Link copied!
Sign in / Sign up
12
Shares

మీ ఇంట్లో పనికిరాని పాత దుస్తులు ఉన్నాయా, అయితే వెంటనే ఈ 5 రకాలుగా చేసుకోండి.. చాలా సులభం కూడా

ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా పాత దుస్తులు ఉండనే ఉంటాయి. ముందుగా అవి ఎక్కడ ఉన్నాయో అన్నిటినీ బయటకు తీయండి. చీరలు,  పిల్లలకు సరిపోలేదని పక్కన పడేసిన దుస్తులు.. ఇలా ప్రతి ఒక్క దుస్తులను మళ్ళీ అందంగా కనిపించేలా ఈ విధంగా ఉపయోగించండి.  అనవసరంగా ఖర్చుపెడుతున్న డబ్బును ఈ విధంగా పొదుపు చేసుకోండి. ఆ పొదుపు డబ్బును మీ పిల్లల కోసం ఉపయగించండి..

కిటికీలకు కర్టెన్లుగా వాడండి

ఇంట్లో ఉన్న కిటికీలకు, కిటికీల అద్దాలపై దుమ్ము ధూళి పడకుండా, ఇంటి ముందు వాకిళ్ళకు మీ పాత చీరలను ఉపయోగించండి. వాటిని ముందుగా సపరేట్ చేసి కిటికీలు, వాకిళ్ళకు సరిపోయేలా కత్తిరించుకోండి. వేరేవాళ్ళు ఏమనుకుంటారో అని టెన్షన్ పడకండి. ప్రస్తుతం ఇవే ట్రెండ్ కూడా. చాలా అందంగా కనిపిస్తాయి. అలాగే టీవీలపై, ఫ్రిడ్జ్ లపై కప్పడానికి కూడా ఉపయీగించండి.

దిండ్లు

వేస్టుగా ఒక మూలన పడి ఉన్న బట్టలను తీసుకోండి. మీ దుస్తులలో అందంగా ఉండే ఒక క్లాత్ ను దిండు (పిల్లో) కవర్ గా ఉపయోగించి, అందులో వేస్ట్ గా ఉన్నాయి అనిపించే బట్టలు వేయండి. దీంతో అందమైన, మెత్తనైన దిండ్లు రెడీ. ఆ దిండు కవర్ మరింత అందంగా కనిపించేలా డిజైన్లు వేస్తే ఇంకా బాగుంటాయి. వీటిని సోఫాలలో ఉంచడం వలన ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. చీరలన్నిటితో కలిపి బొంతలు కుట్టించుకుంటే పడుకోవడానికి మెత్తగా ఉంటాయి.

మీ ఆయన జీన్స్ ప్యాంట్ ఇలా వాడండి

మీ భర్త లేదా పిల్లలు టైట్ గా అయ్యాయని పక్కన పడేసిన జీన్స్ ప్యాంట్లను కత్తిరించి బాత్ రూమ్ లలో పేస్ట్, బ్రష్, షేవింగ్స్ కిట్లు, కిచెన్ రూమ్ లో కూరగాయలు కట్ చేసుకునే కత్తులు, గరిటెలు ఉంచుకోవచ్చు. అలాగే బాత్ రూమ్ ఎంట్రన్స్ ముందు ఈ జీన్స్ ప్యాంట్లను ఉంచడం వలన బాగానే ఉంటాయి.

పిల్లల బొమ్మలకు..

పిల్లల బొమ్మలు అందంగా ఆకర్షణీయంగా కనిపించడానికి బొమ్మలను చీర గుడ్డ ముక్కలతో కట్టడం చేయండి. పిల్లలు వీటిని చాలా బాగా ఇష్టపడతారు. టీ పాయ్ పై గుండ్రంగా లేదా చతురాకారంలో పాత దుస్తులు కత్తిరించి ఉంచడం వలన భలే బాగా కనిపిస్తాయి. చూసేవారికి కూడా బాగా డిజైన్ చేశారే అనిపిస్తుంది.

వంటింట్లో ఇలా వాడండి

కిచెన్ లో వంట చేసేటప్పుడు మీ చీరలు లేదా శరీరంపై ఏమీ పడకుండా పాత దుస్తులను ఇదిగో ఇలా ఫోటోలో చూపించిన విధంగా కట్ చేసుకుని ధరిస్తే మంచిది.

సోఫా లేదా కుర్చీ కవర్ అందంగా ఉండేలా..

 

మీ పాత దుస్తులతో హ్యాండ్ బ్యాగ్

 

ఇంటి ఎంట్రన్స్ లో లేదా హాల్ మధ్యలో అన్ని చీరలతో కలిపి ఇలా.. 

ఇవి అన్ని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. అందరికీ SHARE చేయండి. ఈ ఫోటోల ప్రకారం మీరు మీ పాత దుస్తులను కట్ చేసుకుని ఉపయోగించండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon