Link copied!
Sign in / Sign up
5
Shares

మీ ఇల్లు వాసన రాకుండా సువాసనగా ఉండాలంటే ఈ 4 గృహ చిట్కాలు పాటించండి..

 

ఇల్లు పరిశుభ్రంగా ఉంటే ఇంట్లో ఉండే మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు మరియు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంటిని మరింత పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కొందరు ప్రతిరోజూ తమ ఇంటిని శుభ్రం చేసుకుంటున్నా సరే కొన్నిసార్లు వాసన వస్తుండటం జరుగుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ చెప్పుకునే ఈ సింపుల్ గృహ చిట్కాలను ఫాలో అయినట్లయితే ఇంటిని శుభ్రంగా, ఎటువంటి వాసన లేకుండా చూసుకోవచ్చు.

లావెండర్ ఆయిల్

కొంచెం లావెండర్ ఆయిల్ తీసుకుని అందులో కాటన్ ముంచి మీ ఇంట్లో ఎక్కడ వాసన ఎక్కువగా వస్తుందని మీకు అనిపిస్తుందో లేదా కొన్ని మూలల ఆ కాటన్ ను ఉంచడం వలన చెడు వాసన నుండి బయటపడవచ్చు.

వంటింట్లో వచ్చే వాసన

 

ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇది సర్వసాధారణం. వంటింట్లో ఎక్కువగా వాసన వస్తుండటం జరుగుతూ ఉంటుంది. స్టవ్ పై పాలు పొంగింపోయిన్నప్పుడు, అక్కడ ఎప్పటికప్పుడు వదిలేసిన కొన్ని పదార్థాల వలన ఎక్కువ వాసన వస్తుంటుంది. అందుకని కొంచెం ఉప్పు మరియు వంటసోడా తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంతో స్టవ్ పై పడ్డ మరకలను, వంటింట్లో మురికిగా ఉన్న చోట శుభ్రం చేసుకోవాలి.

కిటికీలు

 

ప్రస్తుతం చాలామంది పట్టణాలలో నివసిస్తున్నారు కాబట్టి, ఇక్కడ ఎక్కువగా తలుపులు, కిటికీలను మూసివేసి ఇంట్లో ఉంటారు. తలుపులు వేసుకోవడం ఓకే గానీ, ఇంట్లోకి కొంచెం గాలైనా తగలకుండా కిటికీలు మూసివేయడం, వంటింట్లో పొగ బయటకు వెళ్లేలా చూసుకోవడం చేయాలి. ఇంట్లోకి దోమల బెడద ఉన్నప్పుడు కిటికీలకు నెట్స్ ఉపయీగించాలి. ఇంట్లోకి గాలి రావడం వలన దుర్వాసన ఇబ్బంది ఉండదు.

నారింజ మరియు కమలాపండ్లతో..
 

 

ఇంట్లో దుర్వాసన ఎక్కువగా ఉన్నప్పుడు ముందు నారింజ మరియు కమలపండ్ల తొక్కలను తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై కడాయి లేదా పెనం ఉంచుకుని తొక్కలను అక్కడ వేసుకోవాలి. ఇలా చేయడం వలన చెడు వాసన దూరమై మంచి సువాసన ఇంట్లో వెదజల్లుతుంది.

సింక్ లో అడ్డుకున్న చెత్తను

 

వంటింట్లో ఇది దాదాపు ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సమస్య. ఎప్పుడు ఎంత క్లీన్ చేసుకున్నా సరే, సింక్ లో ఏదో అడ్డుపడటం నీళ్లు, అందులో ఇరుక్కుపోయిన చెత్త బయటకు పోకుండా వాసన వస్తుంటుంది. అటువంటప్పుడు వెనిగర్ లేదా కొంచెం వంటసోడా, ఉప్పు మరియు వెనిగర్ లను మిక్స్ చేసుకుని సింక్ లో వేయాలి. కొంచెంసేపు అలాగే ఉంచి, వేడినీళ్లు సింక్ లో పోయడం వలన ఎటువంటి చెత్త అయినా సరే బయటకు పోయి వాసన రాకుండా చూసుకోవచ్చు.

రూమ్ స్ప్రేలు
 

చాలామంది ఎక్కువగా రూమ్ స్ప్రే లేదా రూమ్ ఫ్రెషనర్ లు గదిలో వాసన వస్తున్నప్పుడు ఉపయీగిస్తూ ఉంటారు. అయితే కొన్ని కెమికల్స్ అందులో కలపటం వలన చాలామందికి అవి పడకపోవచ్చు. అందుకని కొన్ని న్యాచురల్ గా రెడీ చేసిన రూమ్ స్ప్రేలు వాడటం వలన గదిలో సువాసన వెదజల్లుతుంది.

లెమన్

గదిలో వాసనగా ఉన్నప్పుడు ఒక బాటిల్ లో నీరు తీసుకుని అందులో నిమ్మరసం లేదా లెమన్ ఆయిల్ కలుపుకుని స్ప్రే చేసుకోవడం వలన సువాసన వెదజల్లుతుంది. అలాగే వంటగదిలో పడ్డ మరకలను వదలగొట్టడానికి నిమ్మరసం చుక్కలను వేసి కొంచెం గోరువెచ్చగా ఉన్న నీటితో వెంటనే శుభ్రం చేసుకుంటే వాసన రాకుండా నిరోధించవచ్చు.

ఈ గృహ చిట్కాలు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేవే కాబట్టి అందరికీ షేర్ చేయగలరు..

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon