Link copied!
Sign in / Sign up
15
Shares

హెయిర్ స్పా అంటే ఏమిటి? ఇంట్లో ఎలా చేసుకోవాలి..!

జుట్టు ఒత్తుగా, అందంగా ఉండేదుకు, జుట్టు కుదుళ్ళు బలంగా ఉండటానికి, చుండ్రు సమస్యలు రాకుండా, జుట్టు తెల్లబడకుండా ప్రస్తుతం బ్యూటీ పార్లల్ లలో జుట్టుకోసం చేస్తున్న ప్రక్రియనే హెయిర్ స్పా అని అంటారు. ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి మరియు అందరు మహిళలు బ్యూటీ పార్లల్ కు వెళ్లి చేసుకోలేరు కాబట్టి, ఇక్కడ చెప్పుకునే విధంగా చేసుకోవడం వలన మీ జుట్టును సంరక్షించుకోవచ్చు.. మరి ఎలాగో చూసేయండి, అందరికీ SHARE చేసేయండి.

మొదట ఇలా చేయండి

కొందరి జుట్టు చాలా ప్రకాశవంతంగా, అందంగా మెరిసిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు అరె మన జుట్టు కూడా ఇలా ఉంటే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటుంది. అందుకని ముందుగా బాదం ఆయిల్, ఆలివ్ ఆయిల్ మరియు కోకోనట్ ఆయిల్ లను సమానంగా తీసుకుని గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తల కుదుళ్లకు తగిలేలా సుతిమెత్తగా 10 లేదా 15 నిముషాల పాటు మర్దనా చేసుకోవాలి.

మసాజ్ చేశాక వెంటనే చేయాల్సిన పని

మూడు ఆయిల్స్ తో తలకు మసాజ్ చేసుకున్న 15 నిముషాల తర్వాత వేడి నీటిలో మెత్తటి టవల్ ను కొద్దిసేపు ఉంచి బయటకు తీయాలి. టవల్ లో నీరు లేకుండా చేసుకుని తలా జుట్టుకు ముడివేసుకోవాలి. ఇలా చేయడం వలన అంతకుముందు రాసుకున్న ఆయిల్ మిశ్రమం మీ తల కుదుళ్లకు బాగా చేరుతుంది. ఇలా 15 నిముషాలు కట్టుకుని ఒక గంట తర్వాత తలస్నానం చేయవచ్చు లేదా తర్వాతి రోజు ఉదయం తలస్నానం చేసుకోవచ్చు. తలస్నానానికి షాంపులకు బదులుగా మన పెద్దలు ఉపయోగించిన కుంకుడు కాయ రసం చాలా మంచిది. ఆ తర్వాత ఏదైనా హెయిర్ మాస్క్ లేదా 3 టేబుల్ స్పూన్ల బంగాళాదుంపల రసం, ఒక గుడ్డు మరియు 1 టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసుకుని 10 నిముషాలు ఉంచాలి. ఆ తర్వాత చల్లనినీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అరటిపండు, ఆలివ్ ఆయిల్ మసాజ్

జుట్టును అందంగా, కాంతివంతంగా ఉంచే వాటిలో ఉత్తమమైన చిట్కాలలో ఇది ఒకటి. ముందుగా మెత్తగా పండిన అరటిపండును బాగా గుజ్జుగా చేసుకుని, అందులో ఆలివ్ ఆయిల్ కలుపుకోవాలి. ఆ తర్వాత ఎగ్ వైట్ ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలజుట్టుకు బాగా పట్టించి, పైన చెప్పుకున్నట్లు వేడినీటిలో ముంచిన టవల్ ను తలకు కట్టుకోవాలి. ఒక గంట తర్వాత చల్లని నీటితో తలస్నానం చేసి కండీషనర్ అప్లై చేయడం జుట్టు కాంతివంతంగా అందంగా తయారవుతుంది.

హెయిర్ స్పా చేసుకోవడం వలన జుట్టు చుండ్రు సమస్యలు లేకుండా నివారిస్తుంది.  జుట్టు ఒత్తుగా అందంగా కాంతివంతంగా ఉండేలా తోడ్పడుతుంది. అలాగే జుట్టు త్వరగా తెల్లగా మారకుండా, జుట్టు బలహీనంగా ఉండి రాలిపోకుండా దోహదపడుతుంది.

ఈ విషయాలను అందరితో పంచుకోవడానికి SHARE చేయగలరు.. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon