Link copied!
Sign in / Sign up
14
Shares

జుట్టు రాలకుండా, పొడవు పెరిగేందుకు, తెల్ల జుట్టు నల్లగా రావడానికి ఆయుర్వేద రహస్యాలు

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బాధపడుతున్న సమస్య జుట్టు రాలిపోతుండటం మరియు త్వరగా జుట్టు తెల్లగా మారటం.మహిళలు యుక్త వయస్సు దాటిన తర్వాత తలకు రంగు వేసుకునే వారు ఎంతోమంది ఉన్నారు. ఐతే ఇక్కడ చెప్పుకునే ఈ సింపుల్ చిట్కాలను మీరు ఫాలో అయినట్లయితే తెల్ల జుట్టు సమస్య ఉండదు మరియు జుట్టు రాలడం కూడా ఉండదు. ఎందుకంటే కొన్ని వందల ఏళ్లుగా మన ఆయుర్వేద నిపుణులు చెబుతున్నవి ఇవే…

వేపాకులు

కొన్ని వేపాకులు గిన్నెలోకి తీసుకుని అందులో నీరు పోసి బాగా మరిగించాలి. ఈ నీరు బాగా చల్లారిన తర్వాత వడగట్టుకుని తలకు రాసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసుకోవడం వలన జుట్టు రాలే సమస్య ఉండదు.

మెంతులు

రాత్రి పడుకునే ముందు ఒక చిన్న కప్పులో పెరుగు అందులో కాసిన్ని మెంతులు వేసి నానబెట్టాలి. ఉదయాన్నే పెరుగు, మెంతులను బాగా మెత్తగా అయ్యేలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని ఒక 30 నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవడం వలన జుట్టు రాలే సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.

కలబంద గుజ్జు

మనవాళ్ళు మన ఇంటి పక్కనే ఉన్న కలబంద గుజ్జు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని చెబుతున్నా మనం ఎవరు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా కలబంద గుజ్జును తలకు రాసుకుని కొన్ని నిముషాలపాటు ఆరనించి తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య ఉండదు.

తులసి ఆకులు

ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో కాసిన్ని తులసి ఆకులు వేసి బాగా మరిగించుకోవాలి. ఈ నీటిని కాసేపు పక్కనపెట్టి చల్లారనివ్వాలి. చల్లారిన ఈ నీటిని తెల్లజుట్టుతో బాధపడేవారు తలకు బాగా పట్టించి మర్దనాగా చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా తలస్నానం చేస్తే తెల్లజుట్టు సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.

ఉల్లిపాయ రసం

ఉల్లిపాయను బాగా గుజ్జుగా చేసుకుని, ఈ గుజ్జు నుండి వచ్చిన రసాన్ని తెల్ల జుట్టుతో బాధపడేవారు తలకు రాసుకుని అరగంట తర్వాత తలస్నానం చేయడం వలన తెల్లజుట్టు తగ్గిపోతుందని, అలాగే జుట్టు రాలడం నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఉసిరి రసం లేదా పొడి

కాస్త నిమ్మరసం తీసుకుని అందులో రెండు స్పూన్ల ఉసిరి పొడి గానీ ఉసిరి కాయ నుండి తీసిన రసం గానీ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని 15 నిముషాల తర్వాత తలస్నానం చేసుకుంటే జుట్టు రాలే సమస్య మరియు జుట్టు రంగు మారడం సమస్య నుండి బయటపడవచ్చు. పై అన్ని చిట్కాలలో ఏదైనా సరే వారానికి ఒకసారి చేస్తే చాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు . అలాగే మీరు తీసుకునే ఆహారంలో కరివేపాకు ఉండటం వలన జుట్టు రాలడం, రంగు మారడం జరగదు.

మీకు ఈ ఆర్టికల్ నచ్చి ఉంటే అందరికీ దయచేసి SHARE చేయగలరు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon