Link copied!
Sign in / Sign up
24
Shares

ఇడ్లీలు పిల్లలు తినడానికి మెత్తగా, తెల్లగా రావాలంటే ఏం చేయాలి..?

ఇడ్లీ.. ఆరోగ్యకరమైన ఆహారం. దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇడ్లీలు చేసుకుంటూ ఉంటారు. అయితే హోటల్ లో ఉన్నట్లు తెల్లగా,మెత్తగా, రుచికరంగా మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఎందుకు ఉండవు? అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. ఇక్కడ చెప్పుకునే ఈ సింపుల్ చిట్కాల ద్వారా ఇడ్లీలు మెత్తగా, తెల్లగా మరియు రుచికరంగా ఉంటాయి.

ఇడ్లీలు తెల్లగా రావాలంటే..

1. ఇడ్లీలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజు మినుములు మధ్యాహ్నం నానబెట్టుకోవాలి. అలాగే ఇడ్లి పిండి కూడా రెండు గంటలు నానబెట్టుకోవడం మంచిది. ఇడ్లీ పిండి పొంగిన తర్వాత మళ్ళీ ఆ పిండిని కలపకుండా అలాగే ఇడ్లీ పాత్రలో వెయ్యడం వలన మెత్తగా ఉంటాయి.

2. ఇడ్లీ పిండిను రుబ్బుకునేటప్పుడు 15 నిముషాల పాటు నానబెట్టిన అటుకులను అందులో వేసి రుబ్బుకోవడం వలన తెల్లగా మెరుస్తాయి.

3. ఇడ్లీ పిండిని రాత్రి గుడ్డకట్టి ఒక పాత్రలో పెట్టినప్పుడు పొంగిపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని కలియపెట్టి  ఇడ్లీ పాత్రలో వేస్తే ఇడ్లీలు గట్టిగా అవుతాయి. మెత్తగా, మృదువుగా రావాలంటే ఇకపై ఇలా చేయకండి.

ఇడ్లీలు టేస్ట్ గా, మృదువుగా ఉండాలంటే..

1. ఇడ్లీలు మృదువుగా, మెత్తగా రావాలంటే ఇడ్లీ పిండి రుబ్బుకునే సమయంలో అందులో రెండు ఆముదం చుక్కలు వేసుకుంటే చాలు.

2. ఇడ్లీ పిండి నానబెట్టేటప్పుడు అందులో కాసిన్ని మెంతులు వేసి నానబెట్టడం వలన ఇడ్లీలు రుచికరంగా ఉంటాయి.

3. ఇడ్లీలు ఉడికించిన తర్వాత చాలామంది చేస్తే పొరపాటు వెంటనే స్టవ్ పై నుండి దించివేయటం. ఇలా కాకుండా ఒక 5 నిముషాల పాటు స్టవ్ పై ఉంచడం వలన ఇడ్లీలు రుచికరంగా, మృదువుగా ఉంటాయి.

ఇడ్లీల చిట్కాలు మీకు నచ్చితే COMMENT చేయండి. ఇటువంటి చిట్కాలు మరిన్ని కావాలంటే SHARE చేయండి..  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon