Link copied!
Sign in / Sign up
17
Shares

ఇంట్లో బొద్దింకలు, బల్లులను తరిమి కొట్టే 2 అద్భుత సహజ చిట్కాలు : మందులు, కెమికల్స్ అవసరం లేదు

ప్రతి ఒక్కరి ఇంట్లో వంటింటి గదిలో, స్నానాల గదులలో బొద్దింకలు చేరి సమస్యగా మారుతూ ఉంటాయి. ఇక కొందరి ఇళ్ళలో ఐతే బల్లులు, దోమలు, ఈగలు  తెగ ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. చిన్న పిల్లలున్న ఉన్న ఇంట్లో ఇలా బొద్దింకలు, బల్లులు చేరితే వారి ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతాయి.  కాబట్టి ఇక్కడ చెప్పుకునే ఈ అద్భుత సహజ చిట్కాల ద్వారా వీటి బెడద నుండి ఎలా బయటపడవచ్చో తెలుసుకోండి..

బొద్దింకలు పారిపోవడానికి..

వంటగదిలో మరియు బట్టలు ఉంచుకునే అల్మారాలలో బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి. అందుకని వెల్లుల్లిల నుండి లేదా ఉల్లిపాయల నుండి రసాన్ని తీసి, ఈ రసాన్ని బొద్దింకలు ఎక్కువగా ఉన్నచోట చల్లడం వలన బొద్దింకలు అక్కడికి చేరవు. వెల్లుల్లి మరియు ఉల్లిపాయ బొద్దింకలు పట్ల క్రిమి సంహారినిగా పనిచేస్తుంది.

బిరియానీ ఆకు

కొన్ని బిరియానీ ఆకులను తీసుకుని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని బొద్దింకలు ఎక్కువగా ఉన్నచోట చల్లటం వలన బొద్దింకల బెడద ఉండదు. అలాగే దోసకాయ తొక్కలు లేదా వాడిన నిమ్మకాయలను బొద్దింకలు బాగా ఉన్న చోట ఉంచడం వలన ఈ సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.

బల్లులను బయట పంపేందుకు

వాస్తవానికి ఇంట్లో బల్లులు ఉండటం వలన కొన్ని విధాలుగా ఉపయోగకరమే. ఎందుకంటే చిన్న చిన్న క్రిమి కీటకాలను, గోడలపై ఉండే పురుగులను తినటం చేస్తుంటాయి. ఐతే ఇవి వంటింట్లో లేదా ఆహారంపై వాలినప్పుడు ప్రమాదమే అని చెప్పాలి.

కోడిగుడ్డు పెంకులు

కోడిగుడ్ల వాసనకు బల్లులు దూరంగా వెళ్లిపోతాయి. కాబట్టి, కోడిగుడ్ల పెంకులను బల్లులు ఎక్కువగా ఉన్న చోట గానీ ఆ పెంకులను గోడల దగ్గర రంగులు వేసి వేలాడదీయడం వలన బల్లులు ఉండవు. అలాగే ఇంటి ద్వారం ముందు కోడిగుడ్డు పెంకులను ఉంచడం వలన బల్లులు మరియు క్రిమి కీటకాలు, బొద్దింకలు కూడా లోపలికి రావు.

నెమలి ఈకలు

నెమలి ఈకలను బల్లులు ఎక్కువగా ఉన్న చోట ఉంచడం వలన బల్లులు దూరంగా వెళతాయని మన పెద్దలు చెబుతున్నారు. ఇది మేమేమీ కొత్తగా చెప్పట్లేదు. మన ఊర్లలో పెద్దలు కొన్ని సంవత్సరాల నుండి ఈ చిట్కాలను ఫాలో అవుతున్నారు కూడా. నెమలిని చూస్తే భయపడి వెళ్లడమే ఇందుకు కారణమని అంటున్నారు.

సో, మార్కెట్ లో దొరికే కెమికల్స్, మందులకు ఎక్కువగా ఖర్చుపెట్టడం వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. అందరికీ SHARE చేయండి..

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon