Link copied!
Sign in / Sign up
5
Shares

కాళ్ళ నొప్పులు వెంటనే తగ్గాలంటే ఇలా చేస్తే చాలు : 10 నిముషాలలో నొప్పులు మటుమాయం

కొంత దూరం నడిచినా, పరిగెత్తినా, నిలబడినా, కాస్త ఎక్సర్ సైజులు చేసినా సరే అప్పుడే బాబోయ్ నాకు కాళ్ళు నొప్పుగా ఉన్నాయి. ఇక నడవటం నావల్ల కాదు, నాకు ఓపిక లేదండోయ్ అంటుంటారు కొందరు. ఇలా త్వరగా కాళ్ళ నొప్పులు రావడానికి పోషకాహార లోపం ఒక కారణం కాగా, తగినంత శక్తి లేకపోవడం కూడా మరో కారణం. ఇలా కాళ్ళ నొప్పులతో బాధపడేవారు కొన్నిసార్లు నిద్రపోవడానికి కూడా చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు. అందుకని ఇక్కడ చెప్పుకునే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వడం వలన ఈ సమస్యకు వెంటనే గుడ్ బై చెప్పేయవచ్చు.

ఐస్

 

కాళ్ళు నొప్పులుగా ఉన్నప్పుడు ఒక ఐస్ గడ్డను తీసుకుని ఒక క్లాత్ లో ఉంచి, కాళ్లపై ఒక 10 నిముషాల పాటు ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన కాళ్ళ నొప్పుల నుండి కాస్త ఉపశమనం లభిస్తుంది. డైరెక్ట్ గా ఐస్ ముక్కను ఉంచుకూడదు.

వెనిగర్

బకెట్ లో గోరువెచ్చని నీరు తీసుకుని అందులో కొంచెం వెనిగర్ మరియు ఎప్సం సాల్ట్ ను కలిపి 15 నిముషాల పాటు కాళ్ళను అందులో ఉంచడం వలన కాళ్ళనొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. లేకపోతే డైరెక్ట్ గా గోరువెచ్చని నీటిలో అయినా సరే కాళ్ళను పడుకునేముందు ఉంచుకోవడం వలన రిలీఫ్ గా ఉంటుంది.

పసుపు, నువ్వుల నూనె

గోరు వెచ్చని నువ్వులనూనెలో ఒక టీ స్పూన్ పసుపు కలుపుకుని మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మసాజ్ లా చేసుకుని కాళ్ళు నొప్పులుగా ఉన్నచోట అప్లై చేసుకోవాలి. గోరువెచ్చని నీటితో కొన్ని గంటల తర్వాత శుభ్రం చేసుకుంటే చాలు. రెండు రోజులకు ఒకసారి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

లవంగం నూనె

కండరాలు పట్టివేసినప్పుడు, కాళ్ళు నొప్పులుగా ఉన్నప్పుడు వెంటనే లవంగం నూనెతో కాళ్లపై మర్దనా చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన కాళ్ళనొప్పుల సమస్య నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

జింజర్ ఆయిల్

కాళ్ళు నొప్పులుగా ఉన్నప్పుడు ఇ క్కడ చెప్పుకునే ఈ గృహ చిట్కా కూడా బాగా పనిచేస్తుంది. అల్లం నూనెను రోజులో రెండు లేదా మూడుసార్లు కాళ్లపై అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి. అలాగే రోజుకు మూడుసార్లు అల్లం టీ సేవించడం కూడా మంచిదే. ఇందులో కాస్త తేనే మరియు లెమన్ జ్యూస్ ను రుచికోసం కలుపుకోవచ్చు కూడా.

పైన చెప్పిన వాటిలో మీకు నచ్చిన చిట్కాను కాళ్ళ నొప్పులు తగ్గడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ విషయాలు అందరికీ తెలిసేలా షేర్ చేయగలరు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon