Link copied!
Sign in / Sign up
29
Shares

మీ ఇంట్లోకి దోమలు రాకుండా చేసే అద్భుత చిట్కాలు : ఇలా చేస్తే ఒక్క దోమ కూడా ఉండదు

దోమ..చూడటానికి చిన్నదే అయినా అది కుట్టిన తర్వాత వచ్చే రోగాలు అన్నీ ఇన్నీ కావు.  అందుకే వీలైనంతవరకు దోమకాటుకు దూరంగా ఉండమని చెబుతున్నారు మన పెద్దవాళ్ళు. ఈ సీజన్ లో దోమల బెడద కాస్త ఎక్కువగానే ఉంటుంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ వేటాడి వెంటాడే దోమల  నుండి బయటపడాలంటే ఇక్కడ చెప్పుకునే ఇంటి చిట్కాలను వెంటనే ఫాలో అవ్వండి.

పసుపు లేదా వేపనూనె

సాధారణంగా మురికి నీరు స్టోర్ చేసిన వాటర్, చెత్త చెదారం, మురికినీరు ఉన్నచోట దోమలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఆ చుట్టు పక్కల పసుపు గానీ వేపనూనె వేయడం వలన దోమలు ఆ చుట్టూ దరిచేరవు. అలాగే వేపాకులను ఉంచి పొగపెట్టడం వలన దోమలు మటుమాయమవుతాయి.

తులసి నూనె

ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉన్నవారు, ఇది తప్పకుండా ఫాలో అవ్వండి. తులసి నూనె లేదా లవంగం నూనె తీసుకుని స్ప్రే చేసే బాటిల్ లో ఉంచుకోవాలి. ఇందులో నీటిని నింపుకుని అందులో పైన చెప్పుకున్న ఆయిల్ లో ఏదో ఒకటి కొన్ని చుక్కలు వేసి ఇంట్లో స్ప్రే చేసినట్లయితే ఒక్క దోమ కూడా ఇంట్లోకి రాదు.

వెల్లుల్లి

కొన్ని వెల్లుల్లిలను తీసుకుని చిన్న చిన్న రిబ్బలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వీటిని నీటిలో కొద్దిసేపు మరిగించాలి. మరిగించిన ఈ వెల్లుల్లిని నీటికి ఇంకొంచెం నీటిని కలుపుకుని ఒక స్ప్రే బాటిల్ లో ఉంచుకుని ఇళ్లంతా స్ప్రే చేసుకున్నట్లయితే ఇంట్లోకి దోమలు ప్రవేశించవు.

కర్పూరం

ఒక పెద్ద కర్పూరం బిళ్ళను ఒక క్లాత్ లో ఉంచి, మీ ఇంట్లోకి గాలి వస్తున్న చోటు వేలాడదీయటం వలన ఇంట్లోకి దోమలు రావు. ఎందుకంటే కర్పూరం వాసనకు దోమలు దూరంగా వెళ్లిపోతాయి.

పుదీనా

పైన చెప్పుకున్నట్లుగానే పుదీనా ఆకులను నీటిలో మరిగించి, ఓ బాటిల్ కాసిన్ని నీళ్లు నింపుకుని స్ప్రే చేసుకోవడం వలన ఇంట్లోకి దోమలు ప్రవేశించవు. అలాగే మీ శరీరానికి దోమలు వాలకుండా చేసే మందుకాకుండా పుదీనా ఆయిల్ రాసుకుపోవచ్చు. పుదీనా ఆయిల్ లో నీటిని కలుపుకుని ఇంట్లో స్ప్రే చేసుకున్న సరే సరిపోతుంది.

ఇంకా మీకు తెలిసిన టిప్స్ ఉంటే మాతో COMMENT రూపంలో పంచుకోవచ్చు. అలాగే ఇంకా మీకు వేటి గురించైనా తెలుసుకోవాలని ఉంటే మమ్మల్ని అడగండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon