Link copied!
Sign in / Sign up
43
Shares

జుట్టు పొడవుగా పెరగడానికి, రాలిపోకుండా ఉండటానికి ఈ 2 టిప్స్ ఫాలో అవ్వండి

మగవారు మాత్రమే కాకుండా మహిళలు ఎదుర్కునే ప్రధాన సమస్య జుట్టు ఎక్కువగా రాలిపోవడం మరియు జుట్టు పెరగకపోవడం. పెద్ద జుట్టుతో అందమైన జడ వేసుకోవాలని మహిళలకు సాధారణంగా ఉండే కోరిక. అందుకని ఇక్కడ చెప్పుకునే సహజ సిద్ధమైన చిట్కాలనుఫాలో అయినట్లయితే మీ జుట్టును అందంగా ఉంచుకోవచ్చు.

ఉసిరి రసం లేదా ఉసిరి పొడి

ఉసిరి కాయల నుండి మరియు నిమ్మకాయల నుండి రసం తీసుకుని ఒక చిన్న గిన్నెలో రెండిటినీ మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు పొడవుగా పెరగటం లేదని బాధపడేవారు దీనిని మాస్క్ లా వేసుకుని, రెండు గంటల తర్వాత బాగా శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒక్కసారి ఇలా చేసుకుంటే చాలు మంచి ఫలితం ఉంటుంది.

ఉసిరి, కొబ్బరినూనె

రెండు ఎండిన ఉసిరికాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వీటిని కొబ్బరినూనెలో వేసి బాగా వేడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రించే ఒక గంట ముందు రాసుకుని పడుకోవాలి. ఉదయాన్నే శుభ్రంగా తలస్నానం చేసుకుంటే చాలు జుట్టు పెరుగుదల బాగా జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మెంతి పొడి మరియు ఉసిరి పొడి

జుట్టు తెల్లబడటం, జుట్టు రాలిపోవడం, జుట్టు పెరుగుదల సమస్యలు ఉన్నవారు ఒక స్పూన్ మెంతి పొడి మరియు ఒక స్పూన్ ఉసిరి పొడిని తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో కొంచెం ఆముదం తీసుకుని ఉసిరి, మెంతి పొడిల మిశ్రమాన్ని ఇందులో కలుపుకుని, వెంట్రుకలకు మాస్క్ గా వేసుకోవాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

మెంతులు

మూడు లేదా నాలుగు స్పూన్ల మెంతులను నీటిలో నానబెట్టుకోవాలి. 15 నిముషాల తర్వాత వీటిని నీటి నుండి బయటకు తీసి పిండిలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తల జుట్టుకు రాసుకుని మసాజ్ చేసుకోవాలి. అరగంట తర్వాత తలస్నానం చేసుకోవడం వలన జుట్టు రాలే సమస్య, జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు దూరమవుతాయని మన ఆయుర్వేదంలో ఉంది.

ఉల్లిరసం

గత కొన్నేళ్లుగా జుట్టు పొడవు పెరగడానికి, జుట్టు రాలకుండా, తెల్లబడకుండా, ఒత్తుగా, అందంగా ఉండటానికి మనవాళ్ళు ఫాలో అవుతున్న చక్కటి చిట్కా ఉల్లిరసం. రెండు ఉల్లిపాయలను తీసుకుని వీటి నుండి రసం బయటకు తీయాలి. ఈ రసాన్ని తల జుట్టుకు రాసుకుని ఆరిన తరవాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేసుకుంటే సరిపోతుంది.

ఈ చిట్కాలను ప్రతి మహిళకు తెలిసేలా SHARE చేయగలరు. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon