Link copied!
Sign in / Sign up
50
Shares

తెలుగువాళ్ళ స్పెషల్ వంటకం : గుత్తి వంకాయ కూర రుచిగా 5 నిముషాల్లో ఎలా చేయాలో చూడండి

ఆహా ఏమి రుచి, తినరా మైమరచి అని ఏ మహానుభావుడు చెప్పాడో గానీ ఇది ముమ్మాటికీ అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.  అలా తింటూ  ఉంటే మైమరిచిపోయే ఆనందం గుత్తి వంకాయ కూరలో దొరుకుతుందని మన తెలుగువాళ్లు ఎన్నో సార్లు నిరూపించారు కూడా. అయితే ప్రస్తుతం కొందరు మహిళలు ఈ గుత్తి వంకాయ కూరను ఎలా చేయాలో తెలియక, ఆ కూర అంటే ఇష్టం ఉన్నా సరే చేసుకోలేకపోతున్నారు. అద్భుతమైన రుచిగా ఎలా చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

గుత్తి వంకాయ కూర కావలసిన పదార్థాలు :

వంకాయలు - 500 గ్రాములు

టమోటో - 250 గ్రాములు

ఉల్లిపాయ - ఒకటి

వెల్లుల్లి రిబ్బలు - 5

వేరు శనగపప్పు - 50 గ్రాములు

పచ్చి మిర్చి - 4 లేదా 5

చింతపండు - 10 గ్రాములు

నువ్వుల నూనె - 5 స్పూన్లు

కారం పొడి - 2 స్పూన్లు

ధనియాల పొడి - 2 స్పూన్లు

మెంతులు - ఒక స్పూన్

దాల్చిన చెక్క - చిన్న ముక్క

ఉప్పు - తగినంత

కరివేపాకు - ఒక రెమ్మ

కొత్తిమీర - ఒక రెమ్మ

గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలి..?

1. ముందుగా వంకాయలను శుభ్రంగా నీటితో కడుక్కుని వంకాయలను నాలుగు సమాన భాగాలుగా కోసుకోవాలి, కింద కాడను విడగొట్టకూడదు. ఇలా చేసుకున్న వంకాయలను ఒక పాత్రలో నింపిన ఉప్పు నీటిలో వేసుకోవాలి.

2. చింతపండును ఒక గ్లాస్ నీటిలో వేసి నానబెట్టుకోవాలి.

3. వేరు శనగపప్పు, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అందులోనే కొంచెం ఎండిన కొబ్బరి పొడిలను మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో కొంచెం కారం, పసుపు, ధనియాల పొడి, తగినంత, కొంచెం నూనె వేసి బాగా మిక్స్ చేసుకుని ఇదివరకే కోసుకున్న వంకాయల మధ్యలో ఈ పదార్థాన్ని ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత 15 నిముషాల పాటు ఒక పాత్రలో లేదా ప్లేట్ లో ఉంచుకోవాలి.

4. ఇక చివరిగా ఒక పాన్ తీసుకుని పోపులు జీలకర్ర, ఆవాలు, మెంతులు, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. కొంచెం కలర్ మారిన తర్వాత అందులో మసాలా పెట్టిన వంకాయలను వేసి మూతపెట్టుకోవాలి. కొన్ని నిముషాల తర్వాత అందులో చింతపండు రసం, నీళ్లు మరియు టమోటో ముక్కలను వేసి ఉడికించుకోవాలి.

5. బాగా ఉడికిన తర్వాత రంగు మారిపోవడం జరుగుతుంది. పొయ్యి మీద నుండి కిందకు దించేటప్పుడు అందులో కొత్తిమీర ఘుమఘుమలాడే సువాసనమైన రుచికోసం కొత్తిమీర వేసుకోవాలి.దీంతో మీకు ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ కూర రెడీ అయినట్లే.

ఈ వంటకం మీ ఫేవరేట్ అయినా, ఇది మీకు నచ్చినా వెంటనే SHARE చేయడం మర్చిపోకండి.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon