Link copied!
Sign in / Sign up
16
Shares

పిల్లలు పుట్టాక ఖర్చులు పెరిగాయా..! అయితే మీ బడ్జెట్ ను ఎలా అదుపులో ఉంచుకోవాలో ఇక్కడ చూడండి

పెళ్లికి ముందు ఒక బడ్జెట్, పెళ్లి తర్వాత ఒక బడ్జెట్, పిల్లలు పుట్టిన తర్వాత మరో బడ్జెట్, వాళ్ల చదువులు ప్రారంభం అయ్యాక మరో బడ్జెట్.. ఇలా సగటు మనిషి జీవితంలో రోజురోజుకూ ఖర్చులు పెరుగుతాయే తప్ప తగ్గవు. మరి.. ఖర్చులకు అనుగుణంగా ఆదాయం పెరిగితే పర్వాలేదు కాని.. ఆదాయం పెరగకుండా ఖర్చులు పెరిగితే మాత్రం వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

అయితే.. చాలా మందికి పిల్లలు పుట్టిన తర్వాత బడ్జెట్ ను ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా ఖర్చు చేసేవాళ్లు తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందుకే ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా కొట్టినా మొదటికే మోసం వస్తుంది. ఆర్థిక పరమైన విషయాలపై ఇంట్లోని కుటుంబ సభ్యులతోనూ చర్చించడం ఎంతో మంచిది. మీ బడ్జెట్ లోనే పిల్లలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను అందిస్తూ ఆర్థిక ప్రణాళికను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. తప్పనిసరి వస్తువుల విషయంలో రాజీ పడకండి

ఆర్థిక ప్రణాళిక అనగానే.. అన్ని ఖర్చులు తగ్గించడం కాదు. ఉన్న బడ్జెట్ లోనే అవసరమైన, తప్పనిసరి వస్తువులను సమకూర్చుకోవడం. అందుకే.. తప్పనిసరి వస్తువుల విషయంలో అస్సలు రాజీ పడకండి. పిల్లలు పుట్టగానే వాళ్లకు ఏ వస్తువులు అవసరమవుతాయో.. వాటన్నింటినీ కొనాల్సిందే. డైపర్స్, రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్ చేయించడం, న్యూట్రిషన్ ఫుడ్, ఇంకా ఇతర అవసరాలు ఏవైనా ఉంటే.. వాటిని మీరు తీర్చాల్సిందే. మీ పిల్లలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మీ బడ్జెట్ లో ఖచ్చితంగా ఈ వస్తువులను చేర్చాల్సిందే. అందుకే అత్యవసరాలపై ఎప్పుడూ రాజీకి రాకండి.

2. పిల్లలను అతిగారాబం చేయకండి

చాలా మంది తల్లిదండ్రులు లేకలేక పుట్టారనో.. వంశోద్ధారకులనో.. ఇంకా పిల్లల మీద ఉన్న అతి ప్రేమతోనే పిల్లలను ఎక్కువగా గారాబం చేస్తుంటారు. ఇంకా వాళ్లకు గిఫ్టులు, బొమ్మలు ఇలా అనవసర ఖర్చు పెట్టి పిల్లలకు కొనిస్తుంటారు. నిజానికి ఇవన్నీ వాళ్లకు అవసరం లేదు. పిల్లలకు ఆడుకోవడానికి బొమ్మలు అవసరమే కాని.. అది కూడా బడ్జెట్ లోనే తీసుకోవడం ఉత్తమం. లేదంటే బడ్జెట్ పెరిగిపోయి అనవసర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాళ్లను నొప్పించకుండా అవసరమైన వస్తువులను మీ బడ్జెట్ లో కొనివ్వడం మంచిది.

3. మీ సేవింగ్స్ ను ముందే ప్లాన్ చేసుకోండి

పెళ్లి తర్వాత.. మీరు తల్లి లేదంటే తండ్రి కాబోతున్నారని తెలియగానే మీరు సేవింగ్స్ కు ప్లాన్ చేసుకోవాల్సిందే. ఒకసారి ప్రెగ్నెన్సీ రాగానే బడ్జెట్ పూర్తిగా మారిపోతుంది. ఖర్చులు పెరుగుతాయి. బడ్జెట్ పెరిగిపోతుంది. అందుకే బడ్జెట్ కాకుండా నెలనెలా కొంత డబ్బును దాయండి. అది మీకు భవిష్యత్తులో బిడ్డ పుట్టిన తర్వాత అత్యవసరాలకు ఉపయోగపడుతుంది. బడ్జెట్ సరిపోకపోయినా, ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఇంకేదైనా అవసరాకైనా ఆ సేవింగ్స్ మీమ్మల్ని ఆదుకుంటాయి.

4. డ్రెస్సులు అవసరం మేరకే కొనండి

కొంతమంది కుప్పలు కుప్పలు డ్రెస్సులు కొని ఇంట్లో పడేస్తుంటారు. నిజానికి పిల్లలకు ఎక్కువ డ్రెస్సులు కొనకూడదు. అవసరం మేరకే కొనాలి. ఎదిగే పిల్లలకు వాళ్లు ఎదుగుతున్నా కొద్దీ డ్రెస్సులు మార్చాల్సి ఉంటుంది. ఒకేసారి ఎక్కువ డ్రెస్సులు కొనుగోలు చేయడం వల్ల మీ బడ్జెట్ అయిపోతుంది, పిల్లలు వాటిని సరిగా ఉపయోగించడం కూడా జరగదు. అలాగే.. మరీ ఖరీదైన డ్రెస్సులను కూడా పిల్లలకు కొనకండి. నార్మల్ రేంజ్ డ్రెస్సులనే కొనండి. ఎంత ఖరీదు పెట్టి కొన్నా కొన్ని రోజులే వాటిని పిల్లలకు వేస్తారు. తర్వాత వాటి అవసరం ఉండదు. ఇంకా.. వాళ్లకు అవసరమై షూ, చెప్పులు, ఇతర వస్తువులు ఏవైనా సరే మీ బడ్జెట్ లోనే కొనండి.

5. టర్మ్ లైఫ్ ఇన్సురెన్స్ ప్లాన్ తప్పకుండా తీసుకోండి

మీరు డబ్బులు ఖర్చు పెట్టడం ఒక్కటే కాదు బడ్జెట్ అంటే. బడ్జెట్ అంటే అన్ని రకాల ఆర్థిక పరిస్థితులను చూసుకోవడం. మీకంటూ ఓ ఫ్యామిలీ ఏర్పడ్డాక ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మొత్తం మీ మీదే ఆధారపడి ఉంటుంది. మరి.. సడెన్ గా మీకు ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటి? అందుకే.. మీ కుటుంబ సభ్యలు, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, నెలలో కొంత డబ్బును టర్మ్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ కోసం ఉపయోగించండి. అది మీ కుటుంబ సభ్యులకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది.

6. మీ ఆస్తులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోండి

బడ్జెట్ అంటే ప్రస్తుత అవసరాలే కాదు.. మీ కుటుంబ భవిష్యత్తు అవసరాలను కూడా తీర్చాలి. అప్పుడే మీరు మీ కుటుంబానికి సరైన న్యాయం చేసిన వాళ్లు అవుతారు. మీకున్న ఆస్తులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండండి. వాటికి వారసులు, ఇతర లీగల్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉండాలి. దురదృష్టవశాత్తు మీకు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అటువంటి సమయాల్లో మీ పిల్లలకు గార్డియన్ ఎవరు? మీ కుటుంబ బాధ్యతను ఎవరు మోయాలి? మీ ఆస్తుల సంరక్షణ ఎవరు చూసుకోవాలి? లాంటి విషయాల్లో మీరు ఎప్పుడూ అప్ డేటెడ్ గా ఉండాలి.

 

7. మీ పిల్లలకు కావాల్సిన ఫర్నీచర్ తప్పనిసరి

పిల్లలు పుట్టాక వాళ్లకు సపరేట్ ఫర్నీచర్ తీసుకోవాల్సి ఉంటుంది. వాటి విషయంలోనూ మీరు రాజీ పడకూడదు. ఊయల, డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా ఇతర అవసరాల కోసం వాడే ఫర్నీచర్ ను మీ బడ్జెట్ కు అనుగుణంగా కొనండి. అయితే.. ఏ ఫర్నీచర్ తీసుకున్నా.. అది భవిష్యత్తులో మీకు వేరే విధంగా ఉపయోగపడేలా చూసుకోండి. అలా అయితే.. పిల్లలు పెద్దయ్యాక కూడా వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దాంతో మీకు ఆ ఫర్నీచర్ తో ఎటువంటి సమస్యా ఉండదు.

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon