గురక సమస్యతో బాధపడుతున్నారా..? అయితే నిద్రకు ముందు ఒక్కసారి ఇలా చేస్తే చాలు
సాధారణంగా కొన్ని కొన్ని వ్యాధులు ఇతరులను చాలా ఇబ్బందికి గురిచేస్తూ ఉంటాయి. అటువంటి వాటిలో ప్రత్యక్షంగా ఇబ్బంది పెట్టేది గురక. భార్యభర్తలు కూడా గురక వల్ల గొడవ పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. నిజానికి గురక ప్రమాదమే అని అంటున్నారు వైద్యులు. నిద్ర మధ్యలో ఇతరులను ఇబ్బందికి గురి చేస్తూ తమ ఆరోగ్యాన్ని కష్టాల్లో పెట్టుకుంటున్న ప్రతి ఒక్కరూ ఇక్కడ చెప్పుకునే చిట్కాలు పాటించడం వలన గురక నుండి బయటపడవచ్చు.
గురక ఎందుకు వస్తుంది..?

శారీరకంగా ఎక్కువగా అలసిపోయినప్పుడు, సరైన నిద్ర లేనప్పుడు, ఆస్తమా, మలబద్ధకం, సైనుసైటిస్, మానసిక ఒత్తిడి, వాతావరణ మార్పులు, ఉదర భాగం పైకి చూపిస్తూ నిద్రించడం వలన, ఊబకాయం, మద్యపానం, ధూమపానం సేవించేవారిలో ఈ గురక సమస్య ఎక్కువగా ఇబ్బందిపెడుతూ ఉంటుంది. అందుకని ఈ చిట్కాలను వెంటనే ఫాలో అవ్వండి. మీ ఆరోగ్యానికే మంచిది.
తేనె
ప్రతి రోజూ ఒక స్పూన్ తేనెను ఉదయం లేదా రాత్రి పడుకునేముందు తీసుకోవడం వలన తక్కువ టైం లోనే గురకకు గుడ్ బై చెప్పవచ్చు.
నిద్రించే పొజిషన్
గురక ఎక్కువగా వెల్లకిలా ఉదర భాగం ఆకాశం వైపు ఉండేలా నిద్రిస్తూ ఉన్న వారిలో వస్తుంటుంది. అందుకని అటువంటివారు వెంటనే మీ నిద్ర పొజిషన్ ను మార్చాలి. కుడి, ఎడమ పక్కకు తిరిగి నిద్రించడం, ఎత్తుగా ఉండే తలగడ పెట్టుకోవడం వలన గురక సమస్య ఉండదు.
ఆవు నెయ్యి
ఆవు నెయ్యిని గోరు వెచ్చగా వేడి చేసి ముక్కు రంధ్రాలలో వేసి రాత్రి పడుకునేముందు పీల్చడం వలన గురక సమస్య నుండి బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కొందరిలో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం వలన గురక వస్తూ ఉంటుంది. అందుకని నిద్రపోయేముందు ఆవిరి పట్టుకోవడం వలన గొంతులో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.
అటుకులు

ఒక గుప్పెడు అటుకులు సాయంత్రం పూట తినడం వలన గురక నుండి సులభంగా బయటపడవచ్చని మన పెద్దలు చెబుతూ ఉంటారు.
ఆలివ్ ఆయిల్ మరియు తేనె
అర టీ స్పూన్ తేనె మరియు అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి రాత్రి నిద్రకు ముందు తీసుకోవడం వలన నెమ్మదిగా గురక సమస్య ఉండదు. అలాగే ఒక గ్లాస్ వేడి పాలలో రెండు స్పూన్ల పసుపు కలిపి సేవించడం వలన గురకకు గుడ్ బై చెప్పవచ్చు. ఇంకా ధూమపానం, మధ్యపానానికి దూరంగా ఉంటే గురక ఇబ్బంది ఉండదు.
గురక చాలా ప్రమాదం కాబట్టి అందరికీ తెలిసేలా ఈ ఆర్టికల్ ను SHARE చేయండి..
