Link copied!
Sign in / Sign up
2
Shares

తెగిన కాలును రోగికి తలదిండుగా పెట్టిన డాక్టర్లు : దారుణం అని ఏడుస్తున్న కుటుంబ సభ్యులు

బస్సు - ట్రాక్టర్ ఆక్సిడెంట్ ప్రమాదంలో బస్సు క్లీనర్ గా పనిచేస్తున్న వ్యక్తికి ప్రమాదవశాత్తు కాలు విరగడంతో దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా, హాస్పిటల్ లో పనిచేస్తున్న ఇద్దరు వైద్యులు, ఇద్దరు నర్సులు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. విరిగిన కాలును తీసి అక్కడ రోగికి తలదిండు లేకపోవడంతో తెగిన కాలునే దిండుగా ఉంచారు. ఈ సంఘటన ప్రస్తుతం దేశమంతటా వైరల్ గా మారింది. అసలేం జరిగిందో చూస్తే డాక్టర్లు ప్రవర్తించిన తీరు చూస్తే గుండెల్లో బాధకలుగుతుంది.

అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ అనే జిల్లాలో ఘన్ శ్యామ్ (28) అనే వ్యక్తి ఒక స్కూల్ బస్సుకు క్లీనర్ గా పనిచేస్తున్నాడు. 25 మంది విద్యార్థులతో వెళ్తున్న ఆ స్కూల్ బస్సు ట్రాక్టర్ ను ఢీ కొట్టే ప్రమాదం నుండి తప్పించుకుని బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో ఘన్ శ్యామ్ కు తీవ్ర గాయాలు కావడంతో దగ్గరలోని ఝాన్సీ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించారు. స్ట్రెచర్ పై అతడిని తీసుకువెళ్తుండగా అతడి తలకింద దిండు లేకపోవడంతో తెగిపోయిన కాలినే తలదిండుగా ఉంచారు.

దారుణమైన చర్య అంటూ వైరల్ వీడియో..

ఘన్ శ్యామ్ కాలిని తలదిండుగా వైద్యులు ఉపయోగించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో దేశమంతటా వైరల్ అయ్యింది. అతడి బంధువులు వచ్చి స్ట్రెచర్ పై ఉన్న ఘన్ శ్యామ్ ను చూసి మీరేం చేస్తున్నారు అని డాక్టర్లను నిలదీయగా కొన్ని నిముషాల తర్వాత కాలిని తీసి పక్కన పెట్టారట. రోగిపట్ల ఇలా దారుణంగా ప్రవర్తించిన ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులను అధికారులు సస్పెండ్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఘన్ శ్యామ్ తో పాటు వచ్చిన సహాయకులే తలదిండు లేకపోవడంతో ఇలా కాలిని పెట్టారని ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ అంటున్నారు. సీసీ ఫుటేజ్ చూసి దీనికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే చాలామందికి నమ్మకం లేకుండా పోతోంది.. రోగులపట్ల ఇలా ప్రవర్తించి వైద్యులపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకండి అంటూ సోషల్ మీడియాలో తమ కామెంట్స్ తెలుపుతున్నారు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon