Link copied!
Sign in / Sign up
2
Shares

కడుపులో మీ బిడ్డ పొజిషన్ ను ఎలా గుర్తించాలి?

కడుపులో బిడ్డ ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అనేది అందరికంటే బాగా ఎక్కువగా ఒక్క తల్లికి మాత్రమే తెలుస్తుంది. కొన్ని సార్లు కడుపులో బిడ్డ కదులుతూ ఉంటే సంతోషంతో తల్లి కన్నీరు పెట్టుకుంటుంది. ఆ సమయంలో కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేక ఈ విధంగా చేస్తుంది. అయితే కడుపులో బిడ్డ అప్పుడప్పుడు తన స్థానాన్ని మారుస్తూ ఉంటారు. ఆ పొజిషన్ ను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..

బిడ్డ వెనుక భాగం మీ ముఖానికి ఎదురుగా

ప్రగ్నన్సీ సమయంలో కొన్నిసార్లు బెల్లీ ఎక్కువగా ఉన్నట్లు, బొడ్డు ముందుకు సాగినట్లుగా ఉంటుంది. అటువంటప్పుడు మీ బిడ్డ కడుపులో తన్నడం కూడా చేస్తుంటారు. ఈ విధంగా జరుగుతూ ఉంటే బిడ్డ వెనుక భాగం మీ ముఖానికి ఎదురుగా ఉన్నట్లుగా గుర్తించాలి.

మీ బిడ్డ తలను తాకుతున్నట్లు

కొన్నిసార్లు తల్లి కడుపు ఎగుడుదిగుడుగా ఉంటుంది. అప్పుడు బిడ్డ ఏం చేస్తున్నాడో అని కడుపును తాకగానే, మీ శిశువు కడుపును లేదా ఎక్కువ శాతం మీ బిడ్డ తలను తాకినట్లుగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే “ బిడ్డ శరీరం మొత్తం కదలకపోయినా స్వతంత్రంగా తల మాత్రం కదులుతుంది”.

ఎక్కిళ్ళు వస్తుంటే తల కిందకు ఉన్నట్లు

మీ బిడ్డ ఎక్కిళ్ళు పెడుతున్నాడు అని మీకు అనిపిస్తే, మీ బిడ్డ తల కిందకు కాళ్ళు పైకి ఉన్నట్లుగా తన పొజిషన్ ఉంటుంది.

బొడ్డుకు దగ్గరగా తన్నడం చేస్తుంటే

బొడ్డు చుట్టూ లేదా బొడ్డుకి దగ్గరగా మీ బిడ్డ కాళ్లతో తన్నడం చేస్తున్నట్లు అనిపిస్తే మీ బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని అర్థం.

ఎక్కిళ్ళు మరీ ఎక్కువగా వస్తున్నట్లయితే

మీ బిడ్డకు ఎక్కిళ్ళు పెరిగిపోతున్నట్లయితే, శిశువు తల పైకి కాళ్ళు కిందకు ఉండే పొజిషన్ లో ఉన్నట్లు.

పక్కటెముకలకు దగ్గరగా ఉంటే

మీ పక్కటెముకలు నొప్పిగా ఉన్నా, నొప్పులు వస్తున్నట్లుగా లేదా కడుపులో తీవ్ర నొప్పిగా ఉన్నట్లయితే మీరు ప్రసవించేందుకు సిద్ధంగా ఉన్నట్లు, ఆ సమయంలో మీ బిడ్డ తలపైకి ఉండి, పక్కటెముకలకు దగ్గరగా ఉంటుంది.

బిడ్డ గుండె చప్పుడు చెబుతుంది

మీ బిడ్డ గుండె చప్పుడును బట్టి శిశువు ఏ పొజిషన్ లో ఉన్నాడో తెలుసుకోవచ్చు. ఒక టిష్యు పేపర్ తీసుకుని మీ కడుపుపై ఉంచి మీ ఆయనను లేదా మీ అమ్మగారిని వినమని చెప్పండి. మీ బొడ్డు కిందకు గుండె చప్పుడు వినిపిస్తూ ఉంటే బిడ్డ తల కిందకు ఉన్నట్లు, అదే బొడ్డు పై భాగానికి గుండె చప్పుడు వినిపిస్తూ ఉంటే తల పై భాగానికి ఉన్నట్లు.

సాధారణంగా వైద్యులు బిడ్డ ఏ పొజిషన్ లో ఉన్నారో చెప్పడం జరుగుతుంది. అయితే ప్రతి తల్లికీ బిడ్డ స్థానం గురించి తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి ఈ విషయాలు చెప్పడం జరిగింది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon