చెవి మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయం. చెవులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోమని మన పెద్దలు ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. ప్రత్యేకంగా చెవులను క్లీన్ చేసుకోవడానికి ఎటువంటి పరికరాలు అవసరం లేదని డాక్టర్లు అంటున్నారు. చెవులలో గులిమిలా ఏర్పడటం వలన మన చెవులను రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మన చెవుల చుట్టూ పేరుకున్న ధూళి, దుమ్మును బయటకు తీయడానికి, ముఖ్యంగా పిల్లల చెవుల చుట్టూ పేరుకుపోయిన మలినాన్ని ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం…
చెవులను క్లీన్ చేయడం ఎలా..!

పసిపిల్లలు చెవులను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి, లేకపోతే దుమ్ము ధూళితో పాటు కంటికి కనిపించనివి చెవులలో ఉండిపోవడం వలన చాలా ఇబ్బంది పడాల్సివస్తుంది. అలాగే ఆడుకునే పిల్లలలో కూడా ఇలా ఎప్పటికప్పుడు చెవులను క్లీన్ చేయడం చేస్తుండాలి. వాళ్ళు బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ ధూళి దుమ్ము చేరుతుంది. అందుకని ఇక్కడ చెప్పుకునే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
క్లాత్ ను వేడి నీటిలో ఉంచి..

పసి పిల్లలకు లేదా ఆడుకునే పిల్లలకు చెవులను శుభ్రం చేయడానికి ఒక బౌల్ లో గ్లాస్ నీళ్లను ఉంచి మరిగించాలి. మరిగిన ఈ నీటిని కాస్త గోరువెచ్చగా ఉండేలా చేసుకుని అందులో శుభ్రంగా ఉండే ఒక పొడి వస్త్రాన్ని ఉంచుకోవాలి. ఇలా చేసిన తర్వాత మరీ ఎక్కువగా నీటిని ఆ క్లాత్ లో ఉంచుకోకుండా చెవుల చుట్టూ, చెవు లోపల బట్టతో తుడుస్తూ శుభ్రం చేయాలి. ఇలా చేయడం వలన చెవుల చుట్టూ పేరుకుపోయిన మురికి దూరం అవుతుంది.
వెల్లుల్లిని నూనెలో వేసి

మన పెద్దలకు ఇది బాగా తెలిసే ఉంటుంది. ఒకటి లేదా రెండు వెల్లుల్లి ముక్కలను కొబ్బరి నూనె గానీ చమురు తీసుకుని అందులో వేసి మరిగించాలి. ఇలా చేసిన తర్వాత పొయ్యి మీద నుండి కిందకు దించి చల్లార్చుకోవాలి. ఈ నూనెను రెండు లేదా మూడు చుక్కలు పిల్లల చెవులలో వేయడం వలన చెవులలో ఉన్న మురికి దూరమవుతుందని అంటారు. వెల్లుల్లిని ఆ నూనె నుండి బయటకు తీసివేయాలి. నూనె చెవులలో వేసిన తర్వాత దూది ఉంచడం చేయాలి.
ఇవి అస్సలు ఉంచకండి

పిల్లలు, పెద్దలు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇయర్ బడ్స్ ను చెవులలో ఉన్న గులిమి తీయడానికి ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం మంచిది కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పిల్లల చెవులలో ఇయర్ బడ్స్ పెట్టడం వలన చెవుడు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే చాలామంది చేతి వేళ్ళు పెట్టి గులిమి బయటకు తీయడం, పిన్నీసులు, షార్ప్ గా ఉండే ఇనుప ముక్కలను పెట్టడం వలన చెవులలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది.
చెవులలో ఇన్ఫెక్షన్స్ ఎలా కనిపెట్టాలి..?

మీ పిల్లల చెవులలో ఇన్ఫెక్షన్స్ ను ఎలా కనిపెట్టాలి అనేది అంత ఇబ్బంది అయినదేమీ కాదు. చెవులలో ఇన్ఫెక్షన్స్ చేరినట్లయితే చెవుల నుండి చీము వస్తుంది. చెవుల నుండి చీము రావడమే కాకుండా, వాసన కూడా వస్తూ ఉంటుంది. ఇలా రావడం వలన పిల్లలు నిద్రపోలేరు, చాలా బాధగా ఉంటుంది కాబట్టి వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళండి.
పిల్లలలో అయినా పెద్దలలో చెవులు చాలా ముఖ్యమైన అవయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాలను ప్రతి ఒక్కరికీ SHARE చేయండి.
