Link copied!
Sign in / Sign up
2
Shares

జాగ్రత్త!! ప్రెగ్నన్సీ సమయంలో ఈ 5 శరీర భాగాలు దెబ్బతినే ప్రమాదముంది

ప్రెగ్నన్సీ, ప్రతి మహిళ తన జీవితంలో జరగాలని కోరుకునే ఒక అద్భుతమైన విషయం. మీ జీవితంలో ప్రెగ్నన్సీ కొన్ని మధురానుభూతులను మిగిలిస్తుంది. కానీ వాటితో మీ శరీరంలో కొన్ని మార్పులు తీసుకొస్తుంది. ప్రెగ్నన్సీ సమయంలో జరిగే ఈ మార్పులు కొన్ని కొంత మాములు స్థితికి చేరుకుంటాయి. కొన్ని అవయవాలలో జరిగే మార్పులు కొంత దెబ్బ తినే ప్రమాదం కూడా వుంది. అవేంటో జరిగే ప్రమాదమేంటో ఇక్కడ తెలుసుకోండి…

1. పాదాలు

ప్రెగ్నన్సీ సమయంలో మీ పాదాలు, సహజంగా ఉన్న సైజు కన్నా రెండింతలు సైజు పెరుగుతాయి. మీరు 6 నెల చేరుకునే లోపు, మీరు అధిక బరువు పెరగడం వలన, మీ పాదాలు నెప్పులు పుడుతాయి. ఇలా జరగడం సహజమే. అయితే మీరు పాదాలు దెబ్బ తినకుండా ఉండాలంటే ఈ సమయంలో ఎక్కువ దూరాలు నడవకండి, పాదాల మీద ఎక్కువ వత్తిడి పడుతుంది.

2. తల

ప్రెగ్నన్సీ సమయంలో తల నొప్పి తరచు వస్తూవుంటుంది. కొన్ని తీవ్రంగా కూడా ఉండచ్చు. మీకు ఇంతకముందే మైగ్రేన్ లాంటి తలనొప్పి అది ప్రెగ్నన్సీ సమయంలో తీవ్రమయ్యే ప్రమాదముంది. దీనంతటికి కారణం ప్రెగ్నన్సీ సమయంలో కలిగే వత్తిడి. దానికి దూరంగా ఉండండి.

3. మూత్రపిండాలు

మూత్రపిండాలు సాధారణంగా చేసే పనికంటే, ప్రెగ్నన్సీ సమయంలో కాస్త ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. దీని వలన కలిగే వత్తిడి మూత్రపిండాల్లో నొప్పిని కలిగిస్తాయి. చాలా మంది సాధారణ వెన్ను నొప్పి అనుకుని పెద్దగా పట్టించుకోరు. కానీ తర్వాత ఇది తీవ్రమైన సమస్యగా మారుతుంది. ముందే తగిన జాగ్రత్తలు తీసుకోండి. రోజుకు కావాల్సిన నీరును తప్పకుండా తీసుకోండి.

4. బొడ్డు

ఇది మీరు ఊహించి ఉండరు. కానీ ప్రెగ్నన్సీ దీని మీద ప్రభావం చూపిస్తుంది. ప్రెగ్నన్సీ సమయంలో నెలలు పెరిగే కొద్ది, కడుపు సైజు పెరుగుతుంది. ఇది మీ బొడ్డు పై వత్తిడి కలిగించి మీకు నొప్పి కలిగే అవకాశం ఉంటుంది.

5. పిరుదులు

సాధారణంగా మన శరీర బరువు పిరుదుల మీద అధికంగా పడుతుంది. ప్రెగ్నన్సీ సమయంలో ఆ బరువు ఇంకాస్త ఎక్కువవుతుంది. ఆ ప్రాంతంలో కొవ్వు కూడా ఎక్కువగా పేరుకుపోతుంది. ప్రెగ్నన్సీ సమయంలో పిరుదుల సైజు పెరుగుతుంది. ప్రసవం తరువాత మీరు తీసుకునే జాగ్రత్తలు, పిరుదులను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చు. 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon