Link copied!
Sign in / Sign up
13
Shares

ఈ ప్రమాదమైన జబ్బుల నుండి పిల్లలను రక్షించుకోవడం ఎలానో తెలుసుకోండి..?

పసి పిల్లలు చాలా వేగంగా అనారోగ్యం బారిన పడుతుంటారు. ఒక రోజు జలుబు, తగ్గిందనుకునేలోపే కడుపు నొప్పి, వర్ష కాలం వస్తే జ్వరం ఇలా ఎదో ఒక సమస్య వారిని వెంటాడుతూనే ఉంటుంది. హాస్పిటల్ చుటూ తిరిగి మనం అలసి పోతుంటాము. కానీ, చాల వరకు అనారోగ్య సమస్యలను డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా మనమే నియంత్రించుకోగలము. అదే ఎలాగో ఇప్పుడు తెలుసుకుందామా…

సాధారణ జలుబు

ముక్కు కారడం, తుమ్ములు, కొన్నిసార్లు దగ్గు కూడా మీ పిల్లలను వేధిస్తున్నాయా? సాధారణంగా 2-3 రోజుల కంటే ఎక్కువ జలుబు ఉంటుంది. ప్రధానంగా శీతాకాలం మరియు వర్ష కాలంలో పిల్లలు జలుబు ఎక్కువగా చేస్తుంది.

చికిత్స

దగ్గు లేదా జలుబుకు సంబందించిన మందులను ఎక్కువుగా వాడకండి. మీ బిడ్డ నిద్రిస్తున్న గదికి హ్యూమిడిఫైయర్ ని అమర్చండి. మీ బిడ్డ రొమ్ము పాలు త్రాగడానికి నిరాకరించినట్లయితే అతని / ఆమె నీరు లేదా పెడాలియేట్ వంటి ఎలెక్ట్రోలైట్ వంటివి ఇవ్వండి.

డాక్టర్ని సంప్రదించడం

మీ బిడ్డ ఎక్కువ జ్వరంతో బాధపడుతుంటే డాక్టర్ని వెంటనే సంప్రదించండి.

జ్వరం

జ్వరం పిల్లలకు చాలా చికాకు తెప్పించి నీరసంగా చేసేస్తుంది. ఇది జలుబు వలన లేదా ఇన్ఫెక్షన్ వలన వస్తుంది. కొన్ని సార్లు ఏదయినా టీకాకు పరిచర్యగా కూడా రావచ్చు.

చికిత్స

కొందరు తల్లిదండ్రులు పిల్లల ఒళ్ళు కొంచెం వేడిగా అనిపించగానే డాక్టర్ దగ్గరకు వెళ్లిపోతుంటారు. కానీ 101 డిగ్రీల కంటే తక్కువ జ్వరం ప్రమాదకరమైనది కాదు. అందువలన స్వపంగా జ్వరం ఉంటె డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మీరా ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. ముందు పిల్లల బట్టలు తీసెసి వారి శరీరం అంతా తడి గుడ్డతో తుదచండి. ఎక్కువ ద్వావ పదార్థాలు తీసుకునేలా చేయండి.

డాక్టర్ని సంప్రదించడం

జ్వరం 3 రోజుల కన్నా ఎక్కువ ఉన్నా, 102 డిగ్రీలు దాటినా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి.

చెవి నొప్పి మరియు ఇన్ఫెక్షన్

చిన్న పిల్లలు చెవి ఇన్ఫెక్షన్ కు సులువుగా లోనవుతుంటారు. దీని వలన వారికి చెవిలో చీము పట్టడం లేదా నొప్పి కలగడం జరుగుతుంటుంది.

చికిత్స

కొన్ని ఇన్ఫెక్షన్స్ వాతంటత ఏవ్ తగ్గిపోతాయి. కానీ, డాక్టర్ నొప్పి నుండి ఉపశమనం కల్గించడానికి యాంటిబయోటిక్ ఇస్తారు. టైలెనోల్ అనే ఒక టాబ్లెట్ చెవి నొప్పితో బాధ పడుతున్న పిల్లలు సుఖంగా నిద్రపోవడానికి పనికొస్తుంది. యాంటీబయాటిక్స్ ఎక్కువగా వేయకండి.

డాక్టర్ని సంప్రదించడం

మీ చిన్నారి 2-3 రోజుల కన్నా ఎక్కువ చెవి నొప్పితో బాధపడుతుంటే లేదా వారికి ఎక్కువ ఇన్ఫెక్షన్ అయినట్టు మీకు అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ అయితే కర్ణభేరికి గాయం జరిగి వినికిడి శక్తి కోల్పోయే ఛాన్స్ ఉంది.

విరోచనాలు (Diarrhoea)

తరచుగా డైపర్స్ మార్చాల్సి వస్తోందా? గమనించండి, విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. విరోచనాలకు వైరస్, బాక్టీరియల్ సంక్రమణ, ఆహార విషం లేదా అలెర్జీ కూడా కారణమని చెప్పవచ్చు. కొన్నిసార్లు మందులు వేయడం వలన కూడా విరోచనాలు అయ్యే అవకాశం ఉంది.

చికిత్స

డయేరియా సమయంలో, డిహైడ్రాషన్ అనేది ప్రధానమైన సమస్య. ఇది 5-10 రోజుల పాటు కొనసాగుతుంది కావున మీ చిన్నారికి ద్రవాలు చాలా ఇవ్వండి. ఒక వాంతి చేసుకుంటుంటే ఎలక్ట్రోలైట్ పానీయం చిన్న చిన్న మోతాదులో ఇస్తూ క్రమేణా మోతాదుని పెంచండి.

డాక్టర్ని సంప్రదించడం

మీ బిడ్డకు అధిక జ్వరం ఉన్నట్లయితే లేదా లక్షణాలు అధ్వాన్నంగా మారితే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళండి.

ఫ్లూ

జలుబు మరియు ఫ్లూ చిన్న పిల్లలలో అతి సాధారణంగా కనిపించే సమస్య. దీని భారిన పడితే పిల్లలు చాల చికాకుగ, దేని మీద అసతి లేకుండా ఉంటారు. ఇది సులువుగా ఒకరి నుండి ఒకరికి పాకుతుంది. అందువలన దీని నివారించడం అంత సులువైన విషయం కాదు.

చికిత్స

జలుబు చికిత్స లేకుండానే కొన్ని రోజులలో తగ్గిపోతుంది. కానీ, ఆ కొన్ని రోజులు మీ చిన్నారికి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆవిరి పట్టడం వంటివి చేయండి. భవిష్యత్తులో అంటురోగాలను నివారించడానికి టీకాలు వేయించండి.

డాక్టర్ని సంప్రదించడం

5 రోజులలో జలుబు లక్షణాలు తగ్గకపోతే డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం.

కండ్లకలక

కండ్లకలక మీ పిల్లల కళ్ళను ఎర్రగా మరియు కొంచెం ఊడినట్టు చేస్తుంది. ఇది కంటి శ్లేష్మ పొర యొక్క వాపు వలన సంభవిస్తుంది. ఇది సాధారణంగా ఒక కంటిలో మొదలై రెండు కళ్ళకు సోకుతుంది.

చికిత్స

ఇది ఒక వైరల్ సంక్రమణ వలన అయితే, సాధారణంగా ఒక వారం లో దానంతట అదే తగ్గిపోతుంది. మీ బిడ్డ కళ్ళను గోరు వెచ్చని నీటితో కడిగి శుభ్రంగా ఉంచండి. బ్యాక్టీరియా సంక్రమణ చికిత్సకు ఒక యాంటీబయోటిక్ డ్రాప్స్ ఉపయోగించండి.

డాక్టర్ని సంప్రదించడం

ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

ఇక్కడ చర్చించిన అన్ని విషయాల కేవలం సమాచార ప్రయోజనం కోసం మాత్రమే.  కావున, మీ చిన్నారి ఆరోగ్యం గురించి కొంచెం అనుమానం వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి. 

Image Source : wikipedia

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon