ సమయంలో పిరుదుల మీద ఎక్కువ వత్తిడిని ఉంచడం వలన, ప్రసవం కొంచెం సులువవుతుంది. చిన్నగా స్ట్రేటచెస్ చేస్తుండడం వలన ప్రసవ సమయానికి మీ యోని ప్రాంతంలోని కండరాలు, వదులుగా మారుతాయి. ప్రసవం సులువవుతుంది. 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon