Link copied!
Sign in / Sign up
79
Shares

ఇంట్లో చిన్న పిల్లలున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 4 ఉత్తమ ఇంటి చిట్కాలు

పసి వయస్సులో పిల్లల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన వారికి త్వరగా వ్యాధులు వ్యాపించడం, ప్రతి విషయానికి ఏడవటం,  కడుపులో బాధ, రాత్రి పూట సరిగ్గా నిద్రపోలేకపోవడం వంటివి ప్రతి ఇంట్లోనూ జరుగుతున్నవే. ఐతే అర్ధరాత్రి డాక్టర్ వద్దకు వెళ్ళడానికి  అందరికీ ఇబ్బందే కాబట్టి చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఈ 6 అద్భుత ఇంటి చిట్కాలు మీ దగ్గర ఉండటం మంచిది. అవేంటో తెలుసుకుని అందరికీ SHARE చేయండి.

చామంతి పూల టీ

చామంతి పూలతో తయారు చేసిన టీని పిల్లలకు ఇవ్వడం వలన కడుపులో నొప్పి బాధ ఉండదు మరియు మంచి నిద్రను కలిగిస్తుంది కూడా. ఒక చిన్న స్పూన్ తో నాలుగు సార్లు ఇవ్వవచ్చు. గది ఉష్ణోగ్రత ప్రకారం టీ వేడిగా ఉంటే చాలు.

తేనె నిమ్మరసం

ఈ కాంబినేషన్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా, రోగ నిరోధక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది ఒక సంవత్సరం పిల్లలకు ఒక స్పూన్ మాత్రమే చాలు. ఇంకా మీ బిడ్డ ఏడుపు ఆపలేదంటే డాక్టర్ ను సంప్రదించాలి.

బేకింగ్ సోడా

దోమలు లేదా చిన్న చిన్న పురుగులు పిల్లల సున్నితమైన చర్మంపై కుట్టడం వలన దురద, మంట కలుగుతుంది. అటువంటప్పుడు పిల్లల చేతులు అక్కడికే ఎక్కువగా వెళ్లడం దాన్ని గిల్లడం చేస్తుంటారు. కాబట్టి రెండు స్పూన్ల నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి ఆ ప్రాంతాలలో రాయడం వలన మంట, దురద ఉండవని నిపుణులు చెబుతున్నారు.

సాక్సులో బియ్యం

చిన్న పిల్లలు ఎక్కువగా కడుపునొప్పి మరియు మెడ నొప్పితో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అందుకని చాలామంది తల్లులు తమకు తోచినవి చేస్తుంటారు. ఇప్పటి నుండి ఒక సాక్సులో బియ్యం తీసుకుని ముడివేయాలి. మూటకట్టిన దీనిని గోరు వెచ్చగా వేడి చేసి పిల్లలకు ఎక్కడ నొప్పిగా ఉంటే ఆ ప్రాంతంలో మర్దనా చేయడం వలన నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

అల్లం టీ

మీరు మీ పిల్లలను తీసుకుని ప్రయాణం చేస్తున్నప్పుడు పిల్లలకు వాంతులు రాకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్కను ఒక అరగ్లాసు వేడి నీటిలో ఉంచాలి. ఈ నీటిని ప్రయాణం చేసేముందు ఒక స్పూన్ పిల్లలకు ఇవ్వడం వలన వాంతులు కావు మరియు త్వరగా నిద్రలోకి జారుకుంటారు. ఇది రోగ నిరోధక శక్తి పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది కూడా..

దోసకాయ

మీ పిల్లల శరీరంపై ఏ ప్రాంతంలోనైనా వాపుగా ఉన్నట్లయితే దోసకాయను ముక్కలుగా కోసి ఆ ప్రాంతంలో ఉంచడం వలన వాపు తగ్గుతుంది మరియు పిల్లలకు మంచి ఉపశమనంగా పనిచేస్తుంది. మరీ చల్లగా ఉండే దోసకాయలను ఉపయోగించకండి.

పిల్లల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది మరియు రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి తల్లి ఈ జాగ్రత్తలు పాటించాలి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon