Link copied!
Sign in / Sign up
0
Shares

ఎండ వేడికి మీ చర్మం కమిలిపోతున్నదా... ఈ ఇంటి చిట్కాలు ఫాలో అవండి…


అసలే ఎండాకాలం. సూర్యుడు భగభగా మండుతున్నాడు. ఈ తరుణంలో మిట్ట మధ్యాహ్నం, ఎండ వేడి అధికంగా ఉన్న సమయంలో ఎండలో తిరిగితే ఇక అంతే. ఎండకు చర్మమంతా కమిలిపోతుంది. పెద్దవాళ్లకే అలా ఉంటే.. చిన్నపిల్లల పరిస్థతి. వాళ్ల చర్మం మృదువుగా ఉంటుంది కాబట్టి ఎండ వేడికి వాళ్ల చర్మం త్వరగా కమిలిపోతుంది. ఓ 10 నుంచి 15 నిమిషాలు ఎండలో తిరిగినా ఎండ వేడికి చర్మం కమిలిపోయే అవకాశాలు ఉంటాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో స్కిన్ కేన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.

12 సంవత్సరాల లోపు పిల్లలకు ఎండ వేడి వల్ల చర్మం కమిలిపోతే... వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. వాళ్లను వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. పిల్లల్లో వాంతులు, విరేచనాలు అయినట్లు లక్ష‌ణాలు కనిపిస్తే కనుక ఇవి ఖచ్చితంగా సన్ బర్న్ వల్లనే అని వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

 

సన్ బర్న్(చర్మం ఎందుకు కమిలిపోతుంది) అంటే...

సమ్మర్ లో సూర్యుడు ఎంత రౌద్రంతో ఉంటాడో అందరికీ తెలుసు. సూర్యుడి వేడి మిగితా కాలాల కన్నా.. ఎండాకాలంలోనే ఎక్కువగా ఉంటుంది. అందుకే మన చర్మంపై ఉన్న పొర ఎండ వేడిని తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. అయితే.. అది కొంతమేరకు మాత్రమే మన చర్మాన్ని రక్షించగలుగుతుంది. సూర్యుడి వేడి ఎక్కువైతే మాత్రం చర్మం కమిలిపోకతప్పదు. దీంతో చర్మం కేన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. అందులో పిల్లల చర్మం ఇంకా మృదువుగా ఉంటుంది కాబట్టి.. ఖచ్చితంగా పిల్లలను బయటికి తీసుకెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్స్ చర్మానికి రాసి తీసుకెళ్లడం సేఫ్.

అయితే.. ఈ సన్ బర్న్ అనేది రెండు రకాలుగా ఉంటుంది.

మొదటి రకం సన్ బర్న్

దీని వల్ల చర్మం ఎర్రగా మారిపోవడం, వాపులాగా రావడం, నొప్పి రావడం జరుగుతుంది. దానికి హైడ్రేషన్ కు సంబంధించిన లోషన్ క్రీములను రాయడం వల్ల అవి తగ్గిపోతాయి. కాని.. దానికి కనీసం రెండు నుంచి ఐదు రోజుల సమయం తీసుకుటుంది.

రెండో రకం సన్ బర్న్

ఈ రకం సన్ బర్న్ చాలా ప్రమాదకరమైనది. ఇది చాలా నొప్పిస్తుంది.. వాపు, పొక్కులు వస్తాయి. అయితే.. పొక్కుల వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. అవి చర్మం లోపలి పొరను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

సన్ బర్న్ ట్రీట్ మెంట్ ముందు ఏం చేయాలి?

అయితే.. సన్ బర్న్ ట్రీట్ మెంట్ కోసం ఇంటి చిట్కాలను ప్రారంభించే ముందు దానికి ఫస్ట్ ఎయిడ్ చేయడం ఉత్తమం. అంటే.. సన్ బర్న్ ట్రీట్ మెంట్ తీసుకొని చాన్స్ లేనప్పుడు ఎండ వేడి వల్ల కమిలిపోయిన చర్మం మీద బ్యాండేజ్ పెట్టడం చేయాలి. చిన్న పిల్లలకు పొక్కులు వస్తే మాత్రం వాటిని చిట్లించకండి.

కమిలిన చర్మం మీద నీళ్లలో తడిపిన టవల్ తో రుద్దండి. సన్ బర్న్ పిల్లలను డీహైడ్రేట్ చేసేస్తుంది. అందుకే సన్ బర్న్ తో ఎఫెక్ట్ అయిన పిల్లలకు వెంటనే నీళ్లు లేదా పాలు తాగించండి. లిక్విడ్ లోషన్లను అప్లై

చేయండి. వాజెలిన్ లాంటి పెట్రోలియం ఆధారిత క్రీములను రాయకండి. అవి మంటను పుట్టిస్తాయి.

అయితే.. సన్ బర్న్ కు మంచి ట్రీట్మెంట్ మనో ఇంట్లనే దొరుకుతుంది. మరి.. సన్ బర్న్ కు ఇంటి చిట్కాలేంటో తెలుసుకుందామా...

1.ఓట్ మీల్

చాలా మంది ఓట్స్ ను తమ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారు. అయితే.. సన్ బర్న్ వచ్చినప్పుడు పిల్లలకు స్నానం చేయించే నీళ్లలో ఓట్స్ ను కలపండి. దీంతో ఓట్స్.. సన్ బర్న్ ద్వారా వచ్చే నొప్పిని తగ్గిస్తుంది.

2. ఐస్

ఐస్ నొప్పులకు దివ్యౌషధం. ఓ టవల్ లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి సన్ బర్న్ ఉన్న ప్రాంతంలో టవల్ తో రుద్దండి. దీంతో సన్ బర్న్ నొప్పికి రిలీఫ్ ఇవ్వొచ్చు.

3. అలొవెరా

సహజసిద్ధమైన ఔషధాల్లో నెంబర్ వన్ అలొవెరా. ఇంకా.. సన్ బర్న్ కు కూడా ఇది బెస్ట్ రెమెడీ. అలొవెరా ను డైరెక్ట్ గా కమిలిపోయిన చర్మాన్ని రుద్దొచ్చు. దీని వల్ల కమిలిపోయిన చర్మానికి కొంత వరకు రిలీఫ్ ఉంటుంది.

4. యోగుర్ట్

సన్ బర్న్ చర్మానికి యోగుర్ట్ తో పాటు కొబ్బరి నూనెను కలిపి రుద్దాలి. దీని వల్ల కమిలి పోయిన చర్మం తిరిగి యథాస్థితికి చేరుకొనే అవకాశం ఉంటుంది.

5. పాలు

సన్ బర్న్ కు పాలు కూడా మంచి ఔషధమే. ప్రొటీన్స్, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పాలను కమిలిపోయిన చర్మానికి రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.

6. తేనె

తేనే యాంటిసెప్టిక్ గా పనిచేస్తుంది. అందువల్ల దీన్ని కమిలిపోయిన చర్మం మీద రాస్తే ఖచ్చితంగా కమిలిన చర్మానికి రిలీఫ్ ఉంటుంది.

7. బంగాళదుంప గుజ్జు

బాగా ఉడకబెట్టి.. గుజ్జు గుజ్జుగా చేసిన బంగాళదుంపను కమిలిన చర్మానికి అప్లయి చేయండి. బంగాళదుంపలో ఉండే చల్లని గుణం  బాడీని కూల్ చేస్తుంది. దీంతో శరీరంలో ఉన్న వేడి కాస్త పోయి కమిలిన చర్మం చల్లగా మారుతుంది.

8. బేకింగ్ సోడా

సన్ బర్న్ తో బాధపడుతున్న పిల్లలకు సబ్సుతో కాకుండా బేకింగ్ సోడాతో స్నానం చేయించండి. దీని వల్ల స్కిన్ పై మంటపుట్టదు.

9. సబ్సుతో స్నానం చేయించకండి

సన్ బర్న్ తో బాధపడుతున్న పిల్లకు సబ్సుతో స్నానం చేయించడం చాలా డేంజర్. అది స్కిన్ పై అలర్జీని క్రియేట్ చేస్తుంది. అందుకే.. సబ్బు బదులు బేకింగ్ సోడా లేదా ప్రత్యామ్నాయాలు చూడండి.

 

సన్ బర్న్ నుంచి పిల్లలను కాపాడటానికి ఎండ సమయంలో పిల్లలను బయటికి పంపకండి. ముఖ్యంగా ఉదయం 10 నుంచి 4 వరకు పిల్లలకు అస్సలు బయటికి పంపకండి. ఒకవేళ అనివార్యమైతే.. ఎండ వేడి నుంచి రక్షించే బట్టలను పిల్లలకు వేయండి. ఒకవేళ సన్ స్క్రీన్స్ లాంటివి వాడితే.. ఎస్పీఎఫ్ 30 తో వచ్చే సన్ స్క్రీన్స్ నే వాడండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon