Link copied!
Sign in / Sign up
1
Shares

జనవరి 1 న చేయకూడని 5 పనులు

ముందుగా ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరు మొదలుపెట్టే ప్రతి పనిలో అంతా మంచే జరగాలని, కుటుంబంతో సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటోంది మీ టైనీ స్టెప్. మనం కొత్త సంవత్సరం రోజు ఏదైనా మొదలుపెడితే సంవత్సరం మొత్తం అలాగే గడుస్తుందని చెబుతూ ఉంటారు పెద్దలు. కాబట్టి న్యూ ఇయర్ రోజున ఈ 5 పనులు అస్సలు చేయకండి.. అవేంటో తెలుసుకోండి.

మొదటిరోజు ఇలా మొదలు పెట్టండి

కొత్త సంవత్సరం రోజున ఉదయాన్నే తల స్నానం చేసి, ఇంటిని బాగా శుభ్రం చేసుకుని, మీరు మీ పిల్లలు కొత్త బట్టలు ధరించి కుటుంబంతో కలిసి గుడికి వెళ్ళండి. గతేడాది మీ జీవితంలో మీకు తెలియకుండా జరిగిన తప్పులను ఒక్కసారి అనుకుని ఇకపై అలాంటివి జరగకుండా చూసుకోండి. కొత్త లక్ష్యాలను ఏర్పాటు చేసుకోండి. మీ ఆదాయం, మీ ఖర్చులు ఎలా ఉన్నాయో చూసుకుని ఆదా ఎలా చేయాలో ఆలోచించండి. ఇవన్నీ వదిలేసి బద్ధకంగా మాత్రం ఉండకండి..

అపద్ధాలు ఆడద్దు, ఆడించవద్దు

మనం కొత్త సంవత్సరంలో చేసే పనులే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవటం, అలవాటు అవుతూ ఉంటాయని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో అపద్ధాలు చెప్పడం ఒకటి.. కాబట్టి అపద్ధాలకు దూరంగా ఉండండి. అలాగే మీ పిల్లలకు కూడా అపద్ధం ఆడకూడదు, ఏదైనా తప్పు చేసినా నిజాయితీగా ఒప్పుకోవాలని చెప్పండి.

గొడవలకు దూరంగా ఉండండి

కుటుంబ సభ్యులతో లేదా మీ భాగస్వామితో చిన్న చిన్న గొడవలు ఉండటం సర్వ సాధారణమే. న్యూ ఇయర్ రోజున అన్నీ మర్చిపోయి హాయిగా, సంతోషంగా ఉండండి. ఎవరితో గొడవ పడకుండా, మనస్పర్థలు లేకుండా ఉంటే ఇయర్ మొత్తం అలాగే ఉండగలరు. సంతోషంగా బ్రతకడానికి ప్రేమ, ఆప్యాయత చాలు కదా.. ఏమంటారు.

కుటుంబంతో ఇష్టం లేకుండా

ఇది ఎక్కువగా యువతకు సంబంధించినదే.. ఎందుకంటే కుటుంబానికి దూరంగా ఉంటూ బయటే ఎక్కువగా గడుపుతుంటారు. స్నేహితులను కలవడం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపాలి. అలాగే మీ కోసం మీ కుటుంబం కూడా ఎదురుచూస్తూ ఉంటుంది. కాబట్టి వారితో కొన్ని గంటలు సరదాగా గడపండి, వారిని సంతోషపెట్టండి.

అబాంఢాలు వేయకూడదు 

కొందరు కొన్ని విషయాలలో తెలిసో తెలియకో తప్పులు చేసి ఉండవచ్చు. కావాలనే చేయరు కాబట్టి, వారిపై కావాలనే అబాండాలు వేయడం, లేనిపోని చాడీలు చెప్పడం చేయకూడదు. హా..అన్ని రోజులలాగే ఇది కూడా ఒకరోజు అని కూడా మన కుటుంబం బాగుండాలి, కొత్త లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ఉన్నత స్థానాలకు వెళ్లటానికి ప్రయత్నించండి.

మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ మరోసారి హ్యాపీ న్యూ ఇయర్ 2018.. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon