Link copied!
Sign in / Sign up
2
Shares

ఐసీయూలో ఉన్న బిడ్డకోసం ‘’చనుబాలు’’ అమ్మిన గొప్ప తల్లి : ప్రపంచం కన్నీటితో కదిలివచ్చింది

ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమ ఎక్కడైనా ఒకే విధంగా ఉంటుంది అని మరోసారి ఈ తల్లి ద్వారా నిరూపితమైంది. బిడ్డకు ఏమవుతుందోనని విలవిలలాడిపోయి నడిరోడ్డుపైనే చనుబాలు ఇవ్వడానికి సిద్ధమైంది. బిడ్డ కోసం తల్లి పడుతున్న తపన చూసి వేల మంది ప్రజలు ముందుకు రాగా, మేమున్నాం అంటూ స్వచ్ఛంధ సంస్థలు కూడా వచ్చాయి. అసలేం జరిగిందో మీరే చదవండి.

కవల పిల్లలలో ఒకరికి అనారోగ్యం..

చైనాలోని షేన్ జాన్ అనే ప్రదేశానికి చెందిన ఈ దంపతులకు కవల పిల్లలు (బాబు, పాప). తమ కూతురు అనారోగ్యంగా ఉందని, హాస్పిటల్ కు తీసుకెళ్లగా, పాప ఆరోగ్యపరిస్థితి బాగోలేదని ఐసీయూలో ఉంచారు. వైద్యం చేయడానికి 10 లక్షలు ఖర్చు అవుతుందని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. అసలే ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే 10 లక్షలు ఎక్కడ నుండి తీసుకురావాలి, ఎవరు సాయం చేస్తారని ఆ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. కానీ, తల్లి పేగు మాత్రం బిడ్డను బ్రతికించుకోవాలని తపన పడుతోంది.

అమ్మ చేసిన సాహసం..ప్రపంచమే దిగి వచ్చింది

తన బిడ్డను బ్రతికించుకోవడానికి చేతిలో డబ్బులు లేకపోయినా, తపన ఉంది. అందుకే ఒక అట్ట ముక్కపై ‘నేను మీ బిడ్డకు ఒక నిముషం పాలు ఇస్తాను, నా బిడ్డను బ్రతికించుకోవడానికి 100 రూపాయలు ఇవ్వండి’ అని భర్తతో కలిసి ఒక రోడ్ పక్కన చేతిలో తన రెండో బిడ్డను పట్టుకుని నిల్చుంది. ఆ తల్లి కష్టాన్ని చూసి ప్రజలు తమకు తోచినంత సాయం చేయగా, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. బిడ్డకోసం పాలను తీసి కవర్ లలో స్టోర్ చేసి అమ్మి బిడ్డను బ్రతికించుకుంది. ఇప్పుడు ఆ బిడ్డ క్షేమంగా ఉంది. ఆ తల్లి సంతోషంగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

మరో తల్లికి, బిడ్డకు ఇటువంటి కష్టం రాకుండా ప్రభుత్వాలు ఆపదలో డబ్బుల కోసం కాకుండా ప్రాణాలు బ్రతికించే చట్టాలు తీసుకువస్తే బాగుంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్… 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon