Link copied!
Sign in / Sign up
2
Shares

హెన్నా పెట్టుకోవడం వలన చేతులకు ఎందుకు ఇలా రియాక్షన్ వస్తుంది?


చేతులకు అందమైన హెన్నా డిజైన్ వేసుకోవడం అందరికి ఇష్టమే. ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్ రోజైతే ఆడవాళ్ళందరూ కలిసి కూర్చొని హెన్నా పెట్టుకోవడాన్ని వేడుకల చేస్తారు. కానీ పూర్వం హెన్నా కి బదులుగా గోరింటాకు ను నూరి చేతులకు అందంగా పెట్టుకునే వారు. ఈ మధ్య మాల్స్ లో లేదా కొన్ని షాప్స్ లో హెన్నా డిజైన్ వేయించుకోవడం సాధారణంగా జరుగుతుంది. ఇలాంటి చోట్ల డిజైన్ వేయడానికి బ్లాక్ హెన్నా ను వాడుతున్నారు. దీని వలన చాలా ప్రమాదం.

కింది ఫోటోలలో జరిగిన విధంగా రియాక్షన్ వచ్చి చేతులకు దద్దుర్లు, బొబ్బలు రావడం కాలినట్టు అయిపోవడం జరుగుతుంది.

ఇలా మీకు జరగకుండా ఉండాలంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

బ్లాక్ హెన్నా

సహజమైన హెన్నా వాడడం వలన ఎలాంటి రియాక్షన్లు జరగవు. కానీ బ్లాక్ హెన్నా వాడడం వలన అనేక రియాక్షన్స్ చోటు చేసుకుంటాయి. బ్లాక్ హెన్నా లో చాలా ప్రమాదకరమైన ఫ్యారాఫినిలిన్డైమిన్ (Paraphenylenediamine - PPD) ఉంటుంది. ఇది సహజంగా హెయిర్ డై లో వాడుతారు. కానీ నలుపు రంగు త్వరగా రావడానికి దీనిని హెన్నా లో వాడుతున్నారు. దీని కారణంగా చేతులకు రియాక్షన్ వచ్చి బొబ్బలు రావడం, దద్దుర్లు రావడం జరుగుతుంది.

ఎలాంటి హెన్నాను ఎంచుకోవాలి

మీరు మార్కెట్ లో హెన్నా ను కొనే ముందు దాని రంగును పరిశీలించండి. మంచి హెన్నా ఎప్పుడు ఆరంజ్ మరియు ఎరుపు రంగులో మాత్రమే ఉంటుంది. హెన్నా నలుపు రంగులో ఉన్నప్పుడు దానిని ఎప్పుడు వాడద్దు. రంగు త్వరగా రావడానికి అందులో ఎక్కువ శాతం PPD ను వాడుతారు. అది చేతులకు రియాక్షన్ కలిగిస్తుంది.

మీకు ఒకవేళ రియాక్షన్ వస్తే వెంటనే డాక్టర్ ను తప్పకుండా సంప్రదించండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon