Link copied!
Sign in / Sign up
4
Shares

డెలివరీ తర్వాత జుట్టు రాలిపోతుందా? ఈ హెయిర్ స్టయిల్స్ ట్రై చేయండి!


ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చాక తల వెంట్రుకలు ఊడిపోవడం సహజం. ఇది అసాధారణ విషయమేమీ కాదు, ఇది కొన్ని రోజుల వరకే పరిమితం. అయితే.. బిడ్డ పుట్టిందనే సంతోషం మహిళకు ఒకవైపు ఉంటే.. తల వెంట్రుకలు ఊడిపోతున్నాయనే బాధ మరోవైపు తన్నుకొస్తుంటుంది. అయితే.. డెలివరీ తర్వాత వెంట్రుకలు ఊడిపోవడానికి ఓ బలమైన కారణమే ఉంది. నిజానికి రెండు దశల్లో హెయిర్ మెయింటేనెన్స్ జరుగుతుంటుందట. ఒకటేమో గ్రోత్ ఫేజ్, రెండోది రెస్టింగ్ ఫేజ్. రెస్టింగ్ ఫేజ్‌లో 10 శాతం హెయిర్ అలాగే ఉండిపోతుందట. అది ఊడిపోవడానికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది.

రెస్టింగ్ ఫేజ్ అయిపోయాక.. ఆ 10 శాతం హెయిర్ కాస్త ఊడిపోతుంది. అయితే.. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు హార్మోన్ ప్రభావం వల్ల రెస్టింగ్ హెయిర్ ఊడిపోదు. అలాగే ఉండిపోతుంది. డెలివరీ అయిన తర్వాత.. హార్మోన్ లేవెల్స్ ఎప్పుడైతే నార్మల్ అవుతాయో.. అప్పుడు ఈ రెస్టింగ్ హెయిర్ ఊడిపోవడం ప్రారంభిస్తుంది. ఇది కేవలం కొన్ని రోజుల వరకే పరిమితం కాబట్టి.. మీరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. రెస్టింగ్ పీరియడ్ అయిపోయాక.. అంతా నార్మల్ అవుతుంది. కాని.. జస్ట్ వెంట్రుకలు ఊడిపోయే సమయంలో మాత్రం మీరు కొన్ని హెయిర్ స్టయిల్స్ ఫాలో అయ్యారంటే.. మీ వెంట్రుకలు ఊడుతున్నట్టు కూడా మీకు తెలియదు. ఇంకా.. మీ హెయిర్ స్టయిల్ మీకు అందాన్ని తీసుకొస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. పదండి మీకు ఏ హెయిర్ స్టయిల్ నప్పుతుందో తెలుసుకుందాం.

గుండ్రటి ముఖం ఉన్నవారు
1. షార్ట్ బాబ్ (గోళాకారం)

షార్ట్ బాబ్ గుండ్రని ఫేస్ ఉన్న వాళ్ల ఫేస్‌ను ఇంకాస్త గుండ్రగా చేస్తుందనే విషయం మీకు తెలుసు. అయితే.. మీరు హెయిర్ స్టయిల్ అందంగా కనిపించాలంటే బాబ్ కట్‌ను సెట్ చేయాల్సిందే. లేదంటే దాన్ని ఓ సైడ్‌కు సెట్ చేసినా పర్వాలేదు. ముందు భాగంలో కంటే వెనక భాగంలో చిన్నగా కట్ చేయించండి. దీంతో మీ హెయిర్ పలచగా కనిపించడంతో పాటు మీ ముఖానికి అందాన్ని తీసుకొస్తుంది. దీంతో మీ హెయిర్ ఊడిపోతుందన్న బాధ నుంచి మీరు బయటికి వస్తారు.

2. వేవీ మిడ్ లెన్త్

ఎక్కువ హెయిర్ ఉండి.. రౌండ్ ఫేస్ ఉన్నవాళ్లు ఈ వేవీ మిడ్ లెన్త్ స్టయిల్ ను ట్రై చేయొచ్చు. కర్లర్‌ను ఉపయోగించి మీ లాంగ్ హెయిర్‌ను అలల  రూపంలో సెట్ చేసుకుంటే మీ హెయిర్ చాలా ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు మీ ముఖానికి అందాన్ని తీసుకువస్తుంది.

చతురస్రాకార ముఖం ఉన్నవారు
3. కర్లీ బాబ్ (మెలితిరిగిన జుట్టు)

జుట్టును లేయర్లుగా విడదీసి మెలితిరిగేలా సెట్ చేస్తే ఆ కర్లీ బాబ్ స్టయిల్ ముఖానికి అందాన్ని తీసుకురావడం మాత్రమే కాదు.. హెయిర్ స్టయిల్ కూడా కొత్తగా ఉండటం.. స్టయిల్‌గా ఉండటంతో హెయిర్ లాస్ బాధే ఉండదు. ఈ బాబ్ వల్ల హెయిర్ మెరుస్తూ కనిపిస్తుంది.

ఓవెల్ ముఖం ఉన్నవారు(గోళాకారం)
4. పొడవైన, లేయర్ స్టయిల్

ఓవెల్ ఫేస్ ఉన్నవాళ్లు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే.. వాళ్లకు ఏ హెయిర్ స్టయిలయినా ఈజీగా నప్పుతుంది. అయితే.. హెయిర్ లాస్‌తో బాధపడేవాళ్లకు మాత్రం లాంగ్ అండ్ లేయర్ స్టయిల్ మాత్రం కరెక్ట్‌గా సూటవుతుంది. ఎందుకంటే.. ఈ స్టయిల్‌ను ఈజీగా మేనేజ్ చేయడానికి వీలు ఉంటుంది. ఇంకా.. ఈ స్టయిల్ హెయిర్ నాజూకుగా ఉంటుంది. లేయర్ స్టయిల్ వెంట్రుకలను కొంచెం మెలి తిప్పితే చాలు ఇక.. మీ జట్టు మీకే అందాన్ని తీసుకొస్తుంది. అందుకే.. మీ జుట్టును స్ట్రయిట్‌గా ఎక్కువ సేపు దువ్వకండి. దీని వల్ల మీ జట్టు చాలా పలచగా కనిపించే అవకాశం ఉంటుంది.

పొడవైన ముఖం కలవారు
5. పిక్సీ

చిన్న చిన్న హెయిర్ కట్ పొడవైన ముఖం కలవారికి చాలా చక్కగా సెట్ అవుతుంది. ఈ చిన్న హెయిర్ కట్‌నే పిక్సీ అంటారు. పొడవైన ముఖం ఉన్నవాళ్ల హెయిర్ స్టయిల్ చిన్నగా ఉంటే వాళ్ల ఫేస్ కూడా చిన్నగా కనిపిస్తుంది. దీని వల్ల వాళ్లు పొడవైన ముఖం కలవాళ్లనే విషయాన్ని పెద్దగా గుర్తించలేరు. అయితే.. ఈ హెయిర్ స్టయిల్ చేయించాలంటే కొంచెం దైర్యం ఉండాలి. సాహసం చేయాలి. ఇటువంటి హెయిర్ స్టయిల్ వల్ల జట్టుపైన వలయాల్లాంటివి మాయమైపోతాయి.

హార్ట్ ఆకారంలో ఉన్న ముఖాలు
6. లూజ్ వేవ్స్

హార్ట్ ఆకారంలో ముఖాలు ఉన్నవారికి లూజ్ వేవ్స్ సరిగ్గా నప్పుతాయి. తల నుంచి జాలు వారుతూ దవడను దాటి.. భుజాలను తాకుతూ వెళ్లే ఈ జుట్టు వల్ల మీ ముఖానికే అందం వస్తుంది.

డైమాండ్ ముఖం ఉన్నవారు

7. టౌజుల్డ్ వేవ్స్

లేయర్‌లా విచ్చుకునే జుట్టుకు టౌజుల్డ్ వేవ్స్ కలిస్తే ఆహా.. ఆ జుట్టుకు వచ్చే అందమే వేరు. ఆ స్టయిల్ ఏ ముఖానికైన ఇట్టే సరిపోతుంది. ఈ స్టయిల్ ఫేస్‌ను చాలా సాఫ్ట్‌గా ఉంచుతుంది. అంతే కాదు.. మీ జుట్టు చాలా ఒత్తుగా ఉన్నట్లు అనిపిస్తుంది.

మీ ముఖ ఆకారాన్ని బట్టి ఈ హెయిర్ స్టయిల్‌లో ఏదో ఒకదాన్ని ఫాలో అయిపోయి.. మీ హెయిర్ లాస్ టెన్షన్‌ను కాస్త పక్కన బెట్టండి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon