Link copied!
Sign in / Sign up
1
Shares

అన్నం మెత్తగా, తెల్లగా రావాలంటే ఈ 2 అద్భుత చిట్కాలు ఫాలో అవ్వండి..

మనదేశంలో ఎక్కువగా అన్నం తినడం అలవాటు. కొన్ని ప్రదేశాలలోనే చపాతీలు, రొట్టెలు తింటూ ఉంటారు. ఐతే కొన్నిసార్లు ఎంత బాగా అన్నం వండినా సరే మెత్తగా, తెల్లగా రాలేదని బాధపడుతూ ఉంటారు మహిళలు. అందుకని ఇక్కడ మీకోసం ప్రత్యేకంగా చిట్కాలు అందిస్తున్నాం. మీకు ఈ చిట్కాలు  ఆనందాన్ని ఇస్తాయని ఆశిస్తున్నాం…

1. మనమంతా ఎక్కువగా తినే బియ్యం బాస్మతి రైస్ కాబట్టి, అన్నం ఉడికించేముందు అందులో 4 లేదా 5 చుక్కలు ఆయిల్ వేయడం వలన అన్నం మెత్తగా, పొడిగా మరియు తెల్లగా వస్తుంది. అదే పాతబియ్యం ఉపయోగిస్తున్నట్లయితే 30 నిముషాల ముందే కొన్ని చుక్కల ఆయిల్ వేసుకోవాలి.

2. అన్నం పొడిగా, తెల్లగా ఉండటానికి, పొంగిపోకుండా ఉండాలంటే రైస్ ఉడుకుతున్నప్పుడు అందులో నిమ్మరసం లేదా కాస్త వెన్న వేయడం వలన పొడిపొడిగా, తెల్లగా వస్తుంది.

3. అన్నం వండుకునేటప్పుడు నీళ్లు, బియ్యం 1:2 రేషియాలో ఉండాలి. అంటే ఒక కప్పు బియ్యానికి, రెండు కప్పుల నీళ్లు అన్నమాట. ఇది మీ అందరికీ తెలిసే ఉండవచ్చు. అదే బ్రౌన్ రైస్ అయినట్లయితే కాస్త ఎక్కువ నీటిని వేసుకోవాలి.

4. రైస్ లో కాస్త ఆయిల్ వేయడం వలన కింద అడుగుభాగం నల్లగా మారదు (అన్నం మాడిపోదు). ఆయిల్ లేదా నిమ్మరసం చుక్కలు వేసుకోవడం వలన పాత్రలు కడుక్కునేటప్పుడు కూడా త్వరగా క్లీన్ చేసుకోవచ్చు, అన్నం మెతుకులు అతుక్కుపోవు.

ఇవి మాకు తెలిసిన చిట్కాలు, ఇంకా మీకు ఇలాంటివి తెలిసి ఉంటే అందరికీ తెలిసేలా COMMENT చేయండి. మీకు నచ్చితే SHARE చేయగలరు.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon