Link copied!
Sign in / Sign up
1
Shares

తొడ, కాలి కండరాలు నొప్పిగా ఉంటే ఏం చేయాలి? 5 నిముషాల్లో నొప్పిని తగ్గించే అద్భుత చిట్కాలు

ఒకప్పుడు ఆరోగ్యం బాగోలేదు, కాళ్ళు లాగేస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులు అంటే వయస్సు అయిపోతుంది కదా..ఇలాంటివి సహజమే అని అనేవాళ్ళు. అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు అలా కాదు టీనేజ్ లో ఉండే అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ఇలా కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అలాగే చాలామంది నిద్రలో ఉన్నట్లుండి మేల్కోవడం చేస్తుంటారు, ఎందుకంటే తొడ దగ్గర ఏదో పట్టేసినట్లుగా ఉంది, భుజం నొప్పిగా ఉందని, కాలు తిమ్మిరుగా ఉందని, ఒకేచోట ఎక్కువగా కూర్చున్నప్పుడు ఇలా కాలు, తొడ కండరాలు పట్టేయడం సర్వసాధారణమే. అయితే రెగ్యులర్ గా ఇలా జరుగుతూ ఉంటే మాత్రం డాక్టర్ ను సంప్రదించడం లేదా ఈ సులభమైన ఆరోగ్య చిట్కాలు పాటించడం చేయాలి. ఈ విషయాలు అందరికీ షేర్ చేయండి.. 

కాలి కండరాలు పట్టివేసిన వెంటనే..

నడుస్తున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు లేదా పైకి కిందకు దూకుతున్నప్పుడు కాలి కండరాలు పట్టివేయడం జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు పడుకుని నిద్రలేచినప్పుడు లేదా నిద్రలో ఇలా జరుగుతుంది. అటువంటప్పుడు వెంటనే కాలిని అటుఇటు కదపడం లేదా ఇదల్చడం చేయాలి. ఇలా చేసినట్లయితే కాస్త రిలీఫ్ గా ఉంటుంది. ఇంకా కొంతమంది బైక్ పై వెళ్తున్నప్పుడు తొడ కండరం పట్టివేసే నొప్పిని భరించలేకపోతుంటారు. అటువంటప్పుడు వెంటనే దిగి అటూయిటూ నడవటం చేయాలి. 

లవంగాల నూనెతో మసాజ్ 

తొడ లేదా కాలు పట్టివేసి నొప్పిగా ఉన్నట్లయితే వెంటనే కొంచెం లవంగాల నూనెను తీసుకుని వేడిచేసుకోవాలి. ఇలా వేడిచేసిన తర్వాత నొప్పిగా లేదా పట్టివేసిన చోట రాసుకుని మర్దనా చేసుకోవడం వలన తక్షణ నొప్పి ఉపశమనం లభిస్తుంది. 

ఐస్ ప్యాక్ 

ఇది చాలా సులభంగా అందరూ చేసుసుకోగల పద్ధతి. కాలి కండరాలు పట్టివేసినప్పుడు ఐస్ ముక్కలను లేదా ఐస్ ప్యాక్ ను తీసుకుని ఒక వస్త్రంలో ఉంచి నొప్పిగా ఉన్నచోట ఐదు నిముషాల పెట్టుకుని మళ్ళీ నొప్పిగా ఉన్నచోట ఉంచుకోవడం వలన నొప్పి నుండి బయటపడవచ్చు. 

ఈ ఆహారం మంచిది 

తొడ, కాలి కండరాలు పట్టివేయడానికి కారణం శరీరానికి కావాల్సిన ద్రవాలు, ఖనిజ లవణాలు సరైన మోతాదులో అందకపోవడం కూడా ఒక కారణం. అందుకని ఈ ఆహారాలను బాగా తీసుకోవాలి. నీరు, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవడం, అరటిపండ్లు, నట్స్, వెజిటేబుల్స్ తీసుకోవడం చేయాలి. 

రోజ్ మేరీ ఆకులు 

ఒక చిన్న గిన్నెలో నీరు తీసుకుని, అందులో కొన్ని రోజ్ మేరీ ఆకులను వేసి బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నీటిలో ఒక పలుచటి వస్త్రాన్ని ఉంచి కాలు లేదా తొడ కండరాలు పట్టివేసినప్పుడు గోరు వెచ్చగా ఉన్నటువంటి నీటిలో ముంచి తీసిన వస్త్రంతో మసాజ్ చేసుకోవడం వలన నొప్పి క్షణాలలో దూరం అవుతుంది. అలాగే గోరు వెచ్చని కొబ్బరినూనెతో కాలి, తొడ కండరాలపై మసాజ్ చేసుకోవడం వలన కూడా నొప్పి దూరమవుతుంది. 

ఈ గృహ చిట్కాలను అందరికీ తెలిసేలా షేర్ చేయగలరు..

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon