Link copied!
Sign in / Sign up
4
Shares

కడుపులో బిడ్డ తలకిందులు ఎందుకు అవుతాడు? ఎప్పుడు అవుతాడు?

ఈ ప్రశ్నను అనుమానంగా పెట్టుకోకుండా ప్రతి మహిళ, తల్లి ఖచ్చితంగా తెలుసుకోవాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ తల పైకి, కాళ్ళు కిందకు ఉంటాయి. అదే డెలివెరీ అయ్యే సమయానికి బిడ్డ తల ముందుగా బయటకు వస్తుంది, ఆ తర్వాత కాళ్ళు బయటకు వస్తాయి. ఇదే అందరికీ ఉన్న అనుమానం. కడుపులో బిడ్డ తలకిందులుగా ఎందుకు ఉంటాడు? ఎప్పుడు ఇలా తిరుగుతాడు అని. అలా ఎందుకు, ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోండి…

బిడ్డ తల తల్లి గర్భంలో ఎప్పుడు తిరుగుతుంది?

ప్రముఖ ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం తల్లి గర్భంలో 28 వ వారం నుండి 32 వ వారం లోపల బిడ్డ తల కిందకు తిరుగుతుంది. అప్పటివరకు తల పై వైపున ఉంటుంది. తల్లి ప్రసవించబోతుంది అనగా కొన్ని నిముషాల ముందు బిడ్డ తల తిరిగే అవకాశం కూడా ఉంది. నార్మల్ డెలివరీ జరుగుతున్నప్పుడు  ముందు బిడ్డ తల రాకపోయినా ప్రసవం జరుగుతుంది. దానికి భయపడాల్సిన అవసరం లేదు.

తల కాకుండా కాళ్ళు ముందు వస్తే ప్రమాదమా..?

కొన్నిసార్లు బిడ్డ అడ్డం తిరిగాడని తల్లి జన్మస్థానమైన యోని నుండి కాళ్ళతో ముందుకు వస్తున్నాడని చెబుతుంటారు. ఇలా జరిగినప్పుడు బిడ్డకు ఏదైనా ప్రమాదం అనిపిస్తే సి-సెక్షన్ ద్వారా బిడ్డను బయటకు తీస్తారు. కానీ అధ్యయనాల ప్రకారం ముందు తల, తల్లికి ఎదురుగా కాళ్ళు ఉండి బిడ్డ ప్రసవించడం ఉత్తమమైన ప్రక్రియ అని చెబుతున్నారు వైద్యులు. ఇలా తిరుగుతున్నప్పుడు శిశువు కటి ఎముకలలో కదులుతూ మహిళ గర్భ స్థానానికి చేరుతాడు. తల ముందుకు వస్తూ జన్మించడం వలన బిడ్డను బయటకు తీసేందుకు సులభంగా ఉంటుంది.

ప్రసవ సమయానికి బిడ్డ తల తిరగకపోతే ఏం చేయాలి?

సాధారణంగా గర్భంలో ఉన్న శిశువు 30 వారాలలో తలను కింది వైపుతో తిరిగి ఉంటాడు. కొందరిలో 36 వారాలు కూడా పడుతుంది. అలా జరగనప్పుడు గర్భంతో ఉన్న మహిళ కింద కూర్చోవడం చేయాలి. మరీ ఎక్కువగా ఎప్పుడు అవసరం లేదు. అలాగే కుర్చీ లేదా గోడకు ఆనుకుని కూర్చోవడం చేయాలి.  అలాగే గాలి నింపిన బర్తింగ్ బాల్స్ పై కూర్చుని జాగ్రత్తగా కదలడం వలన బిడ్డ స్థాన భ్రంశం మారుతుంది.

గమనిక : మీ బిడ్డ తల స్థానభ్రంశం మారలేదు అనిపిస్తే మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైద్యులు సి- సెక్షన్ ద్వారా బిడ్డను బయటకు తీస్తారు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon