Link copied!
Sign in / Sign up
0
Shares

ఫ్రిడ్జ్ లేకుండా సమ్మర్ లో నీటిని ఎలా చల్లబరచుకోవాలి..! 4 సహజమైన పద్ధతులు మీకోసం..

సమ్మర్ వచ్చిందంటే చాలు, ప్రతి ఒక్కరి ఎండవేడికి భయపడి పోతుంటారు. దాహం దాహం అని చల్లనీటికోసం ఎదురుచూస్తూ ఉంటారు.  అవును వేసవిలో ఎంత ఎక్కువగా నీరు తీసుకుంటే అంతమంచిది. మీ శరీరాన్ని డీ హైడ్రేషన్ నుండి కాపాడుతుంది మరియు వడదెబ్బ తగలకుండా రక్షిస్తుంది. ఐతే చాలామంది ఫ్రిడ్జ్ వాటర్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు, నిజానికి ఇది అంత మంచిది కాదు కూడా. ఫ్రిడ్జ్ లేని వారే కాకుండా ఫ్రిడ్జ్ ఉన్నవారు కూడా ఇక్కడ చెప్పుకునే ఈ సహజ చిట్కాలను ఫాలో అవ్వడం మంచిది. అవేంటో మీరే చూడండి.

కుండ నీరు

సమ్మర్ లో నీరు తాగడానికి ఏదైనా ఉత్తమమైనది ఉంది అంటే మొదటి స్థానంలో ఇదే ఉంటుంది. ఒక మంచి కుండను అందులో నీటిని పోసి ఎండ తగలకుండా ఇసుకలో ఉంచాలి. కుండపై నీళ్లు చల్లడం లేదా ఒక బట్టను కుండ చుట్టూ కట్టి క్లాత్ ను తడుపుతూ ఉండటం వలన నీరు చల్లగా ఉంటాయి. ఈ నీరు తాగడం చాలామంచిది. ఇవి తాగాక ఏ ఫ్రిడ్జ్ అవసరం లేదంటారు.

బకెట్ లో బాటిల్స్ కు క్లాత్ కట్టి..

ఇది మరొక గ్రేట్ ఐడియా. ఒక బకెట్ నిండుగా నీటిని తీసుకుని ఎండ తగలని గదిలో ఉంచుకోవాలి. మీ ఇంట్లో ఉన్న బాటిల్స్ అన్నిటినీ నీటితో నింపి, ఆ బాటిల్స్ కు ఒక్కోదానికి క్లాత్ కట్టి బకెట్ లో వేయాలి. మీకు దాహం వేసినప్పుడు అందులో నుండి తీసుకుని తాగితే నీరు చల్లగా ఉంటాయి. ఇలా బకెట్ లోనే వేయాల్సిన అవసరం లేదు. క్లాత్ కట్టిన బాటిల్ ను అప్పుడప్పుడు తడపటం చాలు.

థర్మో కోల్ బాక్స్

మనం చూస్తూ ఉంటాం ఐస్ అమ్మే వాళ్ళు థర్మో కోల్ బాక్స్ లలో ఐస్ పెట్టుకుని వస్తుంటారు. ఇలాగే కొన్ని ఐస్ ముక్కలు తీసుకుని అందులో నీటిని నింపిన వాటర్ బాటిల్స్ ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన నీరు చల్లగా అవుతాయి.

రాగి చెంబు

రాత్రి పడుకునే ముందు ఒక రాగి చెంబులో నీటిని ఉంచుకుని ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ నీటిని సేవించడం వలన నీరు చల్లగా ఉంటాయి. ఈ నీటిని తాగడం వలన జీర్ణ సంబంధ సమస్యలు ఉండవు. అలాగే రాగి చెంబులో నీటిని ఉంచి చల్లగా ఉండే ప్రదేశంలో పెట్టుకుని సేవించడం కూడా చాలామంచిది.

ఈ సహజ పద్ధతులు ఫ్రిడ్జ్ లేకుండా చేసుకోవచ్చు. ఇది మీకు నచ్చితే అందరికీ SHARE చేయండి.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon