Link copied!
Sign in / Sign up
3
Shares

మీ ఇంటి పెరట్లో ఈ 3 మొక్కలు ఉంటే మీకు, మీ పిల్లలకు ఎటువంటి రోగాలు రావు : వెంటనే తెలుసుకోండి

చిన్నా పెద్ద అనే తేడా లేకుండా మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారే. జలుబు చేసినా సరే డాక్టర్ దగ్గరకు లేదా హాస్పిటల్ కు పరుగెత్తుతున్నవాళ్ళు మనలో చాలామందే ఉన్నారు. అయితే ఒకప్పుడు మన పెద్దలు ఎంతో ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండేవారు. దీనికి కారణం ఏంటంటే అప్పట్లో వారు తీసుకునే ఫుడ్ అని మీరనవచ్చు. అది కూడా నిజమే గానీ ఇంకో కారణం కూడా ఉంది. అదేంటంటే ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్కలు. ఈ మొక్కలు దాదాపు ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ ఉండేవి. అవేంటో మీరు తెలుసుకోండి. మీ ఇంటి ఆవరణలలో ఉండేలా చూసుకోండి..

తులసి

మన దేశంలో కొన్ని వందల ఏళ్లగా తులసిని ఒక మొక్కలా కాకుండా దైవంగా భావిస్తున్నారు. తులసిని దాదాపు ప్రతి ఆయుర్వేదంలోనూ ఉపయోగిస్తున్నారు. హిందూ సాంప్రదాయంలో తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. తులసి ఇంటి పెరట్లో ఉండటం వలన ఎటువంటి బాక్టీరియా, క్రిమి కీటకాలు ఇంట్లోకి దరిచేరవు. తులసి మొక్క నుండి విడుదలయ్యే ఆక్సిజన్ ఎంతో స్వచ్ఛమైనదని చెప్పాలి. తులసికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రతి దేవాలయాలలోనూ తులసి ఆకులతో దేవ దేవుళ్ళకు పూజలు చేస్తారు. అందుకే తులసి చెట్టును మీ ఇంట్లో ఉంచుకోండి, ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా చూసుకోండి. ప్రతి రోజూ ఒకటి లేదా రెండు తులసి ఆకులు తినడం కూడా మంచిదే.

కలబంద

ఇది చాలావరకు ప్రతి ఒక్కరి ఇంటి ఆవరణాలలో చూస్తూనే ఉంటాం. కలబంద నుండి తీసిన తాజా గుజ్జును ముఖానికి రాసుకుని కొన్ని నిముషాల శుభ్రం చేసుకోవడం ముఖం తాజాగా కాంతివంతంగా మెరిసిపోతుంది. చర్మ సౌందర్యాన్ని పెంచే సహజసిద్ధమైన మొక్కగా కలబందను అభివర్ణిస్తారు. మీ అందాన్ని పెంచడంలో మాత్రమే కాకుండా ప్రతి రోజూ ఉదయం కలబంద ఆకును తిన్నట్లయితే ఎటువంటి ఉదర సమస్యలు ఉండవని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. సో, ఇది కూడా మీ ఇంటి ఆవరణలో ఉంచుకోవడం మంచిదే.

పుదీనా

మీరు బాగా గమించినట్లయితే పుదీనా ఆకుల నుండి విభిన్నమైన సువాసన వస్తూ ఉంటుంది. తలనొప్పితో బాధపడేవారు ఈ ఆకు వాసన చూసినా చాలు ఇట్టే తగ్గిపోతుందని అంటుంటారు. వాస్తవానికి పుదీనాను తులసి తర్వాత మంచి ప్రాధాన్యత ఉన్న మొక్కగా అభివర్ణిస్తారు మన పెద్దలు. పుదీనా ఆకులను కూడా మన ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. పుదీనా ఆకులను మరిగించిన నీటిలో ఉంచుకుని సేవించడం వలన జ్వరం, ఉదర సమస్యలు, ఛాతీలో మంట, కామెర్లు దూరం అవుతాయని మన ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సో, తెలుసుకున్నారుగా మీ ఇంటి ఆవరణలో ఉండాల్సిన మొక్కల గురించి. ఇంకెందుకు ఆలస్యం  వెంటనే ఇంటికి తెచ్చేసుకోండి. అలాగే తులసి చెట్టు ఇంట్లో పెట్టుకున్నవారు చేయకూడని తప్పులేంటో ఈ కింద లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోండి. ఈ మంచి విషయాలను అందరికీ SHARE చేయండి.

తులసి చెట్టు ఇంట్లో పెట్టుకున్నవారు ఈ 5 తప్పులు చేయకూడదు..

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon