Link copied!
Sign in / Sign up
4
Shares

కడుపులోని బిడ్డ అల్ట్రా స్కాన్ ప్రకారం 2D, 3D, 4D లలో ఎలా ఉంటారో చూడండి..

గర్భం దాల్చిన తర్వాత కడుపులోని బిడ్డ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని ప్రతి దంపతులకు కలిగే కోరిక. ఎప్పుడెప్పుడు బిడ్డను చూద్దామా అని ఆశపడుతూ ఉంటారు. ప్రస్తుతం వైద్యులు అల్ట్రా స్కాన్ పధ్ధతి ద్వారా కడుపులోని బిడ్డ ఏం చేస్తున్నాడో కూడా ఇట్టే చెప్పగలుగుతున్నారు. అద్భుతమైన టెక్నాలజీ ప్రకారం  2D, 3D మరియు 4D లలో కడుపులోని ఎలా ఉంటాడో ఇట్టే తెలుసుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి.

2D, 3D మరియు 4D అంటే ఏమిటి..?

కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని డాక్టర్లు స్కానింగ్ ద్వారా చెకప్ చేస్తూ ఉంటారు. సాధారణంగా 2D లో కడుపులోని బిడ్డను చూపిస్తూ ఉంటారు. ఇది నలుపు మరియు తెలుపు రంగులలో కనిపిస్తూ ఉంటుంది. అది కూడా టు డైమెన్షనల్ లోనే ఉంటుంది. ఇక 3D ఐతే బిడ్డ కదులుతూ ఉన్నట్లుగా మోషన్ క్యాప్చర్ లో కొంచెం క్లియర్ గా కనిపిస్తారు.

4D లో బిడ్డ ఎలా కనిపిస్తాడు..!

అల్ట్రా స్కాన్ ద్వారా కడుపులోని బిడ్డ ఏం చేస్తున్నాడో తెలుసుకోవచ్చు. కదులుతున్నాడా, నవ్వుతున్నాడా, ఏడుస్తున్నాడా, ఆవలిస్తున్నాడా..ఇలా ప్రతి ఒక్క విషయం వీడియో రూపంలో కనిపిస్తుంది. గర్భంలో నాలుగు వైపులా బిడ్డ ఏం చేస్తున్నాడో చాలా క్లియర్ గా తెలుసుకోవచ్చు. దీనిని బట్టి అమ్మ కడుపు నుండి ఎప్పుడు బయటకు వస్తారో కూడా డాక్టర్లు చెప్పే అవకాశం ఉంది. చూశారుగా కడుపులోని బిడ్డ అల్ట్రా స్కాన్ టెక్నాలజీ ప్రకారం 2D, 3D మరియు 4D లలో ఎలా కనిపిస్తారో. ఈ వీడియో కూడా చూడండి.

కడుపులోని బిడ్డ లింగం (ఆడ, మగ) అని తెలుసుకోవడం చాలా తప్పు.  బిడ్డ ఎవరైనా సరే సంతోషంగా స్వాగతించండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon