Link copied!
Sign in / Sign up
7
Shares

30 ఏళ్ళ తర్వాత కూడా జపాన్ మహిళలు నిత్య యవ్వనంగా, అందంగా ఉండటానికి ఏ ఆహారాలు తీసుకుంటారంటే..

మీకు తెలుసా జపాన్ దేశంలో చాలా వరకు 100 ఏళ్ళు పైబడ్డ తర్వాత కూడా ఆరోగ్యంగా జీవిస్తున్నారని. ఒకప్పుడు మనదేశంలోనూ ఇలా మన పెద్దలు, పూర్వీకులు జీవించేవారు. కానీ ఇప్పుడు మనం తీసుకునే ఆహారాల వలన మన ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంకో విషయం ఏమిటంటే జపనీస్ మహిళలు వయస్సు పెరుగుతున్న కొద్దీ నిత్య యవ్వనంగా, అందంగా ఉండటానికి కారణాలు తెలిస్తే షాక్ అవుతారు.మీరూ కూడా ఇలా  ట్రై చేసి చూడండి.

గ్రీన్ టీ

సహజ సిద్ధమైన ప్రకృతి ప్రసాదించిన గ్రీన్ టీ ఆకులను సేకరించి వాటిని పొడిగా చేసుకుని, ఒక గ్లాస్ వేడి నీటిలో ఉదయం మరియు సాయంత్రం రెండు పూటలా తప్పక సేవిస్తారట. జలుబు, దగ్గు, జ్వరం..అనే వ్యాధుల బారిన పడి ఎన్నో ఏళ్ళు అవుతోంది అని అంటున్నారు. వారు అందంగా కనిపించడానికి గ్రీన్ టీ కూడా ఒక ఉత్తమమైన చిట్కాగా చెబుతున్నారు.

పులియబెట్టిన ఆహారాలు

జపనీస్ వాళ్ళు ఎక్కువగా సన్నగా, నాజూకుగా ఉంటూనే బలంగా కూడా ఉంటారు. ఎందుకంటే వీరు సహజ సిద్ధమైన పులియబెట్టిన ఆహారాలు బాగా తీసుకుంటారు కాబట్టి. పైన చిత్రంలో చూపించినట్లుగా ఈ ఆహార పదార్థాలను వీరు తీసుకోవడం వలన ఇందులో చక్కర, పిండి పదార్థాలపై ఉండే సహజ బాక్టీరియా కారణంగా లాక్టిక్ యాసిడ్ తయారవుతుంది. ఇది బరువు తగ్గించడానికి, స్లిమ్ ఉండటానికి తోడ్పడుతుంది.

సముద్ర ఆహారం

ఇక్కడ ఎక్కువగా సముద్రపు ఆహారాన్ని (సీ ఫుడ్ ) ఇష్టపడతారు, వీటినే ఎక్కువగా తింటారు కూడా. రైస్, నూడిల్స్ వంటివి కూడా వీరి ఆహారంలో భాగమే అయిన మాంసం, సాల్మన్ ఫిష్, ట్యూనా ఫిష్, మెకెరెల్ మరియు రొయ్యలను అధికంగా తింటారు. వీటిని తీసుకోవడం వలన ఒబెసిటీ, కొలెస్ట్రాల్ సమస్యలు ఉండవు. అలాగే బీపీ కూడా నార్మల్ గానే ఉంటుంది. ఒత్తిడిని కూడా దూరం చేస్తాయి.

తక్కువ మోతాదులో తినడం

ఒక ప్లేట్ లో నిండుగా కాకుండా ఎప్పుడు కొద్ది మొత్తంలోనే ఆహారాన్ని తీసుకుంటారు. అది కూడా ఎక్కువసేపు నమిలి తింటారు. ఆకలిని చంపుకోరు కానీ తక్కువ మోతాదులో అయినా ఎక్కువసార్లు తినడం చేస్తారు. ప్లేట్ లో తక్కువ ఆహారం ఉండటం వలన అక్కడితోనే ఆపివేసే అవకాశం ఉంటుంది మరియు అధిక బరువు ఉన్నవారికి ఇది మంచి చిట్కా.

నడకకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు

మీరు చూశారో లేదో కానీ అప్పుడప్పుడు మన సినిమాలలో జపాన్ వాళ్ళను చూపించినప్పుడు ఎక్కువ శాతం నడుస్తూనే ఉంటారు. వాళ్ళ దగ్గర కార్లు, మెట్రో ట్రైన్స్, మోటార్ బైక్స్ ఉన్నా కూడా అత్యవసరం అయితేనే ఉపయోగిస్తారట. ఆఫీస్, స్కూల్, కాలేజీలకు నడుస్తూనే వెళ్తారట. నడక వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఒకప్పుడు మన దేశంలోనూ వీళ్ళకంటే ఎక్కువగా మనవాళ్ళే బాగా ఆరోగ్యంగా ఉండేవారు కానీ ఇప్పుడే ఇలా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నాం. ఇప్పటినుండైనా ఈ విధంగా చేయడం వలన మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon