Link copied!
Sign in / Sign up
40
Shares

ఒక్క 5 నిముషాలు టైం వేస్ట్ అనుకోకుండా ఇది చదవండి : నాన్న ఎంత గొప్పవాడో అర్థమవుతుంది..

"ఫాదర్స్ సరిగ్గా గుర్తింపు లేకుండా మిగిపోయిన ఒక పాత్ర అనిపిస్తుంది నాకు. కావ్యాల్లో కానీ, నాటకాల్లో కానీ, సినిమాల్లో కానీ.. అంటే అమ్మని డ్రమటైజ్ చేసినంతగా మనం నాన్న ని ప్రపంచం ముందుకి ఎక్కువ చూపించలేకపోయాం అని అనిపిస్తుంది. కానీ తండ్రి నుండే కదా మనం వారసత్వం తీసుకుంటాం. అంటే ఆయనిచ్చే డబ్బుని కాదు ఆయనిచ్చే పేరుని తీసుకుని ముందుకు వెళతాం. ఫలానా వాళ్ళ అబ్బాయి ఇతను.. ఫలానా వాళ్ల మనవడు ఇతను.. లేదా ఫలానా ఫ్యామిలీ నుండి వచ్చాడు ఇతను అంటాం. అంటే ఫాదర్ దగ్గరనుండి ఇన్ని తీసుకుంటున్నపుడు.. ఫాదర్ దగ్గర నుండి సంస్కారం తీసుకుంటున్నపుడు.. తిరిగి ఏమి ఇవ్వగలం! కృతజ్ఞత?? ఫాదర్ కృతజ్ఞత కోరి మనల్ని పెంచడు కదా.. మరి ఏమి ఇద్దాం? ఒక జ్ఞాపకంగా గుర్తు పెట్టుకుందాం. మర్చిపోవద్దు. మనం అతనికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఫాదర్ తిరిగి మనం థాంక్స్ చెప్పాలని కోరుకోడు." సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో లాంచ్ లో త్రివిక్రమ్ మాటలు ఇవి. నాన్న గురించి నిజంగా అమ్మకి ఇచ్చినంత గుర్తింపు పుస్తకాల్లో సినిమాల్లోనే కాదు బయట ప్రపంచంలో కూడా అమ్మ, నాన్న కి పోలిక వస్తే నాన్న కన్నా అమ్మకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ అమ్మ కన్నా నాన్న మాత్రమే చేయగలిగేవి కొన్ని ఉన్నాయి, అమ్మ కన్నా నాన్న పిల్లలకి ఇవ్వగలిగేవి ఎన్నో ఉన్నాయి. అమ్మ కి ఉండే స్థానం అమ్మదే.. కానీ కొన్ని విషయాల్లో మాత్రం నాన్న తోనే బాగుంటుంది అని పిల్లలు ఫీల్ అయ్యేవి ఉంటాయి.

ఆ విధంగా అమ్మలకన్నా నాన్నలు ఏ విషయంలో బెటర్ గా ఉంటారో ఇప్పుడు చూద్దాం..

1. చిన్న పిల్లలకు నాన్న భుజాల మీద ఎక్కి ఆడుకోవడం అంటే ఏనుగెక్కినంత సరదా.. అమ్మలు కూడా నడుం దగ్గర పట్టుకుని పిల్లల్ని ప్రేమగా ఎత్తుకుంటారు కానీ ఈ విషయంలో మాత్రం అమ్మకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే నాన్న భుజాల మీద ఎక్కడటం అంటే ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఎంతో సరదాగా కూడా ఉంటుంది. అలా చేయడం తండ్రులకు కూడా గర్వంగా అనిపిస్తుంది.

2. పిల్లలకు ఆటలు అలవాటు చేసేది నాన్నలే. కొన్ని సార్లు అమ్మలు కూడా ఈ విషయంలో ముందే ఉంటారు కానీ చాలా మంది అమ్మలకి ఆటలు మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఉన్నా ఆడటం రాకపోవచ్చు. కానీ నాన్నలు మాత్రం వారు ఆడతారు, చూస్తారు, ఎలా ఆడలో అన్నీ తెలుసు కాబట్టి మామూలుగానే వారి పిల్లలకు మొట్టమొదటి కోచ్ అయిపోతారు. ఈ విషయంలో అమ్మలు బాధ పడాల్సింది కూడా ఏమీ లేదు, కాకపోతే పిల్లలతో కలిసి తండ్రి ఆటలాడుతున్నపుడు ఇల్లంతా గ్రౌండ్ లా మార్చేస్తారు అని భయపడటం తప్ప.

3. కొన్ని సార్లు మాములు ఆటలు లాంటివి కాకుండా ఇంట్లోనే పిల్లలతో ఫిజికల్ గేమ్స్ ఆడాల్సి వస్తుంది. అంటే వాళ్ళతో బెడ్ పైన ఫైటింగ్ లు చేయటం, పరుగెత్తుడం, వాళ్ళు పారిపోతుంటే వెంట వెళ్లి పట్టుకోవడం.. ఇలాంటి గేమ్స్ లో అమ్మ కన్నా నాన్నలతోనే పిల్లలకు ఎక్కువ సౌలభ్యం ఉంటుంది.

4. పిల్లలని మాట వినేలా చేయగలిగేది తండ్రులే. ఎక్కువగా పిల్లలు తమ తల్లులతోనే కలిసి ఉంటారు చిన్నప్పటి నుండి. అలాంటి వారికి తల్లి వారి మీద కోప్పడటం, ఏమైనా చెప్పడం లాంటివన్నీ చాలా మాములుగా అనిపిస్తాయి. అలవాటు అయిపోవడం వల్ల పెద్ద సీరియస్ గా తీసుకోకపోవచ్చు. అలాంటి చోట నాన్న మాటనే ఎక్కువగా వింటారు.

5. అమ్మలు చిన్న చిన్న విషయాల్లో కూడా ఎక్కువగా బాధ పడుతూ, భయపడుతూ ఉంటారు. కానీ నాన్నలు టేక్ ఇట్ ఈజీ అనుకుంటారు. ఆటలు ఆడుతున్నపుడు ఏవైనా దెబ్బలు తగిలినా, మార్కులు తక్కువొచ్చినా ఇదంతా ఆటల్లో మామూలే, పర్లేదులే మళ్ళీ సారి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకో అంటారు. ఆ విషయంలో నాన్నలు చాలా స్పోర్టివ్ గా ఉంటూ పిల్లలకు ధైర్యం ఇస్తారు.

6. పిల్లలు నాన్నలతోనే కలిసి బయట ప్రపంచాన్ని చూడటానికి చాలా ఇష్టపడతారు. చాలా సార్లు నాన్న ఏదైనా పని మీద బయటకు వెళ్తుంటే నేను కూడా వస్తాను అంటూ మారాం చేసి మరీ వెంట వెళ్తారు. ఇంకా బయట పార్కులకు, సినిమాలకు, ఏదైనా ఊరికి ట్రావెలింగ్ కి వెళ్ళినపుడు నాన్నతో ఉండాలనే కోరుకుంటారు పిల్లలు.

7. పిల్లలకు కథలు చెప్పడం.. చాలా ఇళ్లల్లో అమ్మలే కథలు చెప్తూ పిల్లల్ని నిద్రపుచ్చుతారు అనుకోండి. కాకపోతే అమ్మలకన్నా ఈ విషయంలో నాన్నలు ఇంకొంచెమ్ బెటర్ అనొచ్చు. కథలు చెప్పేటప్పుడు పిల్లల్లో ఆశ్చర్యాన్ని కలిగించే పాత్రలు గురించి బాగా వర్ణిస్తూ చెప్పడం, సరదా సరదాగా సౌండ్స్ చేయడం, జంతువుల లాగా ఇమిటేట్ చేయటం లాంటివి నాన్నలే కదా చేసేది మరి.

ఇవే కాకుండా మరి కొన్ని ఉన్నాయి.. స్విమ్మింగ్ నేర్పడం లాంటివి అయితే నాన్నలు మాత్రమే చేయగలిగేవి. ఇంకా పిల్లలు కంట్రోల్ తప్పుతుంటే క్రమశిక్షణలో పెట్టేది ఖచ్చితంగా నాన్నే.. పిల్లల ఎదుగుదలలో తండ్రి పాత్ర ఎంతో ప్రముఖమైనది. చాలా మంది జీవితాల్లో విజయం సాధించడానికి వారి వెనుక ఒక ధైర్యంలా, నమ్మకంలా నిలబడేది నాన్నే అనడంలో ఎటువంటి సందేహం లేదు. తప్పు చేస్తే దండించగలడు.. మనకు అవసరం అయితే ఫ్రెండ్ లా సహాయం చేస్తూ ప్రోత్సహించగలడు. మనం జీవితంలో సాధించే ప్రతీ విజయానికి అత్యంత గర్వపడేది, ఆనందించేది ముందుగా తండ్రే. అలాంటి నాన్నకు మనం ఏమి ఇవ్వగలం.. ఏమిస్తే ఆయన రుణం తీర్చుకోగలం.. మనం ఏమి చేసినా ఆ పని వల్ల ఆయన ముఖం మీద చిన్న నవ్వు కదలాడితే చాలు.. ఆ విషయం మాటల్లో చెప్పకపోయినా ఆయన కళ్ళల్లోనే కనిపిస్తుంది. అలాగే మన వల్ల, మనం చేసే పనులు వల్ల వాళ్ళను ఆనందంగా ఉంచితే చాలు.

Cover Pic Image Source.. Times South Music and Movies In Hyderabad

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon