Link copied!
Sign in / Sign up
10
Shares

ఈ నెలలో మీరాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఇక్కడ చూడండి..

ఎవరు ఎన్ని చెప్పినా సరే తమ గురించి, తమ ఇంట్లో ముందే జరగబోయే పరిస్థితుల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం ఈ నెలలో ఇంట్లో మరియు మీ వ్యక్తిగత జరగబోయే విషయాలు, రాశి ప్రకారం ఎలా ఉండనున్నాయో చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే తెలుసుకోండి..

మేష రాశి

ఈ రాశి ప్రకారం మీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు కాబట్టి నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు ఇష్టమైన వాళ్లకు ఏదైనా బాధ కలిగినా, సమస్య ఎదురైనా అందుకు కారణమైన వారిపై కఠినంగా ఉంటారు. అందువలన వారి నుండి సమస్యలు ఎదురుకాకుండా మీరు ప్రశాంతంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలి.

వృషభ రాశి

ఈ రాశి ప్రకారం ఈ వారంలో కొన్ని కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఒకరిపై కోపాన్ని ఇంకొకరిపై చూపించే అవకాశం ఉంది కాబట్టి, చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు, ప్రయాణాలు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న కొన్ని పనులు విజయవంతమైన మీకు ఆనందాన్ని కలిగిస్తాయి.

మిధున రాశి

జ్యోతిష్య నిపుణులు చెబుతున్న ప్రకారం ఈ రాశి వారు ఈ వారంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాహనాలలో దూర ప్రయాణం అంత మంచిది కాదని సూచిస్తున్నారు. మీరు పూర్తి అవుతాయి అనుకున్న పనులు వాయిదా పడటం లేదా ఆగిపోవడం జరిగే అవకాశం ఉంది, కాబట్టి అస్సలు దిగులు పడకుండా మళ్ళీ ప్రయత్నం చుస్తే విజయం తప్పకుండా మిమ్మల్నే వరిస్తుంది.

కర్కాటకము

మిమ్మల్ని వెంటాడుతున్న కష్టాలు ఇకపై ఉండవని, మీరు ఎప్పటినుండో మీ కుటుంబ సభ్యుల నుండి కోరుకుంటున్న ప్రేమాభిమానాలను మీరు పొందుతారు. మీరు చేసిన గొప్పపనికి మీ ఆయన నుండి లేదా మీ కుటుంబ సభ్యుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

సింహ రాశి

ఈ రాశి ప్రకారం మీకు తెలిసిన విషయాన్ని కడుపులో, నోట్లో దాచుకోలేకపోవడం, అందరితో ఓపెన్ గా మాట్లాడే స్వభావం కారణంగా, మీకు తెలియకుండానే గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ఆచితూచి అడుగువెయ్యండి, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మరియు ఇతరుల గురించి ఆలోచించేటప్పుడు. వీలైనంత వరకు అందరినీ ఒకే విధంహెగా చూడటానికి ప్రయత్నించండి.

కన్య రాశి

పిల్లల గురించి ఆలోచిస్తున్న వారికి శుభవార్త వినగలరు. సంతాన సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు మరియు ఇంకా మీకు మంచి లాభాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయ్. అనవసరపు విషయాలు మిమ్మల్ని ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది కాబట్టి వాటి గురించి పెద్దగా ఆలోచించకండి.

తుల రాశి

ఈ రాశి ప్రకారం మీరు చాలా సున్నితమైన మనస్సు కలిగిన వారు, కుటుంబం అంటే ఎమోషనల్ గా ఉంటారు కాబట్టి, ఏదైనా సమస్య వచ్చినా అధైర్యపడకండి. ఎందుకంటే మిమ్మల్ని చిన్నచిన్న విషయాలు కూడా బాధపెడతాయి కాబట్టి. మీకు దగ్గరగా ఉన్న వారిని, మన అనుకున్నవారితో గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మళ్ళీ వీరితో మాట్లాడటానికి చాలా ఏళ్ళే పడుతుంది.

వృశ్చికం

ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభిస్తారు. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాలు సందర్శించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీరు కూడా ఊహించని కొన్ని శుభవార్తలను మీరు వింటారు.

ధనస్సు

కొన్ని చికాకు తెప్పించే పనుల కారణంగా ఎవరిపైనో ఉన్న ఆవేశాన్ని మీ పిల్లలు లేదా కుటుంబ సభ్యులపై చూపించాలనికుంటారు, అది కూడా మీకు తెలియకుండానే. దూర ప్రయాణాలు, పెళ్లిళ్లకు వెళ్లే అవకాశం ఉంది. కావున వీటికి కుటుంబ సభ్యులతో కలిసి సిద్ధంగా ఉండండి.

మకర రాశి

దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న ఇక గొడవలు ఉండవు. సంతోషంగా ఉంటారు. ఈ వారంలో మీరు, మీ ఆయన ఏ విషయంలోనైనా కొత్తపనులు మొదలుపెడుతుంటే వాటిలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని సూచిస్తున్నారు జ్యోతిష్య నిపుణులు. కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంతకుముందు మీకు ఎవరితోనైనా గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి.

కుంభ రాశి

స్నేహానికి ఎక్కువ విలువనిస్తారు. ఏ పనైనా, విషయం ఏదైనా సరే మీరే ముందుండి నడిపిస్తారు. ఇలా జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు, అనవసరపు మాటలు వస్తున్నా వెనక్కు తగ్గకండి. ఎందుకంటే మిమ్మల్ని గౌరవించేవాళ్ళు, మీ నిర్ణయాలకు ప్రాధాన్యత ఇచ్చేవారే ఎక్కువ.

మీనము

మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు అండగా మీ సహోద్యుగులు ఉంటారు. కొన్ని విషయాలు మిమ్మల్ని భయానికి గురిచేస్తాయి, అయినా సరే ధైర్యంతో ముందుకు వెళ్ళండి. మీ భాగస్వామి నుండి మీ కుటుంబానికి ఆనందాన్ని కలిగించే శుభవార్తను వింటారు.

మాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. మిమ్మల్ని, మీ మనస్సును బాధపెట్టాలని కాదు. గమనించగలరు…

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon