Link copied!
Sign in / Sign up
79
Shares

“ఇవి తింటే పిల్లల రోగనిరోధక శక్తి పెరుగుతుంది!!” అని నిరూపించబడిన 10 పవర్ ఫుడ్స్

పిల్లలు రోగాల బారిన పడడం,ప్రతి అమ్మను బాధపెట్టే, కలవపెట్టే విషయం. మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అప్పుడే ఇప్పుడో పిల్లలకు తప్పకుండా ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. మీరు పిల్లల ఆహార విషయంలో తీసుకునే జాగ్రత్తలు మీ పిల్లలకు రోగాలు రాకుండా కాపాడుతాయి. అవును పిల్లలకు రోగాలను ఎదురుకునే  రోగ నిరోధక శక్తిని ఆహారాల ద్వారా పెంచవచ్చు. అందుకు ఈ పవర్ ఫుడ్స్ ను మీ పిల్లలకు తినిపించండి…

1. అల్లం

అల్లంలో ఉండే ఔషధ గుణాలు, అనేక జబ్బులకు నివారణగా పనిచేస్తాయి. పిల్లలు 8 నెలల వయసు దాటిన తరువాత వారి ఆహారంలో అల్లాన్ని చేర్చండి. ఇది పిల్లలలో దగ్గు, జలుబు లాంటి జబ్బులను నయం చేయడమే కాకూండా, పిల్లలకు ఆ జబ్బులను రాకుండా నివారిస్తుంది.

2. క్యారెట్స్

క్యారెట్స్ లో అధికంగా ఉండే బీటా కరోటిన్, శరీరంలోకి చేరాక విటమిన్ ‘A’ గా మారుతుంది. అందుకే క్యారట్ పిల్లలకు తినిపించడం చాలా అవసరం. విటమిన్ ‘A’ పిల్లల కంటి చూపును ఆరోగ్యాంగా ఉంచడమే కాకూండా, ఏ కంటి చూపు సమస్యలు రాకుండా చేస్తుంది.

3. పెరుగు

మీ పిల్లలు 7-8 నెలలు వయసు నుండి పెరుగు తినిపించడం మొదలుపెట్టండి. పెరుగులో పిల్లల ఎదుగుదలకు కావల్సిన ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా పిల్లలకు అరుగుదల సమస్యలు రాకుండా చేస్తుంది.

4. వెల్లులి 

7 నెలల వయసు దాటినా తరువాత, పిల్లలకు వెల్లుల్లిని తినిపించచ్చు. చిన్న ముక్కలుగా చేసి పిల్లల ఆహారంలో చేర్చండి. గాయాలు త్వరగా మానిపోవడానికి, పిల్లలకు రోగ నిరోధక శక్తిని అందిస్తుంది.

5. పండ్లు

పిల్లలకు పండ్లు తినిపించడం చాలా అవసరం. అరటి పండు, బత్తాయిలు, ద్రాక్ష ఇలాంటి పండ్లలో, విటమిన్స్, యాంటీ యాక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే సాలిడ్ ఫుడ్ పూర్తిగా అలవాటు అయిన తరువాత మాత్రమే పండ్లను తినిపించండి.

6.బొప్పాయి

బొప్పాయిలో ఉండే విటమిన్ ‘B’ , విటమిన్ ‘C’ పిల్లల ఎదుగుదలకు చాలా అవసరం. విటమిన్ ‘B’ ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. విటమిన్ ‘C’, పిల్లలకు ఇన్ఫెక్షన్లు ఎదురుకునే, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

7. పాల కూర (Spinach)

పిల్లల ఆహారంలో పాల కూర, లాంటి ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. దీనిలో పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచే ఐరన్, విటమిన్ ‘C’ ఉంటాయి.  

8. గుడ్లు 

గుడ్లు పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా అవసరమైన ఆహరం. గుడ్లు, ప్రోటీన్లతో, యాంటీఆక్సిడాంట్స్, పోషకాలతో పుష్కలంగా నిండి ఉంటుంది. అందుకే పిల్లలకు రోజుకు ఒక గుడ్డు తప్పక తిన్పించండి. పిల్లల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 

9. పుట్ట గొడుగులు (మష్రూమ్స్)

మష్రూమ్ తినడానికి రుచిగా ఉంటాయి, అలాగే మంచి పోషక విలువలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే జింక్ (ZINC) రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. జింక్ శరీరంలో తెల్ల రక్థ కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇవి పిల్లలను రోగాలు, ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతాయి. 

10. డ్రై ఫ్రూట్స్ 

పిస్తా, బాదాం, వాల్ నట్స్, ఎండు ద్రాక్ష, జీడిపప్పు లాంటి మీ పిల్లల రోజు వారి ఆహారంలో భాగం చేయండి. వీటిలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ తో పాటు ఆంటియాక్సిడెంట్స్, ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్, విటమిన్ E కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మీ పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon