Link copied!
Sign in / Sign up
2
Shares

కడుపులో బిడ్డ బరువును పెంచే ప్రెగ్నన్సీ ఫుడ్స్

ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు కడుపులో బిడ్డ ఎలా ఉన్నాడు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో తెలుసుకోవాలని ప్రతి తల్లికీ ఉంటుంది. అయితే కడుపులో బిడ్డ బరువు పెరగడానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలని గర్భంతో ఉన్న మహిళలకు వచ్చే అనుమానం. ఇక్కడ చెప్పుకునే ఈ ఆహారాలను గర్భిణీ స్త్రీలు తీసుకోవడం వలన మీకు, మీ కడుపులో ఉన్న బిడ్డకు ఆరోగ్యకరం. అందరికీ SHARE చేయండి.

డ్రై ఫ్రూట్స్

ప్రెగ్నన్సీ సమయంలో ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా డ్రై ఫ్రూట్స్ తినడం మీకు మీ బిడ్డ బరువు పెరుగుదలకు మంచిది. ఎండు ద్రాక్ష, ఖర్జూరం, అంజీరా, పిస్తా, జీడిపప్పు, డ్రై ఆప్రికాట్స్ తినడం వలన వీటిలో ఉండే ఫైబర్స్, ప్రోటీన్స్, ఐరన్, పొటాషియం బిడ్డ ఆరోగ్యానికి బాగా పనిచేస్తాయి. అలాగే వీటిలో ఉండే పొటాషియం, ఐరన్ ప్రసవ సమయంలో వచ్చే నొప్పులను తగ్గించివేస్తుంది.

గుడ్లు

గుడ్లు శాఖాహారమా, మాంసాహారమా అనే విషయాన్ని పక్కనపెడితే ప్రెగ్నన్సీతో ఉన్నపుడు గుడ్లు తినడం వలన గర్భంలో ఉండే శిశువు మెదడుకి కావలసిన కోలిన్ ను పొందవచ్చు. అలాగే బాగా ఉడికిన గుడ్లను మాత్రమే తీసుకోవాలి.

చిలకడ దుంప

చిలకడదుంపలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. శరీరం బీటా కెరోటిన్ ను, గర్భం లో పిండం ఎదగడానికి ఉపయోగపడే 'విటమిన్ A' గా మారుస్తుంది. రోజు 100-150 గ్రాముల చిలకడదుంప తీసుకోవడం శరీరంలో 'విటమిన్ A' శాతాన్ని 10%-40% పెంచుతుంది. చిలకడ దుంపలో పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అరుగుదలను కూడా పెంచుతుంది. రక్తంలో చక్కర శాతాన్ని తగ్గిస్తుంది.

బీన్స్ మరియు కాయ ధాన్యాలు

మీరు మాంసాహారం తక్కువగా తినేవారైతే లేదా మాంసాహారం ఇష్టం లేకపోతే దీనికి బదులుగా బీన్స్ మరియు కాయ ధాన్యాలను తినడం ఉత్తమం. వీటిలో సమృద్ధిగా ఐరన్, ప్రోటీన్స్, ఫైబర్స్, ఫోలేట్ మరియు కాల్షియం ఉండటం వలన మీకు, మీ కడుపులో ఉన్న బిడ్డ బరువు పెరిగేందుకు బాగా ఉపయోగపడతాయి.

 

ఆరంజ్ జ్యూస్

ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాస్ ఆరంజ్ జ్యూస్ సేవించడం వలన మీరు వికారం, వాంతుల నుండి బయటపడవచ్చు. అలాగే వీటిలో బిడ్డ ఆరోగ్యానికి కావలసిన ఫోలేట్, పొటాషియం మరియు విటమిన్ సి పాళ్ళు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి వైద్యులు కూడా గర్భిణీ మహిళలను తీసుకోమని సూచిస్తున్న మాట

 డైరీ ప్రాడక్ట్స్

చీస్, యొగ్ర్ట్, పాలలో ఎక్కువ మొత్తంలో కాల్షియం ఉంటుంది. శిశువు యొక్క ఎముకలు, దంతాలు మరియు కండరాల ఆరోగ్యం కోసం తప్పని సరిగా తగిన మొత్తంలో కాల్షియం తీసుకోవాలి. ఒకవేళ గర్భిణులు సరైన మొత్తంలో కాల్షియం తీసుకోకపోవటం వలన శిశువు, తల్లి శరీరంలో ఉండే కాల్షియం వినియోగించుకొని, భవిష్యత్తులో 'ఒస్టియోపోరోసిస్' అనే వ్యాధి కలిగే అవకాశం ఉంది.

ఈ సమాచారాన్ని అందరికీ చేరేలా SHARE చేయగలరు. 

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon