Link copied!
Sign in / Sign up
0
Shares

కడుపులో బిడ్డకు ఎక్కిళ్ళు రావడం ప్రమాదమా..! వస్తే ఏం చేయాలి?

తల్లి కడుపులో ఉన్న శిశువు ఏం చేస్తుంది? అనే ప్రశ్న ప్రెగ్నన్సీతో ఉన్న ప్రతి మహిళకు వచ్చే ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్న శిశువు బయటకు వచ్చేలోపు లోపలే కొన్ని విషయాలు నేర్చుకోగలడు. నోట్లో వేలు పెట్టుకోవడం, కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉండటం, ఆవులించడం, ఏడవడం, మాటలు వినడం, పాస్ పోయడం చేస్తుంటారు.  అలాగే ఎక్కిళ్ళు కూడా వస్తుంటాయి. ఇలా వస్తే ప్రమాదమా అని ఒక తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం మీకోసం..

ఉమ్మనీరు తీసుకోవడం వలన

ప్రెగ్నన్సీ సమయంలో తల్లి కడుపు అప్పుడప్పుడు కదులుతూ ఉంటుంది. ఎందుకంటే బిడ్డ ఎక్కిళ్ళు  పెడుతున్నాడని అర్థం. శ్వాస తీసుకునే సమయంలో అనుకోకుండా ఉమ్మనీరు తీసుకోవడం లేదా శ్వాసకు అడ్డుగా వచ్చినప్పుడు ఎక్కిళ్ళు వస్తుంటాయి. అయితే ఊపిరితిత్తులు, డయాఫ్రాగమ్ (శరీరంలో రొమ్ము భాగాన్ని ఉదర భాగం నుండి వేరు చేసే కండరం) ఉమ్మనీరు కడుపులోకి చేరకుండా అడ్డుకుంటాయి. ఇది ఒక రకం ఎక్కిళ్ళు.

ఎక్కిళ్ళు రావడం ప్రమాదమా?

తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఎక్కిళ్ళు రావడం సహజమే. దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ బిడ్డ కడుపులో ఎదగడం, అభివృద్ధి చెందడం జరుగుతుంది అని చెప్పే సూచిక. అప్పుడప్పుడు కాళ్లతో తన్నడం చేస్తూ ఉంటారు, అంటే ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. ఎప్పుడు తల్లి కడుపు కదులుతూ ఉన్నా, ఎప్పుడు తన్నడం చేస్తూ ఉంటే ఒక్కసారి వైద్యుడిని కలిసి సమస్యను వివరించాలి.

ఏ నెలలో ఎక్కిళ్ళు వస్తాయి?

ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు బిడ్డకు రెండు లేదా మూడవ నెల నుండి ఎక్కిళ్ళు మొదలై డెలివరీ అయ్యేవరకు అప్పుడప్పుడు సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కొందరిలో ఎక్కువ సార్లు ఎక్కిళ్ళు వస్తుంటాయి, మరి కొందరిలో అస్సలు రాకపోవచ్చు కూడా అందుకు కంగారు పడకండి. మరీ ఎక్కువగా మీ కడుపు కదులుతూ ఉన్నట్లు అనిపిస్తే కడుపుపై చేతితో నెమ్మదిగా రుద్దడం చేయండి.

పిల్లలు పుట్టాక ఎక్కిళ్ళు వస్తే ఏం చేయాలి?

బిడ్డ జన్మించిన తర్వాత కూడా ఎక్కిళ్ళు రావడం సహజమే కాబట్టి తల్లులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మన పెద్దలు అంటూ ఉంటారు కదా బిడ్డ తండ్రో, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు తలుచుకుంటారు ఉంటారని అది కూడా నిజమే అయ్యుండొచ్చు. పిల్లలు పెరిగే కొద్దీ ఎక్కిళ్ళు ఆగిపోవడం జరుగుతుంది.

ప్రెగ్నన్సీ సమయంలో బిడ్డ ఎక్కిళ్ల గురించి ప్రతి ఒక్కరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. దయచేసి అందరికీ SHARE చేయండి.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon